Just InternationalJust NationalLatest News

India : ప్రపంచ దేశాల్లో పెరిగిన భారత్ పవర్..శ్రీలంకలో ఎలా ఉంది? పాక్‌ ఏమంటుంది?

India : ఒక దేశంపై ఇతర దేశాలకు మంచి అభిప్రాయం ఉంటే, ఆ దేశాల మధ్య టూరిజం బాగా పెరుగుతుంది. ఆ దేశం నుంచి వెళ్లే విద్యార్థులకు, ఉద్యోగులకు ఇతర దేశాల్లో గౌరవంతో పాటు వీసా ప్రాసెస్‌లు ఈజీ అవుతాయి.

India

విదేశాల్లో భారత దేశం గురించి ఏమనుకుంటున్నారు, గ్లోబల్ మ్యాప్‌లో భారత్ పొజిషన్ ఏంటి? మన పొరుగు దేశాల్లో మనపై ప్రేమ ఉందా లేక పగ ఉందా వంటి విషయాలను తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంటుంది. సరిగ్గా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమిస్తూ ప్రముఖ ఇంటర్నేషనల్ సంస్థ .. ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ ఒక సర్వే రిపోర్ట్‌ను బయట పెట్టింది.

ప్రపంచవ్యాప్తంగా 36 దేశాల్లో 42 వేల మందికి పైగా ఒపీనియన్స్ సేకరించి తయారు చేసిన ఈ రిపోర్ట్‌లో.. భారత్‌(India)పై వరల్డ్ వైడ్‌గా పాజిటివ్ మైండ్‌సెట్టే ఎక్కువగా ఉందని తేలింది. ప్రపంచవ్యాప్తంగా సగటున 45 శాతం మంది భారత దేశంపై పాజిటివ్ యాటిట్యూడ్‌ని ప్రదర్శించగా, 41 % మంది మాత్రం నెగిటివ్ ఒపీనియన్‌ను వ్యక్తం చేశారు.

ఈ గ్లోబల్ సర్వేలో శ్రీలంక మాత్రం భారత్‌పై తమ అపారమైన అభిమానాన్ని చాటుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏకంగా 79 % మంది శ్రీలంక ప్రజలు భారత్‌ను మంచి మిత్రదేశంగా, సానుకూల దృష్టితో చూస్తుంటే.. కేవలం 11 % మంది మాత్రమే నెగిటివ్‌గా రియాక్టయ్యారు.

ఇంకో విషయం ఏంటంటే.. 2024లో శ్రీలంకలో మన దేశానికి ఉన్న ఆదరణ 65 % కాగా, ఇప్పుడు అది ఏకంగా 79 శాతానికి పెరిగింది. అలాగే ఆఫ్రికన్, యూరోపియన్ దేశాల్లోనూ భారతదేశ హవా బాగానే నడుస్తోంది.

కెన్యాలో 71 %, బ్రిటన్‌లో 71 % , జర్మనీలో 63 %, ఇజ్రాయెల్‌లో 60 %, ఇటలీలో 56 % , స్వీడన్‌లో 55% మంది ప్రజలు మన దేశానికి మనస్ఫూర్తిగా సపోర్ట్ ఇస్తున్నారు. ఆసియాలోని జపాన్‌లో 55 %, థాయ్‌లాండ్‌లో 55 %, సింగపూర్ లో 51 % , ఇండోనేషియాలో 50 % మంది భారత్‌ను ఒక గ్లోబల్ పవర్‌గా గౌరవిస్తున్నారు.

అయితే మన చిరకాల ప్రత్యర్థి, దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం ఊహించినట్లే పూర్తిగా విరుద్ధమైన వైఖరిని ప్రదర్శించింది. అక్కడ ఏకంగా 91 % మంది ప్రజలు భారత్‌పై దారుణమైన ప్రతికూల వైఖరితో ఉంటే, కేవలం 7 % మంది మాత్రమే పాజిటివ్‌గా మాట్లాడారు.

రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న రాజకీయ ఉద్రిక్తతలు, సరిహద్దు వివాదాలను బట్టి ఈ ఫలితం పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించదు. మరోవైపు బంగ్లాదేశ్‌లో 42 % మంది భారత్‌కు అనుకూలంగా ఉంటే, 51 % మంది మాత్రం వ్యతిరేకంగా ఉన్నారు.

కాగా ఇదే సమయంలోప్రపంచ పెద్దన్న అమెరికా విషయానికి వస్తే అభిప్రాయాలు సమానంగా విడిపోయాయి. అక్కడ 50 శాతం మంది నెగిటివ్‌గా, 45 % మంది పాజిటివ్‌గా రియాక్టయ్యారు. 2023లో అమెరికన్లలో ఇండియాపై 51 % సానుకూలత ఉండగా, 2026 నాటికి అది 45 శాతానికి పడిపోవడం గమనార్హం.

నిజానికి ఈ తరహా గ్లోబల్ సర్వేల వల్ల ఒక దేశం యొక్క సాఫ్ట్ పవర్ ప్రపంచంలో ఎంత బలంగా ఉందో కొలవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఒక దేశంపై ఇతర దేశాలకు మంచి అభిప్రాయం ఉంటే, ఆ దేశాల మధ్య టూరిజం బాగా పెరుగుతుంది. ఆ దేశం నుంచి వెళ్లే విద్యార్థులకు, ఐటీ ఉద్యోగులకు ఇతర దేశాల్లో గౌరవంతో పాటు వీసా ప్రాసెస్‌లు ఈజీ అవుతాయి.

India
India

అంతేకాకుండా, విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి (FDI) ముందుకు వస్తాయి. ఇది దేశ ఎకానమీని స్ట్రాంగ్ చేస్తుంది. ఐక్యరాజ్యసమితి (UN) వంటి ఇంటర్నేషనల్ వేదికలపై కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతర దేశాల మద్దతు లభించడానికి కూడా ఈ పాజిటివ్ ఇమేజ్ చాలా ఇంపార్టెంట్ కీ రోల్ పోషిస్తుంది.

మొత్తంగా ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో భారతదేశానికి తిరుగులేని ఇమేజ్ మంచి ఆదరణ దక్కినట్లే చెప్పొచ్చు. యూరప్, అమెరికా వంటి దేశాల్లో ఒపీనియన్ మిశ్రమంగా ఉన్నా.. గ్లోబల్ లెవల్‌లో భారత్‌ను ఒక శక్తివంతమైన, బాధ్యతాయుతమైన దేశంగానే మెజార్టీ ప్రజలు నమ్ముతున్నారు. పాకిస్తాన్ , బంగ్లాదేశ్ తప్ప మిగిలిన దేశాలన్నీ భారత్‌ను పాజిటివ్‌గానే చూస్తుండటం భారత దేశ దౌత్యనీతికి లభించిన పెద్ద విజయంగానే చెప్పొచ్చు.

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్..కరూర్ బాదితుల ఉద్యోగాల రద్దు నిర్ణయంపై స్టే

Related Articles

Back to top button