Just Andhra PradeshJust PoliticalLatest News

Free Bus : ఇకపై ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం.. మొగల్తూరు వేదికగా సీఎం ప్రకటన..

Free Bus : ఏసీ బస్సుల్లో కూడా మహిళలు పైసా ఖర్చు లేకుండా హ్యాపీగా, చల్లగా ప్రయాణించొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు.

Free Bus

ఆంధ్రప్రదేశ్ మహిళలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటివరకు సాధారణ బస్సులకే పరిమితం అయిన ఫ్రీ బస్సు ప్రయాణాన్ని ఇకపై ఏకంగా ఏసీ బస్సులకు కూడా వర్తింపజేస్తూ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇకపై ఏపీలో కొత్తగా అందుబాటులోకి రాబోయే ఏసీ బస్సుల్లో కూడా మహిళలు పైసా ఖర్చు లేకుండా హ్యాపీగా, చల్లగా ప్రయాణించొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు.

మొగల్తూరులో ఘనంగా నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా.. సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్న సందర్భంగా చంద్రబాబు ఈ క్రేజీ అప్‌డేట్‌ను బయటపెట్టారు. చంద్రబాబు నోటి వెంట ఈ మాట విన్న వెంటనే అక్కడున్న మహిళలంతా ఈలలు, చప్పట్లతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు.

కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపి ఏపీ రూపురేఖలను వేగంగా మారుస్తున్నామని అన్న చంద్రబాబు.. సంక్షేమాన్ని, డెవలప్మెంట్‌ను రెండు కళ్లుగా చూస్తూ తమ గవర్నమెంట్ నడుస్తోందని వివరించారు.

కేవలం పెన్షన్ల కోసమే ఇప్పటివరకు ఏకంగా రూ. 73,000 కోట్లను పేదల చేతిలో పెట్టామంటేనే తమ కమిట్‌మెంట్ ఏ విధంగా ఉందో ప్రజలంతా అర్థం చేసుకోవచ్చన్నారు. ఇవే కాకుండా మన ఇంటి ఆడపడుచుల కష్టాలను దగ్గరుండి చూశాం కాబట్టే ప్రెజర్ లేకుండా వంట చేసుకునేలా దీపం స్కీమ్‌కు ప్రాణం పోశామని సీఎం గుర్తుచేశారు.

Free Bus
Free Bus

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అలాగే వైసీపీ నేతల వైఖరిపై చంద్రబాబు మండిపడ్డారు. యువత ఫ్యూచర్‌ను దెబ్బతీస్తూ మెగా డీఎస్సీని ఆపేయడానికి ఏకంగా 350 కేసులు వేసి అడ్డుపడే ప్రయత్నాలు చేశారని ఫైర్ అయ్యారు.

ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ఏపీ డెవలప్మెంట్‌ స్పీడ్‌ను ఎవ్వరూ ఆపలేరని సీఎం గట్టి వార్నింగ్ ఇచ్చారు. కూటమిలోని పార్టీలన్నీ కూడా కేవలం ప్రజల బాగు కోసమే ఒక్కటై ముందడుగు వేశాయని గుర్తు చేసిన చంద్రబాబు..బాధ్యతగల ప్రభుత్వంగా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి చిన్న వాగ్ధానాన్ని కూడ నెరవేర్చి తీరుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Bank Jobs : 13 వేలకు పైగా బ్యాంకింగ్ ఉద్యోగాలు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే..

Related Articles

Back to top button