Sunset Clause Relationship : లవ్ విత్ ఎక్స్‌పైరీ డేట్.. డేటింగ్ వరల్డ్‌లో కొత్త ట్రెండ్
Sunset Clause Relationship : ఫ్యూచర్ ఏమవుతుందో, మ్యారేజ్ వరకూ వెళ్తుందో లేదో, ఇంట్లో ఒప్పుకుంటారో లేదోననే అనవసరమైన ఆలోచనలేమీ ఉండవు. ఉన్నంత కాలం ఎలాంటి టెన్షన్లు లేకుండా లైఫ్‌ని చాలా హ్యాపీగా, సరదాగా గడిపేస్తారు.
Sunset Clause Relationship
కాలం మారింది.. జనరేషన్ మారింది.. రోజురోజుకీ బంధాల నిర్వచనాలు కూడా చాలా స్పీడ్‌గా మారిపోతున్నాయి. కానీ ఇప్పుడు డేటింగ్ వరల్డ్‌లో జరుగుతున్న మార్పులు అంతే వేగంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు ప్రేమ అంటే వారిని చావు మాత్రమే వేరు చేస్తాదనుకునేవారు. కానీ ఇప్పుడు జెన్ జీ ట్రెండ్ మాత్రం ఒక నయా ఫార్ములాను ఫాలో అవుతున్నారు.
రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అవ్వక ముందే ఎండింగ్‌కు డేట్ ఫిక్స్ చేసుకుని లవ్ చేసుకోవడమే ఈ సన్ సెట్ క్లాజ్ రిలేషన్‌షిప్ అంటున్నారు ఈ తరం వారు . వినడానికి ఇది ఎంత విచిత్రంగా ఉందో, ఆచరణలో అంతకంటే క్రేజీగా వైరల్ అవుతుంది ఈ కాన్సెప్ట్.
కార్పొరేట్ అగ్రిమెంట్లలో ఒక స్పెసిఫిక్ టైమ్ రాగానే అగ్రిమెంట్ ముగిసిపోయే ఒక రూల్ ఉంటుంది. దాన్నే బిజినెస్ భాషలో సన్ సెట్ క్లాజ్ అంటారు. సరిగ్గా ఈ కాన్సెప్ట్‌ను నేటి తరం తమ లవ్ లైఫ్‌లోకి కూడా తెచ్చేసుకుంది.
ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి రిలేషన్‌షిప్‌లోకి వెళ్లడానికి ముందే.. మనమిద్దరం వచ్చే ఆరు నెలలు లేదంటే ఏడాది మాత్రమే కలిసి ఉందామని.. ఆ పీరియడ్ అయిపోగానే ఎలాంటి రచ్చ, ఏడుపులు లేకుండా ప్రశాంతంగా బై చెప్పేసి ఎవరికి వాళ్లం విడిపోదామని ముందే ఒక డీల్‌కి వచ్చేస్తున్నారు.
ముఖ్యంగా వేరే ఊర్లకు, విదేశాలకు జాబ్స్, చదువుల కోసం వెళ్లేవారంతా ఈ రూట్‌నే ఫాలో అవుతున్నారు. ఈ మైండ్ సెట్ వెనుకున్న సైకాలజీని గమనిస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కనిపిస్తాయి. దీనిలో మొదటిది, ఎమోషనల్ సేఫ్టీ అండ్ రిజెక్షన్ భయం.
ఇప్పటి జనరేషన్ బ్రేకప్ వల్ల వచ్చే డిప్రెషన్, మెంటల్ టెన్షన్లు, చెప్పాపెట్టకుండా హ్యాండ్ ఇచ్చే కల్చర్‌ను చూసి భయపడుతోంది. ముందే విడిపోయే డేట్ ఫిక్స్ చేసుకోవడం వల్ల మైండ్ విడిపోవడం ఖాయం అని ముందే వారు మెంటల్‌గా ఫిక్స్ అయిపోతారు. దీనివల్ల బ్రేకప్ టైమ్‌లో గుండె పగిలే బాధ కానీ, కోలుకోలేని మానసిక గాయాలు కానీ ఏమీ ఉండవని సైకాలజిస్టులు చెప్తున్నారు.
రెండోది హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయడం. ఫ్యూచర్ ఏమవుతుందో, మ్యారేజ్ వరకూ వెళ్తుందో లేదో, ఇంట్లో ఒప్పుకుంటారో లేదోననే అనవసరమైన ఆలోచనలేమీ ఉండవు. ఉన్నంత కాలం ఎలాంటి టెన్షన్లు లేకుండా లైఫ్‌ని చాలా హ్యాపీగా, సరదాగా గడిపేస్తారు.
ఇక మూడోది కమిట్‌మెంట్‌పై ఉండే భయం. జీవితాంతం ఒకే వ్యక్తితో ఉండగలమా, వారితో అన్ని బాధ్యతలు పంచుకోగలమా లేదా అనే డౌట్స్ ఉన్నవారికి, కెరీర్ టెన్షన్లు ఉన్నవారికి ఇదొక సేఫ్ రూట్‌లా పనిచేస్తుంది. పెద్ద పెద్ద బాధ్యతలు నెత్తిన వేసుకోకుండానే లవ్ అనే ఫీల్‌ని పొందడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్‌గా మారింది.

అయితే ఈ ట్రెండ్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని సైకాలజిస్టులు అంటున్నారు. ఇద్దరు వ్యక్తులు ఎంత ప్లాన్ చేసినా వారిద్దరి మనసులు, ఎమోషన్లు అనుకున్నట్లుగా కంట్రోల్‌లో ఏమీ ఉండవు. డెడ్ లైన్ ముగిసే టైమ్‌కి ఇద్దరి మధ్య బాండింగ్ గట్టిగా పెరిగిపోతే మాత్రం విడిపోవడం చాలా కష్టంగా మారుతుంది.
మరోవైపు 6 నెలలకో, ఏడాదికో ఎలాగూ విడిపోతాం కదా అనే థాట్ మైండ్‌లో ఉండటం వల్ల వారి రిలేషన్‌లో ఉండాల్సిన నిజమైన ప్రేమానురాగాలను అనుభవించలేరు. రోజులు గడిచే కొద్దీ వారిద్దరి మధ్య బాండింగ్ తగ్గిపోయే ఛాన్స్ కూడా ఉంది.
మొత్తంగా సన్ సెట్ క్లాజ్ రిలేషన్‌షిప్(Sunset Clause Relationship) అనేది జెన్ జీల స్పీడ్ లైఫ్‌లో తమ మనసును గాయపడకుండా కాపాడుకోవడానికి వాడుతున్న ఒక సైకలాజికల్ ట్రిక్. లవ్‌లో, రిలేషన్‌లో అనవసరమైన డ్రామాలేమీ వద్దు, క్లారిటీ మాత్రమే ముఖ్యమనుకునేవారికి ఇదొక పర్ఫెక్ట్ ఛాయిస్‌గా మారుతోంది.





