Gold Prices : పండుగ సమయంలో గోల్డ్ లవర్స్‌కు షాకిచ్చిన పసిడి..ఆకాశాన్ని తాకుతున్న బంగారం, వెండి ధరలు..
Gold Prices : అక్టోబర్ 10వ తేదీన హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర ఏకంగా రూ.1లక్ష50వేల720 వద్ద పలుకుతోంది.
Gold Prices
దుర్గా నవరాత్రులు, దసరా, బతుకమ్మ , దీపావళి వంటి పండుగలు వరుసగా వస్తున్న ఈ సమయంలో బంగాకం ధరలు(Gold Prices) మరోసారి భారీగా భగ్గుమన్నాయి. అక్టోబర్ 10వ తేదీన హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర ఏకంగా రూ.1లక్ష50వేల720 వద్ద పలుకుతోంది. జ్యువెలరీ తయారు చేసే 22 క్యారెట్ల బంగారం ధర(Gold Prices) రూ.1లక్ష38వేల160కి చేరుకుంది. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలే నమోదయ్యాయి.
ఇక సౌత్ ఇండియాలోని ప్రధాన సిటీలైన చెన్నై, బెంగళూరులలో కూడా 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ కాస్ట్ రూ.1లక్ష50వేల720గా ఉండగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1లక్ష38వేల160 వద్ద స్థిరపడింది. అయితే ఢిల్లీలో మాత్రం ధరలు కాస్త ఎక్కువగానే నమోదయ్యాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ కాస్ట్ 10 గ్రాములకు రూ.1లక్ష50వేల870గా ఉండగా, 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.1లక్ష38వేల310 వద్ద ట్రేడవుతోంది.

మరోవైపు ఢిల్లీలో కిలో సిల్వర్ కాస్ట్ రూ.2లక్షల34వేల800 వద్ద కొనసాగుతుండగా, హైదరాబాద్‌లో మాత్రం కిలో సిల్వర్ ధర గరిష్టంగా రూ.2లక్షల44వేల900కు ఎగబాకింది. చెన్నైలో కూడా ఇదే ధర రికార్డయింది. అయితే ఈ రెండు నగరాల్లో అంతకుముందు కిలో వెండి రూ.2.45 లక్షల వరకు పలికినా, తాజాగా స్వల్పంగా తగ్గుదల కనిపించింది. బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2లక్షల34వేల800గా ఉంది. నిన్నటి ధర రూ.2లక్షల34వేల900తో పోలిస్తే ఇక్కడ కొంచెం రిలీఫ్ లభించింది.





