Just TelanganaLatest News

Red Alert : 18 జిల్లాలకు రెడ్ అలర్ట్..మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

Red Alert : వర్షం పడే సమయంలో బయట ఉంటే కరెంట్ స్తంభాల పక్కన, పెద్ద పెద్ద చెట్ల కింద, ప్రమాదకరమైన హోర్డింగ్‌ల కింద నిలబడొద్దని అధికారులు హెచ్చరికలు చేశారు.

Red Alert

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తెలంగాణలో ఉగ్రరూపాన్ని చూపించడానికి సిద్ధమైంది. దానికితోడు కర్ణాటక, కోస్తాంధ్ర వైపుగా సాగుతున్న వాతావరణ ద్రోణి కూడా తోడవడంతో తెలంగాణలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. రాబోయే 48 గంటల పాటు మెయిన్‌గా ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాలలో అత్యవసర వర్షాల భయంతో రెడ్, ఆరెంజ్ అలర్టులు ప్రకటించింది.

బుధవారం వాతావరణ శాఖ జారీ చేసిన వార్నింగ్ ప్రకారం తెలంగాణలోని ఏకంగా 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ అమల్లోకి వచ్చింది. వరంగల్, హనుమకొండ,కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల,భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగామ, సిద్ధిపేట జిల్లాల్లో కుండపోత వర్షాలు ముంచెత్తనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. వీటితో పాటు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

సెప్టెంబర్ 24వ తేదీ గురువారం కూడా వర్షాల తీవ్రత ఏ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. వరంగల్, హనుమకొండ, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలలో రెడ్ అలర్ట్ జారీ చేసింది.

అదే సమయంలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగామ, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు చేసింది. అంతేకాకుండా శుక్ర, శనివారాల్లో అంటే సెప్టెంబర్ 25వ తేదీ, 26వ తేదీలలో జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు.

Red Alert
Red Alert

కుండపోత వర్షాలతో పాటు భారీ వేగంతో ఈదురుగాలులు విరుచుకుపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షం పడే సమయంలో బయట ఉంటే కరెంట్ స్తంభాల పక్కన, పెద్ద పెద్ద చెట్ల కింద, ప్రమాదకరమైన హోర్డింగ్‌ల కింద నిలబడొద్దని హెచ్చరికలు చేశారు. రాబోయే 4 రోజులు ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

పరిస్థితి తీవ్రతతో రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి .. తెలంగాణలోని అధికార యంత్రాంగం మొత్తాన్ని అలర్ట్‌లో ఉంచాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సహాయక చర్యలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

Nani : ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ప్యారడైజ్ ప్రీమియర్ చూస్తానన్న నాని..పుష్ప 2 తొక్కిసలాట పాఠం వెంటాడుతుందా?

Related Articles

Back to top button