Just TelanganaLatest News

Hyderabad Ganesh Immersion : వినాయక నిమజ్జనానికి భాగ్యనగరం సిద్ధం.. ఏఐ డ్రోన్లు, 28,400 మంది పోలీసులతో నిఘా..

Hyderabad Ganesh Immersion : నిమజ్జనం రోజు హైదరాబాద్ మహానగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటి నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

Hyderabad Ganesh Immersion

హైదరాబాద్‌లో నవరాత్రుల పూజలందుకున్న బొజ్జ గణపయ్యను గంగమ్మ ఒడికి సాగనంపే టైమ్ రానే వచ్చింది. ప్రతి ఏడాది వైభవంగా సాగే గణేశ్ నిమజ్జన మహోత్సవానికి భాగ్యనగరం సర్వసన్నద్ధమైంది. ఈ భారీ వేడుకను అత్యంత ప్రశాంతంగా పూర్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ గట్టి ప్లాన్ చేశాయి. ముఖ్యంగా జనం రద్దీని, ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 25వ తేదీన శుక్రవారం జీహెచ్ఎంసీ పరిధిలో.. ప్రభుత్వం అఫీషియల్‌గా సెలవు ప్రకటించింది.

ఈ వినాయక నిమజ్జనం(Hyderabad Ganesh Immersion) మహోత్సవం దృష్టిలో పెట్టుకుని.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు అలాగే విద్యాసంస్థలన్నింటికి కూడా సెప్టెంబర్ 25న పబ్లిక్ హాలిడే వర్తిస్తుంది. అయితే ఈ పనిదినాన్ని వృథా కానివ్వకుండా, దీనికి కాంపెన్సేషన్‌గా వచ్చే నవంబర్ 14వ తేదీన ఉండే రెండో శనివారాన్ని వర్కింగ్ డేగా పరిగణించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక నిమజ్జనం రోజు హైదరాబాద్ మహానగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటి నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఏకంగా 28,400 మంది భారీ పోలీస్ బలగాలతో సిటీ అంతా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు. దీనిలో కేవలం హైదరాబాద్ పరిధిలోనే 20,000 మందిని, చుట్టుపక్కల జిల్లాల్లో మరో 8,400 మంది సిబ్బందిని రంగంలోకి దించినట్లు చెప్పారు.

కాగా ఈసారి టెక్నాలజీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని సిటీ పోలీసులు వాడుతున్నారు. 24 అత్యాధునిక డ్రోన్లు, ఏకంగా 10,000 సీసీటీవీ కెమెరాలతో నిమజ్జన ఊరేగింపులను క్షణక్షణం మానిటర్ చేయనున్నారు.

ముఖ్యంగా ప్రధాన ఘట్టం జరిగే హుస్సేన్ సాగర్ పరిసరాల్లో స్పెషల్‌గా 100 హై-రైజ్ కెమెరాలను ఫిక్స్ చేశారు. అంతేకాకుండా జనాల రద్దీని ఆసరాగా చేసుకుని జేబు దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవారి ఆట కట్టించడానికి 25 ప్రత్యేక క్రైమ్ బ్రాంచ్ టీమ్స్ కంటిన్యూగా పహారా కాయనున్నాయి. ఇక మహిళల సేఫ్టీ కోసం షీ టీమ్స్ నిఘాను మరింతత రెట్టింపు చేశారు.

అయితే ఉత్సవాల పేరిట డీజేలు పెట్టి రచ్చ చేయడాలు, మండపాల వద్ద అశ్లీల పాటలు వేయడాలు, అసభ్యకర డ్యాన్సులు చేయడం వంటివి చేస్తే అసలు ఉపేక్షించేదే లేదని, కఠిన చర్యలు ఉంటాయని సీపీ సజ్జనార్ ముందుగానే వార్నింగ్ ఇచ్చారు.

Hyderabad Ganesh Immersion
Hyderabad Ganesh Immersion

అలాగే సోషల్ మీడియాలో వేరే ఓల్డ్ వీడియోలను షేర్ చేస్తూ ఫేక్ న్యూస్ లేదంటే గొడవలు సృష్టించే రూమర్స్ స్ప్రెడ్ చేస్తే ఊరుకునేది లేదని సజ్జనార్ తేల్చి చెప్పారు. భాగ్యనగరం రూపురేఖలకే ప్రత్యేక ఆకర్షణ అయిన ఖైరతాబాద్ మహాగణపతి దర్శన సమయం సెప్టెంబర్ 23 బుధవారం అర్ధరాత్రితోనే క్లోజ్ అయింది. ఇక నిమజ్జనం(Hyderabad Ganesh Immersion) రోజు సిటీలోకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను, భారీ ట్రక్కులను రానీకుండా కంప్లీట్ ఎంట్రీ బ్యాన్ విధిస్తున్నట్లు పోలీస్ యంత్రాంగం ప్రకటించింది.

Appreciation : మనసులోని మెచ్చుకోలును దాచుకోకండి..ఎదుటివారిలో కాన్ఫిడెన్స్ నింపండి..

Related Articles

Back to top button