Just Nationaljust AnalysisLatest News

Gautam Adani : సాధారణ వ్యాపారి నుంచి బిలియనీర్..అదానీ సక్సెస్ సీక్రెట్ తెలుసా ?

Gautam Adani : గౌతమ్ అదానీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించారు. యుక్తవయస్సులోనే డైమండ్ సార్టర్‌గా బిజినెస్ ప్రారంభించి, తర్వాత మెల్లగా ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ రంగంలోకి అడుగుపెట్టారు.

Gautam Adani

వ్యాపారం అందరూ చేస్తారు.. కానీ కొంతమందే అత్యుత్తమ స్థాయికి ఎదుగుతారు. సాధారణ వ్యాపారి స్థాయి నుంచి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగిన గౌతమ్ అదానీ(Gautam Adani) ఇదే కోవకు చెందుతారు. చిన్న డైమండ్ సార్టర్‌తో మొదలుపెట్టి.. 2 దశాబ్దాలలోనే కోటీశ్వరుడైన అదానీ జీవిత ప్రస్థానం నుంచి.. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారు ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు.

తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టి, భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాలనే దానికి అదానీ సరైన ఉదాహరణ. వ్యాపారం చేయాలన్న ఆసక్తి, పట్టుదల ఉంటే సరిపోదనీ, కొన్ని సందర్భాల్లో రిస్క్ తీసుకుంటేనే అనుకున్న లక్ష్యాలను చాలా త్వరగా చేరుకుంటామని అదానీ చెబుతారు. అన్నింటికీ మించి భవిష్యత్తులో దేశాభివృద్ధికి కీలకమైన రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ఆయన విజయరహస్యంగా చెప్పొచ్చు.

ముఖ్యంగా వ్యాపారాన్ని విస్తరించే విషయంలో చాలా మందికి గౌతమ్ అదానీ మార్గనిర్దేశకంగా కనిపిస్తారు. ఎందుకంటే కోట్లు కుమ్మరిస్తే వ్యాపార విస్తరణ జరగదు. స్థానిక, అంతర్జాతీయ మార్కెట్లపై చాలా లోతైన నాలెడ్జ్ ఉండాలి. ప్రత్యర్థుల కంటే ముందే అవకాశాలను గుర్తించాలి.

గౌతమ్ అదానీ(Gautam Adani) గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించారు. యుక్తవయస్సులోనే డైమండ్ సార్టర్‌గా బిజినెస్ ప్రారంభించి, తర్వాత మెల్లగా ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ రంగంలోకి అడుగుపెట్టారు. 1996లో అదానీ గ్రూపును స్థాపించి ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద పెద్ద ప్రాజెక్టులను దక్కించుకున్నారు.

అదానీ ప్రత్యేకత ఏంటంటే ముందుచూపుతో వ్యవహరించడం. రానున్న రోజుల్లో ఏఏ రంగాలు కీలకపాత్ర పోషిస్తాయనే అంశంపై ఎప్పటికప్పుడు సరికొత్త సమాచారం తెలుసుకుంటూ ముందడుగు వేశారు. కొన్ని సందర్భాల్లో రిస్క్ అని తెలిసినా కూడా అదానీ వెనక్కి తగ్గలేదు. దేశాభివృద్ధిలో కీలకంగా ఉండే పోర్టులు, విమానాశ్రయాలు, విద్యుత్, గ్యాస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని విస్తరించారు.

Gautam Adani
Gautam Adani

భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ పోర్ట్ ఆపరేట్ చేసేది కేవలం అదానీ గ్రూప్ మాత్రమే. అలాగే దేశ సముద్ర వాణిజ్యంలో 25 శాతానికి పైగా అదానీనే నిర్వహిస్తున్నారు. అలాగే గ్రీన్ ఎనర్జీ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ డెవలపర్‌గా అదానీ ఎదిగారు. 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిదారుగా మారాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇదిలా ఉంటే హిండెన్‌బర్గ్ నివేదికతో తీవ్ర సంక్షోభం తలెత్తినా కూడా భయపడకుండా అప్పులను వేగంగా చెల్లించి పెట్టుబడుదారుల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.  సంపాదనలోనే కాదు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ అదానీ తన ప్రత్యేకతను చాటుకున్నారు. తన 60వ పుట్టినరోజున 60 వేల కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.

Megastar Chiranjeevi : ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి.. మెగాస్టార్ టీమ్ రియాక్షన్

Related Articles

Back to top button