Five Forms of Lord Venkateswara : తిరుమల శ్రీవారి గర్భగుడిలో ఉండే 5 విగ్రహాలు.. ఏ మూర్తిని పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తుంది?
Five Forms of Lord Venkateswara : మూల విగ్రహంతో పాటు కౌతుక బేరం, ఉత్సవబేరం, స్నపన బేరం, బలిబేరం అనే విగ్రహాలు పూజలందుకొంటాయి.
Five Forms of Lord Venkateswara
కలియుగ ప్రత్యక్ష దైవమైన ఏడుకొండల వేంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల క్షేత్రం భూలోక వైకుంఠంగా భాసిల్లుతోంది. అందులోనూ గర్భగుడిలో గల ఆనంద నిలయంలో పూజలు అందుకునే స్వామివారి దివ్య రూపాలను దర్శిస్తే జన్మ ధన్యమవుతుందని భక్తులు నమ్ముతారు.
అయితే శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం కనుక చూస్తే.. కేవలం మూలవిగ్రహం ఒక్కటే కాదు.. మొత్తం ఐదు రకాల విగ్రహాలు(Five Forms of Lord Venkateswara) కూడా ప్రతీరోజు అర్చనలందుకుంటాయి. అంటే మూల విగ్రహంతో పాటు కౌతుక బేరం, ఉత్సవబేరం, స్నపన బేరం, బలిబేరం అనే విగ్రహాలు పూజలందుకొంటాయి. వీటినే పంచబేరాలు అని పండితులు పిలుస్తారు.
ఈ ఐదింటిలో ఏ విగ్రహాన్ని దర్శించినా కూడా సాక్షాత్తు మూలమూర్తిని దర్శించుకున్నట్లే అవుతుందని వేంకటాచల మహాత్యం చెబుతోంది. ఈ పంచబేరాలలో.. గ్రామ శ్రేయస్సు కోసం పూజలు అందుకునే స్థిరమైన మూలవిగ్రహాన్ని ధ్రువబేరం అంటారు. ఈ విగ్రహం అత్యంత పవిత్రమైనదిగా.. స్పర్శకు అతీతమైనదిగా చెబుతారు. కాబట్టి ధ్రువబేరంకి డైరెక్టుగా ప్రతిరోజూ అభిషేకాలు చేయరు.
అందుకే రోజూవారీ తిరుమంజనం, పాలు, నెయ్యి, తేనెతో అభిషేకాలను చేయడానికి వెండి , పంచలోహాలతో చేసిన కౌతుక బేరంను వేద పండితులు వాడుతారు. ముందు మూల విగ్రహంలోని దివ్యశక్తిని కౌతుకబేరంలోకి ఆవాహన చేసి పూజలన్నీ చేశాక, సాయంత్రానికి తిరిగి ఆ శక్తిని మూలమూర్తిలోకి ప్రవేశపెడతారు. దీన్నే ఉద్వాసన ప్రక్రియ అంటారు.
ఇక మూడోది ఉత్సవాల్లో మాడవీధుల్లో ఎప్పుడూ ఊరేగే ఉత్సవబేరం. ఈ ఉత్సవ విగ్రహాన్నే మనం భక్తిశ్రద్ధలతో మలయప్పస్వామి అని పిలుచుకుంటాం. అలాగే నాలుగోదైన స్నపన బేరంను కోనేటి వద్ద చక్రస్నానం, విశేష తిరుమంజన సేవల కోసం ఉపయోగిస్తుంటారు.

పంచబేరాలలో చివరిది ఐదోది బలిబేరం. మూలవిగ్రహానికి నివేదించిన ప్రసాదాన్ని శ్రీవారి ఆలయంలోని పరివార దేవతలకు బలి అన్నంగా సమర్పించడానికి ముందు ఈ బలిబేరానికే అర్చనలు చేస్తారు.
అందుకే తిరుమల శ్రీవారి దర్శనానికి ముందే ఈ ఐదు మూర్తుల అంతరార్ధాన్ని తెలుసుకుని.. స్వామివారిని దర్శించుకుంటే కనుక సకలాభీష్టాలు సిద్ధించి, సంపదలు కలుగుతాయి.
Leaftronics : ఈ-వేస్ట్ సమస్యకు శాశ్వత చెక్ ..చెట్టు ఆకుల్లో దాగున్న ఎలక్ట్రానిక్ సీక్రెట్ ఏంటి?




