Just BusinessJust NationalLatest News

SBI Credit Card : ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుదారులకు అలర్ట్..డిసెంబర్ 1 నుంచి రూల్స్ చేంజ్..

SBI Credit Card : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ 1వ తేదీ నుంచి క్రెడిట్ కార్డ్ ఛార్జీలలో కీలక మార్పులు చేయనుంది. ట్రావెల్, పెట్రోల్ కొనుగోళ్లపై అదనంగా పడే సర్ ఛార్జీలు, మర్చంట్ కోడ్‌లు , అదనపు ట్యాక్స్‌ల భారం పడనుంది.

SBI Credit Card

వచ్చే డిసెంబర్ 1వ తేదీ నుంచి ఎస్‌బీఐ (SBI) కార్డ్ ఛార్జీల నిర్మాణంలో కొన్నిఇంపార్టెంట్ అయిన మార్పులను తీసుకురాబోతోంది. ఈ కొత్త రూల్స్ అమలులోకి రావడానికి మరో 15 రోజుల సమయం మాత్రమే ఉంది. లాస్ట్ మినిట్‌లో ఇబ్బందులు పడకుండా, అనవసరమైన అదనపు సర్ ఛార్జీల భారం పడకుండా ఉండాలంటే మీ మంత్లీ ట్రాన్జాక్షన్లను ముందే సరిగ్గా ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పూర్తి వివరాలు తెలీకపోతే క్రెడిట్ కార్డు వాడకంలో మీ జేబుపై అదనపు భారం పడే అవకాశం ఉంటుంది.

బ్యాంకు వెల్లడించిన సమాచారం ప్రకారం చూస్తే.. ముఖ్యంగా ఫ్యూయెల్, ప్రయాణ ఖర్చులకు (ట్రావెల్) సంబంధించిన కార్డ్ ట్రాన్జాక్షన్లపై అదనంగా సర్ ఛార్జీలు విధించాలని ఎస్‌బీఐ డిసైడ్ అయింది. ఈ సవరించిన రుసుములు అన్ని రకాల ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ కేటగిరీలకు కూడా వర్తిస్తాయి.

ఇక నుంచి ప్రయాణాలు లేదంటే టోల్ ఛార్జీల కోసం చేసే ఒక్కో ట్రాన్జాక్షన్ విలువ రూ.30,000 దాటితే, ఆ మొత్తంపై 1 శాతం అదనపు సర్ ఛార్జీ విధించబోతున్నారు. అంటే ఉదాహరణకు, మీరు క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఒకేసారి రూ.30,000 కంటే ఎక్కువ ట్రావెల్ బుకింగ్స్ చేస్తే, రూ.350 వరకు ఎక్స్‌ట్రా సర్ ఛార్జీ పడుతుంది. దీనికి అదనంగా జీఎస్టీ (GST), ఇతర గవర్నమెంట్ ట్యాక్సులు కూడా తోడవుతాయి. అయితే, ట్రాన్జాక్షన్ విలువ రూ.30,000 లోపే ఉంటే ఎలాంటి ఎక్స్‌ట్రా ఫీజు పడదు. ఇది మొత్తం స్టేట్‌మెంట్ బిల్లుపై కాకుండా, ప్రతీ ఒక్క ట్రాన్జాక్షన్ లెక్కన మాత్రమే మదింపు చేస్తారు.

మరోవైపు పెట్రోల్, డీజిల్ వాహనదారులకు కూడా క్రెడిట్ కార్డ్ వాడకం కాస్త ఖరీదైనదిగా మారనుంది. ఫ్యూయల్ ఖర్చుల లిమిట్‌ను ఒక బిల్లింగ్ సైకిల్ (Statement duration) ప్రాతిపదికన రూ.50,000గా నిర్ణయించారు. ఒక నెలవారీ బిల్లింగ్ సైకిల్‌లో మీ ఫ్యూయల్ ఖర్చులు రూ.50,000 దాటితే, ఆపై చేసే ఖర్చులపై 1 శాతం ఎక్స్‌ట్రా ఫీజు వర్తిస్తుంది. ఉదాహరణకు, మీరు ఒక నెలలో రూ.60,000 విలువైన పెట్రోల్ లేదా డీజిల్ కొంటే , సుమారు రూ.600 వరకు అదనంగా ఫీజు పడుతుంది. ఈ నియమాలు 5172, 5542, 5541, 5983 వంటి స్పెసిఫిక్ మర్చంట్ కేటగిరీ కోడ్‌లకు (MCC) వర్తిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.

ఈ ఎక్స్‌ట్రా ఛార్జీల బాదుడు నుంచి తప్పించుకోవడానికి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్(SBI Credit Card) హోల్డర్స్ వెంటనే తమ నెలవారీ ఖర్చుల ప్యాటర్న్‌ను పరిశీలించుకోవడం మంచిది. ప్రతీ నెలా ఫ్యూయెల్ , ట్రావెల్ కోసం ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారో చూసుకొని, రూ.30,000 , రూ.50,000 పరిమితులను దాటకుండా వేర్వేరు ట్రాన్జాక్షన్లను డివైడ్‌ చేయడం లేదా ఆల్టర్‌నేట్ చెల్లింపు మార్గాలను ఆలోచించడం మంచిది. బిల్లింగ్ సైకిల్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డేట్స్‌ను పక్కాగా గమనిస్తూ లావాదేవీలు చేయడం వల్ల సర్ ఛార్జీల నుంచి రిలీఫ్ పొందొచ్చు.

Doomsday : 66 ఏళ్ల క్రితం నాటి ప్రళయం అంచనా.. నిన్నటితో ముగిసిన డూమ్స్‌డే డేట్ ఎందుకు తప్పింది?

Related Articles

Back to top button