Just Andhra PradeshJust PoliticalLatest News

AP Municipal Elections : ఏపీలో పురపాలక ఎన్నికల హీట్.. 106 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఫిక్స్..

AP Municipal Elections : ఏపీ వ్యాప్తంగా ఉన్న 106 మున్సిపాలిటీలకు సంబంధించి కేటగిరీల వారీగా.. రిజర్వేషన్లను ఫిక్స్ చేస్తూ అధికారికంగా జీవో విడుదల అయింది.

AP Municipal Elections

ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మరో పెద్ద సమరానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మున్సిపల్ ఎన్నికల(AP Municipal Elections) నగారా మోగకముందే.. క్షేత్రస్థాయిలో హీటును పుట్టిస్తూ కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఏపీ వ్యాప్తంగా ఉన్న 106 మున్సిపాలిటీలకు సంబంధించి కేటగిరీల వారీగా.. రిజర్వేషన్లను ఫిక్స్ చేస్తూ అధికారికంగా జీవో విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో(AP Municipal Elections) పోటీ చేయడానికి క్యూలో ఉన్న రాజకీయ నేతలకు ఈ నిర్ణయంతో ఏ పట్టణం ఎవరికి రిజర్వ్ అయిందో క్లారిటీ వచ్చేసింది.

తాజాగా వెలువడిన లిస్ట్ ప్రకారం.. మొత్తం 106 పురపాలక సంఘాల్లో ఎస్టీ జనరల్‌కు 2 (ఆత్మకూరు, ఆలూరు), ఎస్టీ మహిళకు 1 (గూడూరు) స్థానాన్ని కేటాయించారు. ఎస్సీ కేటగిరీలో ఎస్సీ జనరల్‌కు 7, ఎస్సీ మహిళలకు 7 స్థానాలను ఖరారు చేశారు. ఇక బీసీ వర్గాలకు పెద్దపీట వేస్తూ బీసీ జనరల్‌కు 18, బీసీ మహిళలకు 18 చొప్పున మొత్తం 36 మున్సిపాలిటీలను కేటాయించారు. వీటితో పాటు జనరల్ మహిళల అకౌంట్‌లో 27 స్థానాలు చేరగా, అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ కింద 26 మున్సిపాలిటీలను చేర్చారు.

AP Municipal Elections
AP Municipal Elections

ఈ రిజర్వేషన్లను ప్రకటించడంతో ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలైన కూటమి, వైసీపీల్లో మున్సిపల్ పీఠాల కోసం పోటీపడే కేండిడేట్స్ లెక్కలు మారిపోయాయి. టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న లీడర్స్ ఇప్పుడు తమకు అనుకూలమైన స్థానాలపై దృష్టిని సారించారు. దీంతో సుమారు అన్ని పట్టణాల్లో కూడా పోటీ చేయడానికి తగిన కేండిడేట్ప్ వేట, సమీకరణాల మార్పులు ఊపందుకున్నాయి.

Srikanth Daughter Medha : టాలీవుడ్‌లో కొత్త క్రష్ ..ఇండస్ట్రీని షేక్ చేస్తున్న శ్రీకాంత్ కూతురు మూవీ అప్‌డేట్..

Related Articles

Back to top button