Indrakeeladri Durga Devi Navratrulu : ఇంద్రకీలాద్రిపై అమ్మవారి నవరాత్రి వేడుకలు.. 10 రోజులు 10 దైవిక అవతారాలలో దుర్గమ్మ..
Indrakeeladri Durga Devi Navratrulu : ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11 ఆదివారం నుంచి దేవి శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభమై, అక్టోబర్ 20 మంగళవారంతో కన్నులపండువగా ముగియనున్నాయి.
Indrakeeladri Durga Devi Navratrulu
దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అన్ని శక్తి పీఠాల్లో, దేవి ఆలయాలలో విజయదశమి ఉత్సవాలు అంబరాన్ని తాకేలా శరన్నవరాత్రి సంబురాలు మొదలుకానున్నాయి. దీనిలో భాగంగానే విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలను(Indrakeeladri Durga Devi Navratrulu) అత్యంత వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం బోర్డు ఆలయ ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చూస్తూనే.. ఇంద్రకీలాద్రిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తోంది.
ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11 ఆదివారం నుంచి ఈ దేవి శరన్నవరాత్రి వేడుకలు(Indrakeeladri Durga Devi Navratrulu) ప్రారంభమై, అక్టోబర్ 20 మంగళవారంతో కన్నులపండువగా ముగియనున్నాయని ఆలయ ఈవో వీకే శీనానాయక్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈసారి నవరాత్రుల్లో ఎప్పటిలాగే లోకాలను ఏలే జగన్మాత పది రోజుల పాటు పది విభిన్న దివ్య అవతారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
మొదటి రోజైన అక్టోబర్ 11వ తేదీన శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి అలంకారంలో కనిపిస్తూ కనకదుర్గమ్మ తొలి దర్శనమిస్తారు. ఆ తర్వాత రెండో రోజు అక్టోబరు 12వ తేదీన శ్రీ గాయత్రీ దేవిగా, మూడో రోజైన అక్టోబరు 13వ తేదీన జగద్రక్షణ శ్రీ అన్నపూర్ణా దేవి రూపంలో అమ్మవారు భక్తులను అభయమిస్తారు. నాలుగో రోజైన అక్టోబరు 14వ తేదీన శ్రీ మహాచండీ దేవి అలంకారంలో, ఐదో రోజైన అక్టోబరు 15వ తేదీన శ్రీ లలితా త్రిపురసుందరీ దేవిగా అనుగ్రహిస్తారు.
ఇక అత్యంత కీలకమైన ఆరో రోజైన, మూలానక్షత్రం రోజు అక్టోబరు 16వ తేదీన చదువుల తల్లి శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో కొలువై భక్తులకు అభయమిస్తారు. ఏడో రోజైన అక్టోబరు 17వ తేదీన సకల సంపదల శ్రీ మహాలక్ష్మి దేవిగా, ఎనిమిదో రోజైన అక్టోబరు 18వ తేదీన దుర్గాష్టమి పర్వదినాన శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనభాగ్యాన్ని కల్పిస్తారు.

తొమ్మిదో రోజైన అక్టోబరు 19వ తేదీన మహర్నవమి సందర్భంగా రౌద్ర రూపం శ్రీ మహిషాసురమర్ధిని దేవిగా దుర్గాదేవి అలంకృతులయి భక్తులకు ఆశీస్సులు అందిస్తారు.ఇక చివరి రోజు అక్టోబరు 20వ తేదీ విజయదశమి పండుగ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులను పరంధామం దిశగా దుర్గామాత అనుగ్రహిస్తారు.
ఉత్సవాల చివరి రోజు అంటే అక్టోబరు 20 సాయంత్రం బెజవాడ కృష్ణమ్మ ఒడిలో అమ్మవారికి నయనమనోహరంగా హంసవాహన తెప్పోత్సవం కన్నులపండువగా జరుగబోతోంది. సూర్యాస్తమయ సమయంలో కృష్ణా నది జలాల్లో విహరించే కనకదుర్గమ్మ హంసవాహన దివ్య లీలలను కళ్లారా చూసి తరించడానికి తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇంద్రకీలాద్రికి భారీగా తరలివస్తారు.
Mind Controling Power : మీ మైండ్‌కి మీరే బాస్ అవ్వాలా?..ఈ 10 విషయాలు కచ్చితంగా ఫాలో అవ్వండి..





