Bigg BossJust EntertainmentLatest News

Weekend Episode : బిగ్ బాస్ హౌస్‌లో కొత్త కెప్టెన్‌గా నరేష్ ..వర్షిణికి షాక్‌తో పాటు హ్యాపీ మూమెంట్

Weekend Episode : నరేష్ కొత్త కెప్టెన్‌గా ఎంపిక కావడం, జీరో మెడల్ టాస్క్ ట్విస్ట్‌లు, వర్షిణి సెంటిమెంట్ ఎపిసోడ్, పుష్పక విమానం టీమ్ సందడితో బిగ్ బాస్ తెలుగు వీకెండ్ ఎపిసోడ్ అప్‌డేట్స్.

Weekend Episode

ఫ్యామిలీ వీక్ కంప్లీట్ అవడంతో శనివారం హౌస్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వీకెండ్(Weekend Episode) కావడంతో ఎప్పటిలాగే హోస్ట్ నాగార్జున అదిరిపోయే డ్యాన్స్‌తో స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చి జోష్ నింపారు. ముందుగా శుక్రవారం ఎపిసోడ్‌ను కంటిన్యూ చేస్తూ కెప్టెన్సీ రేసు రగడను గుర్తు చేశారు.

ముకేష్, వర్షిణి మధ్య జరిగిన గొడవ గురించి ఇద్దరితోనూ మాట్లాడించి క్లారిటీ ఇప్పించారు. ఇక కెప్టెన్సీ రేసులో ఉన్న నరేష్, అమన్, వంశీ, రామకృష్ణలో ఎవరు అర్హులో చెబుతూ కెప్టెన్ అనే అక్షరాలను ఫిల్ చేయాలని హౌస్‌మేట్స్‌కు నాగ్ టాస్క్ ఇచ్చారు. ఎక్కువ మంది హౌస్ మేట్స్ సపోర్ట్‌తో నరేష్ ఈ వారం హౌస్‌కు కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. నరేష్‌ను తన భుజాలపై ఎత్తుకుని వంశీ ఆనందం వ్యక్తం చేయగా, నాగార్జున అధికారికంగా మెడల్ అందజేసి అభినందనలు తెలిపారు.

తర్వాత నాగార్జున హౌస్‌మేట్స్‌ కోసం ఐ యామ్ సారీ, ఐ యామ్ నాట్ సారీ అనే సరికొత్త ఆసక్తికరమైన టాస్క్‌ను ప్రవేశపెట్టారు. ఈ 10 వారాల బిగ్ బాస్ జర్నీలో ఎవరివల్ల ఎందుకు హర్ట్ అయ్యారో చెబితే, అవతలి వారు దానికి సమాధానం చెప్పి సారీ లేదా నాట్ సారీ చెప్పాలని రూల్ పెట్టారు. దీంతో వర్షిణి, శ్వేతా, నీతూ, శివ, నరేష్, అమన్, సుధీర్, వంశీ, రామ్ ప్రసాద్, దేబ్జానీ, త్రిగుణ్ ఇలా ప్రతీ ఒక్కరూ తమ మనసులోని బాధలను బయటపెట్టారు.

కొందరు సారీలు చెప్పుకోగా, మరికొందరు మాత్రం తమ వాదనను సమర్థించుకున్నారు. ముఖ్యంగా రామ్ ప్రసాద్ 2 వారాలుగా ఒకే పాయింట్‌తో గేమ్ ఆడుతుండటంతో, నాగ్ ఆ కార్డ్‌ను చింపేయించి అతన్ని చాణుక్యుడు అంటూ సరదాగా ప్రశంసించారు. సుధీర్ కాలి నొప్పి ఫేక్ అని ముకేష్ వాదించగా, అది నిజమేనని నాగ్ తేల్చిచెప్పారు.

ఆ తర్వాత హౌస్‌లో ఎవరు అసలు ఆటే ఆడటం లేదంటూ ‘జీరో’ మెడల్స్ ఇచ్చే ప్రాసెస్ స్టార్టయింది. సభ్యులందరూ ఒకరికొకరు జీరో ట్యాగ్‌లు ఇచ్చుకోగా, చివరకు వర్షిణి, సుధీర్‌కు సమానంగా ఓట్లు పడ్డాయి. వీరిద్దరిలో టై కావడంతో హౌస్‌మేట్స్ ఓటింగ్ ద్వారా వర్షిణిని సెలక్ట్ చేశారు. ఆమెకు నాగ్ రెడ్, బ్లూ రెండు పిల్స్ ఆఫర్ చేయగా.. ఆమె బ్లూ పిల్ ఎంచుకుంది. దానిలో ఈ సీజన్‌లో ఇకపై కెప్టెన్ అయ్యే అర్హత లేదనే షాకింగ్ పనిష్మెంట్ ఉండటంతో వర్షిణి డిజప్పాయింట్ అయింది. తర్వాత పుష్పక విమానం వెబ్ సిరీస్ టీమ్ హౌస్‌లోకి వచ్చి కంటెస్టెంట్లతో కలిసి సందడి చేశారు.

Weekend Episode
Weekend Episode

ఈ వారం ఫ్యామిలీ వీక్‌లో ఎమోషనల్ టర్న్ ఇస్తూ.. వర్షిణి , రామకృష్ణ కుటుంబాలు రాలేదన్న లోటును తీర్చడానికి నాగ్ ఒక స్పెషల్ ఛాన్స్ ఇచ్చారు. వీరిద్దరిలో ఎవరి తల్లి హౌస్‌లోకి రావాలో హౌస్‌మేట్స్ ఓటింగ్ ద్వారా నిర్ణయించారు. మెజారిటీ ఓట్లతో వర్షిణి విజయం సాధించడంతో ఆమె తల్లి హౌస్‌లోకి రావడంతో.. ఇద్దరూ ఏడ్చుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

ముకేష్, త్రిగున్ కూడా వచ్చి వర్షిణి మదర్‌తో మాట్లాడారు. చివరిగా అందరినీ అలరించేలా అమ్మ పాటకి అందరూ డ్యాన్స్ వేయగా, వర్షిణి మదర్ హౌస్ నుంచి శెలవు తీసుకున్నారు. శనివారం ఎలిమినేషన్స్ ఏమీ జరగకపోగా, ఆదివారం ఎపిసోడ్‌లో(Weekend Episode) ఒక ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని తెలుపుతూ ఎపిసోడ్ ముగిసింది.

SBI Credit Card : ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుదారులకు అలర్ట్..డిసెంబర్ 1 నుంచి రూల్స్ చేంజ్..

Related Articles

Back to top button