Just EntertainmentLatest News

Megastar Chiranjeevi : ఒక సామాన్యుడు మెగాస్టార్‌గా మారిన విశ్వరూపం.. 71వ ఏట అడుగుపెడుతున్న టాలీవుడ్ తిరుగులేని చక్రవర్తి..

Megastar Chiranjeevi : 1978 సెప్టెంబర్ 22న పునాదిరాళ్లు సినిమాతో తన భవిష్యత్తుకు పునాది వేసి.. ప్రాణం ఖరీదు చిత్రంతో తన ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు చిరంజీవి.

Megastar Chiranjeevi

తెలుగు సిల్వర్ స్క్రీన్ హిస్టరీలో చాలామంది స్టార్‌లు వచ్చారు. కానీ మెగాస్టార్ మాత్రం ఒక్కరే. చిరంజీవి అనే ఒక్క మాట వింటే చాలు మెగాభిమానుల నరనరాల్లో పూనకాలు వస్తాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక చిన్న ఊరు మొగల్తూరులో, ఒక కానిస్టేబుల్ ఇంటిలో పుట్టిన కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే ఒక సన్నటి కుర్రాడు.. ఏ బ్యాక్ సపోర్ట్ లేకుండా, కేవలం తన కష్టంతోనే ఆటుపోటులను అధిగమించి ఇప్పుడు టాలీవుడ్‌ను శాసించే ఏకఛత్రాధిపతిగా మారడం అంటే..దాని వెనుక ఒక మహా అద్భుతమైన చరిత్రే దాగుంది.

1978 సెప్టెంబర్ 22న పునాదిరాళ్లు సినిమాతో తన భవిష్యత్తుకు పునాది వేసి.. ప్రాణం ఖరీదు చిత్రంతో తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసిన చిరంజీవి(Megastar Chiranjeevi).. అప్పట్లో ఉన్న రొటీన్ ఫార్ములాస్ అన్నిటినీ బద్దలు కొట్టేశారు. గ్రేస్ అండ్ మాస్ మిక్స్ చేసిన మైండ్ బ్లోయింగ్ డ్యాన్సులు, విజువల్ వండర్‌ వంటి ఫైట్లు, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీతో సౌత్ ఇండియా సినిమా మొత్తం వెండితెరను కళ్లు విప్పార్చి చూసేలా చేశారు.

46 ఏళ్ల అప్రతిహాత ప్రస్థానంలో 150 కి పైగా పిక్చర్స్ చేయడం ఒక ఎత్తైతే.. సరిగ్గా 2024లో అదే సెప్టెంబర్ 22న ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును బంగారు అక్షరాలతో లిఖించుకోవడం మరో ఎత్తు. పద్మభూషణ్ మాత్రమే కాదు, పద్మవిభూషణ్ నుంచి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరకు మెగాస్టార్ అందుకున్న గౌరవాలు తెలుగు జాతికే గర్వకారణంగా నిలబడతాయి.

ఏజ్ అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే అని 70 ఏళ్ల వయసులోనూ చిరు నిరూపిస్తున్నారు . ఎవరూ కలలో కూడా ఊహించని ఎనర్జీతో, విశ్వంభర వంటి విజువల్ వండర్స్‌లో మెగాస్టార్ వేస్తున్న స్టెప్పులు, చేస్తున్న మైండ్ బ్లాకింగ్ స్టంట్స్ చూస్తే ఎవరైనా బాస్‌కు సెల్యూట్ చేయాల్సిందే.

మైక్ ముందు అయినా, వేదికలపైన అయినా చిరంజీవి చూపించే సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఎంతటి సక్సెస్ వచ్చినా కింద పనిచేసే టెక్నీషియన్‌ నుంచి సీనియర్ నటుల వరకూ గౌరవించే సంస్కారం చిరులో చాలా ఎక్కువే ఉంది. మెగాస్టార్‌లోని ఆ ఒదిగి ఉండే గుణమే ఆయనను టాలీవుడ్ పెద్ద దిక్కుగా నిలబెట్టింది.

చిరంజీవి వేసిన ఆ వటవృక్షపు విత్తనమే ఈరోజు టాలీవుడ్‌ను మెగా ఫ్యామిలీగా ఏలుతుంది . ఒకవైపు గ్లోబల్ స్టార్‌గా ప్రపంచాన్ని శాసిస్తున్న కుమారుడు కొణిదెల రామ్ చరణ్, డిజైనర్ అండ్ ప్రొడ్యూసర్‌గా కూతుర్లు సుస్మిత, శ్రీజలతో పాటు.. మరోవైపు జనసేనానిగా ప్రవాహంలా దూసుకెళ్తున్న తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు, అండ్ ఆల్ ఇండియా ఆడియన్స్‌ని ఊపేస్తున్న మేనల్లుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అలాగే సాయి దుర్గా తేజ్, వరుణ్ తేజ్.. చిరంజీవి పేర్చిన ఇటుక ఇటుక ఎక్కి టాలీవుడ్ ఇండస్ట్రీలో నిలబడినవారే.

Megastar Chiranjeevi
Megastar Chiranjeevi

హీరోలు చాలామంది వస్తారు, హిట్లు కొడతారు.. కానీ తరాలు మారినా, దశాబ్దాలు గడిచిపోయినా, బాక్సాఫీస్ రికార్డులను వరుసబెట్టి తిరగరాస్తూ అభిమానుల గుండెల్లో రాజాధిరాజగా నిలిచిపోవడం మాత్రం ఒక్క చిరంజీవికే చెల్లిందంటే అది అతి శయోక్తి కాదు. చిరంజీవి అంటే కేవలం ఒక పేరు కాదు.. అది స్వయంకృషికి నిలువెత్తు నిదర్శనం, ఒక శకం ఇంకా చెప్పాలంటే అదొక మహా ప్రభంజనం. విష్ యు ఎ వెరీ హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi).

Flights : ఆకాశంలో ఫ్లైట్స్ క్రాష్ అవ్వవా? విమానాలు ఢీకొట్టకుండా పైలట్లు వాడే ఫార్ములా ఏంటి?

Related Articles

Back to top button