HealthLatest News

Cellulitis : కాళ్లపై ఎర్రటి వాపు, నెప్పి వేధిస్తోందా? సెల్యులైటిస్ ఏమో చెక్ చేసుకోండి..

Cellulitis : చర్మానికి చిన్న గీత పడినా లేదా చిన్న గాయమైనా సరే, దాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని బ్యాక్టీరియాలు లోపలికి చొరబడి సెల్లులైటిస్ (Cellulitis) కి దారి తీస్తాయి.

Cellulitis

మన శరీరానికి మన చర్మమే ఒక పెద్ద రక్షణ కవచం వంటిది. అందుకే ఆ చర్మానికి చిన్న గీత పడినా లేదా చిన్న గాయమైనా సరే, దాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని బ్యాక్టీరియాలు లోపలికి చొరబడి సెల్యులైటిస్ (Cellulitis) కి దారి తీస్తాయి. ఇది చర్మం పైపొరల వరకే కాకుండా, లోపల ఉండే డెర్మిస్ , సబ్‌క్యుటేనియస్ అనే లోతైన కణజాలాల (Tissues) వరకు వ్యాపించే ప్రమాదకరమైన ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని డాక్టర్లు చెబుతున్నారు.

సాధారణంగా ఇది కాళ్ల దగ్గరే ఎక్కువగా కనిపిస్తుంది. ఎర్రటి వాపుతో పాటు ఆ ప్రాంతంలో వేడి, విపరీతమైన నొప్పి , ముట్టుకుంటే కందిపోయినట్లు ఉండటం దీని ప్రధాన లక్షణాలుగా ఉంటాయి . దీనికి సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇన్ఫెక్షన్ బ్లడ్‌లోకి పాకి ప్రాణాల మీదికి వచ్చే డేంజర్‌ కూడా ఉంది.

అసలు ఈ ఇన్ఫెక్షన్ మన బాడీలోకి ఎందుకు, ఎలా వస్తుందో చూస్తే.. మెయిన్‌గా స్ట్రెప్టోకోకస్ (Streptococcus), స్టెఫిలోకోకస్ (Staphylococcus) అనే బ్యాక్టీరియాలు దీనికి కారణమని డాక్టర్లు చెబుతున్నారు. నిజానికి స్కిన్ పర్ఫెక్ట్‌గా ఉన్నంత వరకు ఈ బ్యాక్టీరియా బయటే ఉంటుంది. ఏమీ చేయలేదు.

కానీ చర్మంపై చిన్న గాయం, ముల్లు గుచ్చుకోవడం, దోమ లేదంటే కీటకం కుట్టడం అలాగే కాళ్ల వేళ్ల మధ్య వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ (Athletes Foot), లేదా పొడిబారడం వల్ల స్కిన్ పగలడం (Cracked Skin) వంటివి జరిగినప్పుడు మాత్రం బ్యాక్టీరియాకి లోపలికి వెళ్లడానికి ఒక దారి దొరుకుతుంది.

బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించగానే వేగంగా విస్తరిస్తూ వాపుతో ఎరుపుదనాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు అలాగే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, కాళ్లలో రక్తం సరిగ్గా ప్రసరించని వారు లేదంటే ఊబకాయం ఉన్నవారిలో ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.

మరి ఈ సెల్లులైటిస్ నుంచి ఎలా బయటపడాలి, ఎలా పోతుంది అంటే.. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఇంటి చిట్కాలతోనో, క్రీమ్‌లు రాస్తేనో తగ్గదు. దీనికి డాక్టర్ సలహాతో యాంటిబయోటిక్స్ (Antibiotics) కోర్స్ తప్పనిసరిగా వాడాల్సిందే. స్టార్టింగ్‌లోనే గుర్తిస్తే ఓరల్ యాంటీ బయోటిక్ టాబ్లెట్లతో 7 నుంచి 14 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది.

Cellulitis
Cellulitis

అయితే ఒకవేళ ఇన్ఫెక్షన్ ఎక్కువయి జ్వరం తగ్గకపోవడం, చలి వంటివి ఉంటే మాత్రం హాస్పిటల్‌లో చేరి IV (సెలైన్ ద్వారా) యాంటీ బయోటిక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు వాపు ఉన్న కాలును కాస్త ఎత్తులో (Pillow support) ఉంచుతూ ఉంటే.. దాని వల్ల రక్తప్రసరణ మెరుగై నొప్పి, వాపు త్వరగా తగ్గిపోతాయి.

అసలు ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా చర్మాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా, తేమగా ఉంచుకోవాలి. అలాగే చిన్న గాయం అయినా సరే నిర్లక్ష్యం చేయకుండా డిసిన్ఫెక్ట్ చేయడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండొచ్చు.

Emotional Check Out : ఒకే ఇంట్లో ఉన్నా అపరిచితుల్లా మారిపోతున్నారా?..ఎమోషనల్ చెక్ అవుట్ అంటే అదేనా?

Related Articles

Back to top button