Just BusinessJust NationalLatest News

Gold : మళ్లీ పసిడి పరుగులు..మళ్లీ రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధర

Gold : సిల్వర్ ధరలు పెరగడానికి డిమాండ్ ఒక్కటే కారణం కాదు. పుత్తడితో పోలిస్తే సిల్వర్‌ వాడకం ఇండస్ట్రియల్ సెక్టార్‌లో చాలా ఎక్కువ ఉంటుంది.

Gold

నిన్నటి వరకు కాస్త తగ్గినట్టే కనిపించి పసిడి ధరలు మరోసారి రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్లాయి. కేవలం పసిడి మాత్రమే కాదు, దానితో పాటు సిల్వర్ కూడా పోటీపడి మరీ కాస్ట్ పెంచేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో జరుగుతున్న అనూహ్య పరిణామాలు, రూపాయి కరెన్సీ విలువలో మార్పులు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని అనిశ్చితి వల్లే ఈ రేట్లు ఇలా ఆకాశాన్ని తాకుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

మంగళవారం రోజు హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర ఏకంగా రూ. 1లక్ష59వేల మార్కును తాకింది. నిన్న ట్రేడింగ్ సెషన్‌లో ఇదే 10 గ్రాముల గోల్డ్ కాస్ట్ రూ. 1లక్ష57వేల290 వద్ద ఉండగా, ఒక్క రోజులోనే ఏకంగా రూ. 1,710 పెరిగి కొనుగోలుదారులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, ప్రొద్దుటూరు వంటి మెయిన్ సిటీలలో కూడా రేట్లు ఇదే రేంజ్‌లో భయపెడుతున్నాయి. మరోవైపు మనం సాధారణంగా జ్యువెలరీ తయారీకి వాడే 22 క్యారెట్ల గోల్డ్ కాస్ట్ కూడా 10 గ్రాములకు రూ. 1లక్ష41వేల290గా ఉంది. గ్లోబల్ మార్కెట్‌లోని స్పాట్ గోల్డ్ రేట్ చూస్తే ఔన్సుకు 4,434 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతుంది.

గోల్డ్ సంగతి అలా ఉంటే, సిల్వర్ కూడా కొత్త రికార్డుల వైపు పరుగులు తీస్తోంది. మంగళవారం మార్కెట్‌లో కేజీ వెండి ధర ఏకంగా రూ. 2లక్షల43వేల230 కి చేరింది. సోమవారం రోజు రూ. 2లక్షల38వేల571గా ఉన్న కేజీ సిల్వర్ ధరపై ఒక్కరోజే ఏకంగా రూ. 4,659 వరకూ పెరిగిపోయింది.

Gold
Gold

ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్‌లో సిల్వర్ ధర ఔన్సుకు దాదాపు 66 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అయితే సిల్వర్ ధరలు ఇలా పెరగడానికి డిమాండ్ ఒక్కటే కారణం కాదు. పుత్తడితో పోలిస్తే సిల్వర్‌ వాడకం ఇండస్ట్రియల్ సెక్టార్‌లో చాలా ఎక్కువ ఉంటుంది.

ముఖ్యంగా ఎలక్ట్రానిక్ సెక్టార్, సోలార్ పవర్ ప్రాజెక్టులతో పాటు ఇతర పారిశ్రామిక ఉత్పత్తుల్లో వెండిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అందుకే ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి వచ్చే డిమాండ్‌లో చిన్న ఛేంజ్ వచ్చినా, ఆ ఎఫెక్ట్ సిల్వర్ ధరలపై చాలా డైరెక్ట్‌గా పడుతుంది.

Shopping Bill : షాపింగ్ బిల్లులు కొన్ని రోజులకే మాయమవుతున్నాయా? మరి గ్యారంటీ, వారంటీ మాటేంటి?

Related Articles

Back to top button