Just SportsLatest News

IND vs SL : శ్రీలంక స్పిన్ సవాల్‌కు భారత్ రెడీ.. మరి బోణీ కొడతారా ?

IND vs SL : మిగిలిన ఫార్మాట్లలో పర్వలేదనిపిస్తున్న టీమిండియా టెస్టుల్లో మాత్రం నిరాశ పరుస్తోంది. ఇలాంటి సమయంలోనే ఇపుడు శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు సిద్ధమయింది.

IND vs SL

భారత్ , శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు శనివారం నుంచే తెర లేవనుంది. గాలె వేదికగా రెండు జట్ల మధ్య తొలి టెస్టు మొదలుకానుంది. సొంత గడ్డపై స్పిన్ ప్రధాన ఆయుధంగా శ్రీలంక బరిలోకి దిగుతోంది. అయితే స్పిన్ ఆడడంలో తడబడుతున్న భారత బ్యాటర్లు లంక స్పిన్నర్లను తట్టుకుని నిలబడగలరా అన్న ప్రశ్న వినిపిస్తోంది.

వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్‌ను గెలవాల్సిన టీమిండియాకు గాలె పిచ్ అసలు సవాల్‌గా మారింది.టెస్ట్ క్రికెట్‌లో కొంత కాలంగా భారత్ ఆటతీరు పేలవంగా ఉంది. స్వదేశంలో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ చేతిలో వరుసగా వైట్ వాష్ పరాభవాలతో మన ఆట ఏ స్థాయికి పడిపోయిందో చెప్పకనే చెప్పింది.

మిగిలిన ఫార్మాట్లలో పర్వలేదనిపిస్తున్న టీమిండియా టెస్టుల్లో మాత్రం నిరాశ పరుస్తోంది. ఇలాంటి సమయంలోనే ఇపుడు శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు సిద్ధమయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు దూరమైన తర్వాత గిల్ కెప్టెన్‌గా భారత జట్టును నడిపిస్తున్నాడు.

ప్రస్తుత సిరీస్‌లో వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరిస్తున్నాడు. యువ రక్తం, దూకుడైన ఆటతీరుతో భారత్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నా కూడా.. గాలె స్పిన్ పిచ్‌పై లంక స్పిన్నర్లను తట్టుకుని నిలబడటం భారత యువ బ్యాటింగ్‌ లైనప్‌కు అతిపెద్ద సవాలు కానుంది. కాగా భారత తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. సర్ఫరాజ్ ఖాన్‌  ,ధృవ్ జురెల్‌లో ఎవరిని తుది జట్టులోకి తీసుకుంటారనేది చూడాలి.

స్పిన్ విభాగంలో పిచ్ పరిస్థితులను బట్టి టీమిండియా ఏకంగా ముగ్గురు ఎడమచేతి వాటం స్పిన్నర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, మానవ్ సుతార్ ముగ్గురు స్పిన్నర్లు ఆడే అవకాశం ఉంది. సిరాజ్‌కు తోడుగా ప్రసిధ్ కృష్ణ కంటే, ఆరడుగుల ఎత్తున్న పంజాబ్ యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ అరంగేట్రం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

IND vs SL
IND vs SL

మరోవైపు ధనంజయ డి సిల్వా కెప్టెన్సీలోని లంక జట్టు సొంతగడ్డపై ఎప్పుడూ ప్రమాదకరమే. ప్రభాత్ జయసూర్య, రమేష్ మెండిస్ వంటి నాణ్యమైన స్పిన్నర్లు భారత బ్యాటర్లకు గట్టి పరీక్ష పెట్టనున్నారు.
గాలె పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది.

తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలించినా మ్యాచ్ ముందుకు సాగే కొద్దీ ఇక్కడ స్పిన్ తిరగడం ఖాయం. ఇలా గత రికార్డులను చూస్తే ఇప్పటివరకు రెండు జట్లు మొత్తం 46 టెస్టుల్లో తలపడగా, భారత్ 22 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.. శ్రీలంక 7 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో 17 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

National Flag : ఆగస్ట్ 15 వరకే పరిమితమైన దేశభక్తి..రోడ్డుపై నలిగిపోతున్న జాతీయ పతాకానికి జవాబిచ్చేదెవరు?

Related Articles

Back to top button