Bigg Boss Wild Card Entry : బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ..ఫ్యామిలీ లెటర్ వర్సెస్ కెప్టెన్సీ
Bigg Boss Wild Card Entry : అపూర్వ, మిథిలేష్, రామకృష్ణ ఎంటర్ అవడంతో.. ఈ ముగ్గురిలో ఎవరిని ఇంట్లోకి పంపాలో తేల్చే బాధ్యతను మాత్రం బిగ్ బాస్ పాత కంటెస్టెంట్లకు అప్పగించాడు.
Bigg Boss Wild Card Entry
బిగ్ బాస్ హౌస్‌లో మూడో వారం కెప్టెన్సీ రేస్ గందరగోళానికి వేదికగా మారింది. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో నరేష్, వంశీ ఇద్దరూ ఒకేసారి బజర్ నొక్కడంతో, సంచాలక్‌గా ఉన్న త్రిగుణ్ కన్ఫ్యూజన్కు గురయ్యాడు. మొదట నరేష్ పేరు చెప్పి, ఈ వెంటనే మాట మార్చేసి వంశీ ముందు తాకాడని తీర్పు ఇచ్చాడు. ఈ నిర్ణయం తప్పయితే ఏ పనిష్మెంట్కైనా రెడీ అని అనడంతో వంశీ, ఝాన్సీ మధ్య బిగ్ బాస్ టాస్క్ పెట్టగా.. ఆ గేమ్‌లో గెలిచిన ఝాన్సీ కెప్టెన్సీ కంటెండర్ అవ్వడమే కాక ఫ్యామిలీ ఫోటోను గెలుచుకుంది. అయితే తనకొచ్చిన పవర్‌తో నరేష్‌కి వచ్చిన లెటర్‌ను చించేసి టెన్షన్ పెంచింది.
ఇదయ్యాక గార్డెన్ ఏరియాలో హౌస్‌మేట్స్‌కు బిగ్ బాస్ మంచి పార్టీ ఇచ్చాడు. అందరూ తిన్నాక అసలు ఆట మొదలైంది. లివింగ్ ఏరియా స్క్రీన్ పైన కంటెస్టెంట్ల గురించి బయట మాట్లాడుతున్న కామెంట్లను చూపించి బాంబు పేల్చాడు. ఝాన్సీ షర్ట్ సింపతీ కోసం, రైతు బిడ్డ ట్యాగ్ కోసమే అని రావడంతో..చరణ్ అన్న మాటల వల్లే ఇలా జరిగిందని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ముఖేష్‌కి గేమ్‌పై దృష్టి లేదని, వర్షిణి వల్ల అతను డీవియేట్ అవుతున్నాడనే కామెంట్ పడింది. ఇక షాలినిని ట్రిగ్గరింగ్ క్వీన్, బ్యాక్ బిచింగ్ స్టార్ అని , వంశీ అనవసరంగా అరుస్తున్నాడని నెటిజన్ల కామెంట్లతో తేల్చేశారు.
మరోవైపు సేఫ్ గేమ్ ఆడుతున్న కన్నింగ్ ప్లేయర్ రామ్ ప్రసాద్ అని, కేవలం స్వార్థంతోనే రామ్ ప్రసాద్‌తో నరేష్ ఉంటున్నాడని కామెంట్లు వచ్చాయి. త్రిగుణ్ హౌస్ మేట్స్‌ను మానిప్యులేట్ చేస్తున్నాడని, వర్షిణి ఆట తక్కువ డ్రామా ఎక్కువని ఎండగట్టారు. ఇక సుధీర్ సొంత ఆలోచనలేమీ లేకుండా స్క్రీన్ స్పేస్ కోసం లవ్ ట్రాక్ నడుపుతున్న పప్పెట్‌గా ట్రోల్ చేశారు. ఈ కామెంట్ల గందరగోళం ఎండ్ అయ్యే లోపు మెయిన్ గేట్ వద్ద అపూర్వ, మిథిలేష్, రామకృష్ణ ఎంటర్ అయ్యారు. ఈ ముగ్గురిలో ఎవరిని ఇంట్లోకి పంపాలో తేల్చే బాధ్యతను మాత్రం బిగ్ బాస్ పాత కంటెస్టెంట్లకు అప్పగించాడు.
హౌస్‌లోకి అడుగు పెట్టకముందే కొత్తవాళ్లు(Bigg Boss Wild Card Entry) ముగ్గురూ.. పాతవాళ్లపై విరుచుకుపడ్డారు.మిథిలేష్.. ఇంట్లోని గుంటనక్కలను, పప్పెట్లను బయటకు తీస్తానని అనడంతో.. అందరినీ ఎక్స్పోజ్ చేస్తానని అపూర్వ వార్నింగ్ ఇచ్చింది. రామకృష్ణ తాను ఎంటర్టైన్ చేస్తానంటూ సింపుల్‌గా చెప్పాడు. ఈ సమయంలోనే త్రిగుణ్, మిథిలేష్ తీవ్ర వాగ్వాదం జరిగింది. భాష పేరుతో సామెతలు వాడటం తప్పని మిథిలేష్ నిలదీయగా.. నీకు తెలుగు వస్తే రెండు పద్యాలు చెప్పమని త్రిగుణ్ ఛాలెంజ్ చేయగా..పద్యాలు వస్తేనే తెలుగు వచ్చినట్టు కాదని మిథిలేష్ గట్టి కౌంటర్ ఇచ్చాడు.

ఆ తర్వాత ముఖేష్, అపూర్వ, మిథిలేష్ మధ్య ఓటింగ్ గురించి వార్ నడిచింది. చివరకు ఈ ముగ్గురిలో ఎవరికి ఎంట్రీ అనేదానిపై బిగ్ బాస్ సీక్రెట్ ఓటింగ్ పెట్టాడు. దీంతో మిథిలేష్ ఇక్కడకి సెట్ కాడని, బయటకు వెళ్లి జిమ్ ట్రైనర్ అవ్వాలని ముఖేష్ అన్నాడు. రామకృష్ణ వంటి జెన్యూన్ కంటెస్టెంట్ వస్తేనే బాగుంటుందని ముఖేష్, సుధీర్, వర్షిణి అనుకోవడంతో ఎపిసోడ్ ముగిసింది. మొత్తంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ(Bigg Boss Wild Card Entry)తో రాబోయే రోజుల్లో హౌస్‌లో రచ్చ మరింత పెరగడం గ్యారంటీ అని అనిపిస్తోంది.
No UPI Day : అక్టోబర్ 2న నో యూపీఐ డే..యూపీఐకి పడబోతున్న నల్లటి ముసుగుకు రీజనేంటి?





