Just NationalJust BusinessLatest News

Plastic Notes : కాగితపు నోట్లకు గుడ్ బై..రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లతో ఆర్‌బీఐ ప్రయోగం..

Plastic Notes : 2012లోనే కొచ్చి, మైసూర్, జైపూర్, భువనేశ్వర్, సిమ్లా సిటీలలో రూ.10 ప్లాస్టిక్ నోట్లను పైలట్ ప్రాజెక్ట్‌గా రన్ చేసినా కూడా, అప్పట్లో ఏటీఎమ్‌లలో ఉన్న టెక్నికల్ ఇష్యూల వల్ల వాటిని టెంపరరీగా ఆపాల్సి వచ్చింది.

Plastic Notes

తడిస్తే పాడయ్యే పేపర్ నోట్లు, ప్యాంట్ పాకెట్‌ చెక్ చేయకుండా ఉతికేస్తే పనికిరాకుండా పోయే పాత కరెన్సీకి బై చెప్పడానికి కౌంట్ డౌన్ మొదలయింది. జేబులో నోట్లు ఉంటే ఎక్కడ చిరిగిపోతాయో అన్న భయానికి స్వస్తి చెబుతూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఒక డెసిషన్ తీసుకుంది.

మన చేతుల్లో మెరిసే కరెన్సీ నోట్ల ముఖచిత్రాన్ని మార్చేస్తూ.. భారత్‌లో విప్లవాత్మక పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లను రంగంలోకి దించడానికి ఆర్‌బీఐ పక్కా స్కెచ్ వేసింది. వరల్డ్‌లోనే అత్యంత సేఫ్ అండ్ డ్యూరబుల్ కరెన్సీగా పేరుబడ్డ ఈ ప్లాస్టిక్ నోట్ల(Plastic Notes) ఫీల్డ్ ట్రయల్స్‌కు కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో.. ఇండియన్ కరెన్సీ హిస్టరీలోనే ఒక కొత్త శకం స్టార్ట్ కాబోతోంది

ఈ ఎక్స్‌పెరిమెంట్‌లో భాగంగా ఆర్‌బీఐ ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో భాగంగా డైలీ ఎక్కువగా మన చేతులు మారే రూ. 10 , రూ. 20 నోట్లను ప్లాస్టిక్ రూపంలో మార్కెట్లోకి తేబోతోంది. ప్రస్తుతం మనమంతా వాడుతున్న పేపర్ నోట్లతో పోలిస్తే ఈ ప్లాస్టిక్ నోట్ల(Plastic Notes) ఆయుష్షు 4,5 రెట్లు ఎక్కువగా ఉంటుంది.

ఎంత నలిపినా, నీళ్లలో గంటల తరబడి నానబెట్టినా కూడా ఇవి అస్సలు పాడవ్వవు. ఈ ప్రాజెక్టును ఆర్‌బీఐ సబ్ కంపెనీ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (BRBNMPL) చాలా వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ప్లాస్టిక్ నోట్ల(Plastic Notes) మేకింగ్ కోసం కావాల్సిన ‘BOPP’ (Biaxially Oriented Polypropylene) అనే లేటెస్ట్ పాలిమర్ సబ్‌స్ట్రేట్ మెటీరియల్ కోసం ఇప్పటికే ఆర్‌బీఐ ఆఫర్లను ఆహ్వానించింది. దీనిలో రూ.10 నోట్ల కోసం 34,000 రీమ్‌లు, రూ.20 నోట్ల కోసం మరో 34,000 రీమ్‌లు చొప్పున మొత్తం 68,000 రీమ్‌ల సరుకును కలెక్ట్ చేస్తున్నారు.

Plastic Notes
Plastic Notes

ఈ స్పెషల్ మెటీరియల్ సరఫరా చేయడానికి భారత్‌లో ఫేమస్ కంపెనీ అయిన యుఫ్లెక్స్(UFlex) అలాగే అమెరికాకు చెందిన సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ స్పెక్ట్రా సిస్టమ్స్(Spectra Systems) చేతులు కలిపి బిడ్ దాఖలు చేశాయి. దీనిలో యుఫ్లెక్స్ కంపెనీ నోట్ల తయారీ బాధ్యతలు తీసుకుంటే, స్పెక్ట్రా సిస్టమ్స్ కంపెనీ నకిలీ నోట్లకు అస్సలు ఛాన్స్ లేకుండా హై-సెక్యూరిటీ ఫీచర్లను డిజైన్ చేయబోతోంది.

నిజానికి 2012లోనే కొచ్చి, మైసూర్, జైపూర్, భువనేశ్వర్, సిమ్లా సిటీలలో రూ.10 ప్లాస్టిక్ నోట్లను పైలట్ ప్రాజెక్ట్‌గా రన్ చేసినా కూడా, అప్పట్లో ఏటీఎమ్‌లలో ఉన్న టెక్నికల్ ఇష్యూల వల్ల వాటిని టెంపరరీగా ఆపాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ప్రైవేట్ అండ్ పబ్లిక్ బ్యాంకింగ్ సెక్టార్‌లో లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఆర్‌బీఐ ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌కు పూర్తిస్థాయిలో రూపమిస్తోంది. మొత్తంగా త్వరలోనే మన పర్స్ ఓపెన్ చేస్తే పేపర్ నోట్ల ప్లేస్‌లో కలర్‌ఫుల్ ప్లాస్టిక్(Plastic Notes) నోట్లు కళకళలాడతాయి.

Hyderabad Municipal Act : క్యూర్-1 పేరుతో ఆటోమేటిక్ మ్యూటేషన్..సింగిల్ బిల్లు మ్యాజిక్..70 ఏళ్ల నాటి చట్టాలకు చెక్..

Related Articles

Back to top button