Just Andhra PradeshJust PoliticalLatest News

Local Body Elections : 6 వారాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రాసెస్..హైకోర్టు తీర్పుతో హీటెక్కిన రాజకీయాలు

Local Body Elections : ఎలక్షన్స్ జరుగుతాయా లేవా అన్న గందరగోళానికి ఏపీ హైకోర్టు తెరదించడమే కాకుండా... అదిరిపోయే తీర్పునివ్వడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.

Local Body Elections

ఏపీ పాలిటిక్స్‌లో కొన్ని రోజులుగా నానుతున్న స్థానిక సంస్థల ఎన్నికల సస్పెన్స్‌కు .. ఊహించని క్లైమాక్స్ వచ్చేసింది . ఎలక్షన్స్ జరుగుతాయా లేవా అన్న గందరగోళానికి ఏపీ హైకోర్టు తెరదించడమే కాకుండా… అదిరిపోయే తీర్పునిచ్చింది. వచ్చే 6 వారాల్లోగా స్థానిక పోరుకు సంబంధించిన ప్రాసెస్‌ను పట్టాలెక్కించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి షాకింగ్ ఆర్డర్స్ ఇచ్చేసింది. దీంతో ఏపీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పీక్స్‌కి చేరినట్లు అయింది.

నిజానికి ఈ(Local Body Elections) ఎలక్షన్స్ చుట్టూనే.. కోర్టులో పిటిషన్ల వరద పారింది. ముఖ్యంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 105, 1065లను ఛాలెంజ్ చేస్తూ కొంతమంది కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు పరిమితికి మించి మరీ ఈ రిజర్వేషన్లు ఉన్నాయని పిటిషనర్లు గట్టిగా వాదించగా, దీనిపై ఇప్పటికే విచారణ పూర్తి చేసిన ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

కాగా మరోవైపు ఓటర్ల జాబితా ప్రక్షాళన పూర్తిగా పూర్తయ్యాకే పోలింగ్‌కు వెళ్లాలని వైఎస్సార్సీపీ కోరగా.. బీసీ కులగణన, సమగ్ర సర్వే రిపోర్టులు బయటకు వచ్చాకే నోటిఫికేషన్ ఇవ్వాలంటూ మరికొంతమంది పిటిషన్లు వేశారు. వీటికి తోడు వార్డుల పునర్విభజన లెక్కలతో పాటు గ్రామీణ పంచాయతీలను దగ్గరలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేయడంపై దాఖలైన వివాదాలు ఇలా అన్నీ ఒకేసారి హైకోర్టు ముందుకు వచ్చాయి.

Local Body Elections
Local Body Elections

రిజర్వేషన్ల అంశంపై ఏపీ ప్రభుత్వం తరఫున గట్టి వాదనలే వినిపించారు. సమకాలీన బీసీ పాపులేషన్ గణాంకాలు, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను బేస్ చేసుకునే ఈ 34 శాతం రిజర్వేషన్ కోటాను పక్కాగా శాస్త్రీయంగా ఫిక్స్ చేశామని స్పష్టం చేశారు.

ఇలా అన్ని పక్షాల వాదనలు విన్న హైకోర్టు, లోకల్ బాడీ(Local Body Elections) ఎలక్షన్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆ ప్రాసెస్ ముందడుగు పడటానికి మార్గం సుగమమైంది. ఇక నోటిఫికేషన్, పోలింగ్ షెడ్యూల్ డేట్‌ను ఎనౌన్స్ చేయడమే మిగిలింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలాంటి వేగాన్ని పెంచుతుందో, ఈ 6 వారాల గడువులో ఎలాంటి పొలిటికల్ సీన్లు చూస్తామో అనేదానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.

Emotional Immaturity : ఎమోషనల్ ఇన్ మెచ్యూరిటీకి చెక్ పెట్టే 4 గోల్డెన్ రూల్స్

Related Articles

Back to top button