Just LifestyleLatest News

True Friends : మీ ఎమోషన్స్ అర్థం చేసుకునే ట్రూ ఫ్రెండ్స్‌ను గుర్తించాలా? వారిలో ఈ 5 విషయాలు ఉన్నాయేమో చూడండి?

True Friends : ఎప్పుడూ కూడా మన ఎమోషన్స్‌కు విలువ ఇచ్చే వారిని స్నేహితులుగా ఎంచుకోవడమనేది చాలా చాలా ఇంపార్టెంట్.

True Friends

మనం సొసైటీలో మనుగడ సాగించాలన్నా, వృత్తి పరంగా ఎదగాలన్నా లేదంటే కాసేపు మైండ్ రిలాక్స్ చేసుకోవాలన్నా కూడా మనకంటూ ఒక ఫ్రెండ్స్ సర్కిల్ ఉండటం చాలా ఇంపార్టెంట్. కానీ అందరికీ ఈజీగా స్నేహం చేయడానికి ముందుకు వెళ్లరు. ఎవరు ఎలాంటి వారోనని భయపడుతుంటారు.

అలాగే కొంతమందికి కొత్తవారితో కలవడం కానీ, స్నేహం చేయడం కానీ పెద్దగా ఇష్టపడరు. కానీ మన ఫీలింగ్స్‌ను గౌరవిస్తూనే, మనం మరింత ఎదగడానికి తోడ్పడే మంచి ఫ్రెండ్స్‌ను ఎలా సెలక్ట్‌ చేసుకోవాలో తెలుసుకోవడానికి ఐదు పాయింట్లను ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.

ఎప్పుడూ కూడా మన ఎమోషన్స్‌కు విలువ ఇచ్చే వారిని ఎంచుకోవడమనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం చెప్పే ప్రతి మాటకూ అవతలి వ్యక్తి కరెక్ట్ కరెక్ట్ అని తలాడించాల్సిన అవసరం లేదు. కానీ మనం ఒక విషయాన్ని వ్యక్తం చేసినప్పుడు దాన్ని చిన్నచూపు చూడటం, వెంటనే సలహాలు ఇవ్వడం వంటివి చేయకూడదు. అసలు మనం ఆ సమయంలో ఏం ఫీలవుతున్నామో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవారే నిజమైన ఫ్రెండ్స్. అలాంటి వారి దగ్గరే మనం ఎలాంటి సంకోచం లేకుండా ఓపెన్‌గా మాట్లాడగలుగుతాం.

అలాగే మన అభివృద్ధికి తోడ్పడే వారితోనే మన స్నేహం కంటిన్యూ చేయాలి. మనం చేసే ప్రతీ పనిని ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు నిరుత్సాహ పరచకుండా ఉండే మైండ్ సెట్ ఉండే పర్సన్స్‌తో స్నేహాన్ని పెంచుకోవాలి. మనకు ఇష్టమైన టార్గెట్‌ వైపు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తూ, కంఫర్ట్ జోన్ దాటి బయటకు వచ్చి కొత్త విషయాలు నేర్చుకునేలా.. సపోర్ట్ చేసే వ్యక్తులు పక్కనుంటే మనం అనుకున్న లక్ష్యానికి చేరుకోవడం చాలా ఈజీ అవుతుంది.

మన విజయాలను చూసి మనస్ఫూర్తిగా ఆనందించేవారు ఉండాలి. ఏదైనా మంచి వార్త చెప్పినప్పుడు ఎదుటివారు రియాక్ట్ అయ్యే విధానాన్ని బట్టి వారి మైండ్ సెట్ ఎలాంటిదో తెలిసిపోతుంది. మన జీవితంలో ఏ చిన్న మంచి జరిగినా జెలస్‌గా ఫీలవుకుండా సంతోషించేవారు మనకు దొరికితే వారిని అస్సలు వదులుకోకూడదు.

True Friends
True Friends

అలాగే ఒకరికి ఒకరు సమయం ఇచ్చుకున్నావారయి ఉండాలి. హెల్దీ ఫ్రెండ్షిప్‌లో లెక్కలు వేసుకోవాల్సిన పని లేదు. కానీ కేవలం ఒక్కరే ఫ్రెండ్షిప్‌ను నిలబెట్టడానికి కష్టపడకూడదు. మెల్లగా ఈ బంధం ఇద్దరికీ ముఖ్యమే అన్న ఫీలింగ్ ఇద్దరిలోనూ కనిపించాలి.

మన ఉనికికి విలువనిచ్చేవారితో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలి. మనకు ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తులు మన జీవితం గురించి, క్షేమ సమాచారాల గురించి అడుగుతారు. మనం చెప్పిన చిన్న చిన్న విషయాలను కూడా గుర్తు పెట్టుకుంటారు. వారితో ఉంటున్నపుడు మన ఉనికి వారికి నిజంగా సంతోషాన్నిస్తుందనే నమ్మకాన్ని వారు కలిగించేవారిని కూడా వదులుకోకూడదు.

Emotional Availability : పార్ట్‌నర్స్ ఆలోచనలు కలిస్తే సరిపోదా? బంధంలో ఎమోషనల్ అవైలబిలిటీ అవసరమా?

Related Articles

Back to top button