Just LifestyleLatest News

Single : మీరు ఒంటరిగా ఉంటున్నారా? ఏకాంతంగా ఉంటున్నారా? సెల్ఫ్ ఐసోలేషన్ ఎందుకు పెరుగుతోంది?

Single : మనం కావాలని వెళ్లినా, లేదా పరిస్థితులు మనల్ని అలా నెట్టినా.. గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం మనసు రకరకాల ఇబ్బందులను ఫేస్ చేస్తుంది.

Single

కొన్నిసార్లు ఎవరితోనూ మాట్లాడకుండా ఫోన్ పక్కన పెట్టేసి ప్రశాంతంగా గడపాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ, అలా అనుకోవడం వేరు.. నిజంగానే సొసైటీతో, స్నేహితులతో బంధాలను తెంచేసుకుని తన చుట్టూ తాను ఒక గోడ కట్టుకుని జీవించడం వేరు. సైకాలజీలో దీనినే సెల్ఫ్ ఐసోలేషన్ అంటారు.

అంటే మనల్ని మనమే అందరికీ దూరం చేసుకోవడం. ఇదొక చిత్రమైన మానసిక స్థితిగా చెబుతారు. దీనిలో కొంతమందికి ఇది అలసట నుంచి కోలుకోవడానికి పని చేసే ఒక విశ్రాంతిగా మారితే .. మరికొందరికి మాత్రం మనసు గాయపడి లోపల పడుతున్న బాధకు నిశ్శబ్ద సంకేతంగా నిలుస్తుంది.

నిజానికి ఒంటరిగా(Single) ఉండాలని అనుకుంటూ తమతో తాము గడపడం ఏకాంతం అవగా.. ఒంటరితనాన్ని అనుభవించడమనేది లోన్లీనెస్‌ అవుతుంది. రోజంతా పనులతో అలసిపోయి.. కాసేపు మనశ్శాంతి కోసం కావాలని ఒంటరిగా(Single) గడపడం రీఛార్జ్ అవ్వడం వంటిది. ఇక్కడ మనమే కావాలని స్పేస్ కోరుకుంటాం. కానీ, ప్రతిసారీ మనం కావాలని ఒంటరయ్యే పరిస్థితులుండవు.

కొన్నిసార్లు లైఫ్‌లో వచ్చే కొన్ని పరిస్థితులు బలవంతంగా ఒంటరితనంలోకి నెట్టేస్తాయి. చదువు కోసమో, ఆఫీసు పనుల కోసమో కొత్త ఊరు వెళ్లినప్పుడు చుట్టూ తెలిసినవాళ్లు ఎవరూ లేకపోవడం.. మనం ఇష్టపడిన వ్యక్తి మనల్ని వదిలి వెళ్లిపోవడం, నమ్మినవాళ్లే మోసం చేయడం వంటివి జరిగినప్పుడు మనసు షాక్‌కు గురవుతుంది. ఇలాంటి బలవంతపు పరిస్థితులు వచ్చినప్పుడు మనిషి లోపల ఒక తెలీని శూన్యమేర్పడుతుంది.

ఇలా మనం కావాలని వెళ్లినా, లేదా పరిస్థితులు మనల్ని అలా నెట్టినా.. గదిలో ఒంటరిగా(Single) ఉన్నప్పుడు మాత్రం మనసు రకరకాల ఇబ్బందులను ఫేస్ చేస్తుంది. మొదట్లో అంతా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించినా మెల్లగా ఓవర్ థింకింగ్ మొదలవుతుంది. ఒంటరిగానే ఉన్నామనే భావన వేధిస్తుంది.

అందరితో మాట్లాడాలని ఉన్నా లోపల ..బాధ చెప్పుకోవాలని ఉన్నా కూడా .. ఓపిక లేకపోవడం వల్ల ఆ చొరవ తీసుకోలేరు. ఎవరైనా బాగున్నావా అని అడిగినా కూడా ఆన్సర్ చెప్పడమే ఒక పెద్ద భారంలా అనిపిస్తుంది. నలుగురిలోకి వెళ్తే మన బాధను చూసి ఎవరు జాలిపడతారోననే భయం వెంటాడుతుంది. సైకాలజీ ప్రకారం, మనసు ఒత్తిడికి లోనైనప్పుడు.. అది తనను తాను రక్షించుకోవడానికి డిఫెన్స్ మెకానిజంలాగా ఈ ఒంటరితనాన్ని వాడుకుంటుంది.

Single
Single

చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్నా కూడా మనుషులకు మనుషులకు మధ్య నిజమైన కనెక్షన్ అంటూ లేకపోవడం వల్ల.. ఈ కాలంలో ఈ ఐసోలేషన్ అనేది మరింత ఎక్కువవుతోంది. ఇది ఒక అలవాటుగా మారినప్పుడు, మొదట్లో ప్రశాంతంగా అనిపించినా మెల్లమెల్లగా అది డిప్రెషన్‌కు దారితీస్తుంది. ఈ స్థితి నుంచి బయటపడటం అసాధ్యమేమీ కాదు. కాకపోతే దానికి కాస్త సమయం పడుతుంది.

దీనికోసం రోజుకు ఒక్కరితో అయినా మనసారా మాట్లాడటం, కాసేపు ప్రకృతిలో గడపడం, మనసులోని మాటను నమ్మకమైన వ్యక్తితో పంచుకోవడం వంటివి చేయాలి. ఒంటరితనం అనేది ఒక టెంపరరీ షెల్టర్ మాత్రమే కానీ..పర్మినెంట్ నివాసం కాదని మనసుకు నచ్చజెప్పాలి. చీకటి గదిలోంచి బయటకు వచ్చి వెలుతురును చూడటానికి కాస్త ధైర్యం తెచ్చుకోవాలి. ఆ ధైర్యమే మిమ్మల్ని మళ్లీ జీవితానికి దగ్గర చేస్తుందని తెలుసుకోవాలి.

Jana Nayagan : జననాయకుడికి లైన్ క్లియర్‌..సంక్రాంతి మిస్ అయినా జూలైలో దళపతి వేట షురూ..

Related Articles

Back to top button