Buying A New Car : కొత్త కారు కొంటున్నారా?.. ఈ చిన్న సీక్రెట్స్ తెలిస్తే లక్షల రూపాయలు ఆదా అవ్వడం గ్యారెంటీ..
Buying A New Car : దసరా, దీపావళి టైమ్‌లో కార్ల కంపెనీలు కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, ఫ్రీ యాక్ససరీస్ అంటూ ఆఫర్ల వర్షాన్ని కురిపిస్తాయి.
Buying A New Car
చాలామంది కారు కొనాలనుకుని … దానికోసం నెలల తరబడి నచ్చిన మోడల్, కలర్, సేఫ్టీ ఫీచర్లను సెలక్ట్ చేసుకుంటూ ప్లాన్ చేస్తుంటారు. అయితే ఇక్కడ ఎక్కువమంది సరైన మోడల్‌ను ఎంచుకోవడంలో ఉన్న శ్రద్ధ.. ఆ కారును ఎప్పుడు కొనాలనే పర్ఫెక్ట్ టైమింగ్ మీద పెట్టరు. కానీ కొద్దిగా ఆలోచించి సరైన టైమ్‌లో కారు కొంటే(Buying A New Car) వేల నుంచి లక్షల రూపాయల వరకు ఈజీగా సేవ్ చేసుకోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
కారు కొనాలనుకున్నప్పుడు(Buying A New Car) ఎప్పుడూ కూడా మంత్ ఎండింగ్ డేట్‌నే సెలక్ట్ చేసుకోవడం మొదటి బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ప్రతీ కార్ల షోరూమ్ డీలర్‌కు మంత్ ఎండింగ్‌కు చేరుకోవాల్సిన సేల్స్ టార్గెట్స్ ఉంటాయి. ఆ టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ డీలర్లు టార్గెట్ రీచ్ అవ్వడం కోసం కస్టమర్లను బేరసారాలకు రెడీ అవుతారు.
ఒకవేళ మీరు అనుకున్న మోడల్ స్టాక్ కనుక షోరూమ్‌లో రెడీగా ఉంటే.. ఎక్స్ట్రా డిస్కౌంట్లు, ఫ్రీ సర్వీసింగ్ ఆఫర్లు ఇచ్చి మరీ కారును మీ చేతికి ఇవ్వడానికి డీలర్లు పోటీపడతారు. ఇక రెండో మంచి ఛాన్స్ పండుగ సీజన్‌ను ఎంచుకోవాలి.
దసరా, దీపావళి టైమ్‌లో కార్ల కంపెనీలు కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, ఫ్రీ యాక్ససరీస్ అంటూ ఆఫర్ల వర్షాన్ని కురిపిస్తాయి. కాకపోతే ఈ టైమ్‌లో కాస్త డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల ఒక్కోసారి మీరు కోరుకున్న కారు డెలివరీ అవడానికి కాస్త వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
ఇక అందరికంటే ఎక్కువగా మనీ సేవ్ చేసుకోవాలనువారికి ఇయర్ ఎండ్ ఒక గోల్డెన్ ఛాన్స్ అని నిపుణులు వివరిస్తున్నారు. పాత ఏడాది స్టాక్‌ను త్వరగా ఖాళీ చేయడానికి డీలర్లు, వార్షిక సేల్స్ టార్గెట్ కోసం కంపెనీలు డిసెంబర్లో ఊహించని రేంజ్లో డిస్కౌంట్లు ఇస్తాయి.

కాకపోతే దీనిలో ఒక చిన్న నెగిటివ్ విషయం కూడా ఉంది. డిసెంబర్లో కొన్న కారు డాక్యుమెంట్‌పై పాత తయారీ సంవత్సరంగా ఎంటర్ అవుతుంది కాబట్టి. భవిష్యత్తులో ఆ కారును రీసేల్ చేయాలనుకునేవారికి మాత్రం.. రీసేల్ వ్యాల్యూ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది.
కాబట్టి కేవలం ప్రైస్ డిస్కౌంట్ మాత్రమే ఇంపార్టెంట్ అయితే డిసెంబర్ వరకు వెయిట్ చేయడం బెటర్. లేదంటే న్యూ మోడళ్లు, పండుగ ఆఫర్లు కావాలనుకుంటే మాత్రం పండుగ సీజన్ పర్ఫెక్ట్ టైమ్. ఒకవేళ మోడల్ ముందే ఫిక్స్ అయిపోతే మాత్రం మంత్ ఎండ్‌లో అన్ని షోరూమ్‌లు తిరిగి బెస్ట్ డీల్ క్లోజ్ చేసుకోవడమే తెలివైన పని.
Apple Pay : డిజిటల్ మార్కెట్లోకి యాపిల్ పే ఎంట్రీ.. ఫోన్‌పే, గూగుల్ పే యాప్‌లకు చెక్ తప్పదా?





