Just EntertainmentLatest News

Srikanth Daughter Medha : టాలీవుడ్‌లో కొత్త క్రష్ ..ఇండస్ట్రీని షేక్ చేస్తున్న శ్రీకాంత్ కూతురు మూవీ అప్‌డేట్..

Srikanth Daughter Medha : తన కొడుకు రోషన్‌ను సిల్వర్ స్క్రీన్‌కు పరిచయం చేసిన శ్రీకాంత్, ఇప్పుడు తన గారాల పట్టి మేధను కూడా హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తూ అదరగొట్టేశారు.

Srikanth Daughter Medha

సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ ఎప్పుడూ కూడా ఒక హాట్ డిబేట్‌లాగే ఉంటుంది. కానీ ఈసారి శ్రీకాంత్ ఇంట్లో నుంచి రాబోతున్న మరో వారసురాలి రాక మాత్రం అందరిలో ఓ రేంజ్‌లో క్యూరియాసిటీని పెంచేస్తోంది. ఇప్పటికే తన కొడుకు రోషన్‌ను సిల్వర్ స్క్రీన్‌కు పరిచయం చేసిన శ్రీకాంత్, ఇప్పుడు తన గారాల పట్టి మేధను(Srikanth Daughter Medha) కూడా హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తూ అదరగొట్టేశారు. ఈ న్యూస్ ఇలా బయటకు వచ్చిందో లేదో అలా సోషల్ మీడియాలో ట్రెండింగ్ ప్లేస్‌ను ఆక్రమించేసింది.

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మేధ(Srikanth Daughter Medha)తో వస్తున్న ఈ మూవీని ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కిస్తోంది. దీనిలో మేధ సరసన రాజమండ్రి రోజ్ మిల్క్ పిక్చర్‌తో అందరినీ ఆకట్టుకున్న జై జాస్తి హీరోగా నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేయడంతో పాటు మైత్రీ ఇన్ లవ్ అంటూ మేకర్స్ వదిలిన హ్యాష్‌ట్యాగ్.. నెట్టింట తెగ రౌండ్లు కొడుతోంది. ఈ మూవీకి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. ఫేమ్ మహేష్ బాబు క్రియేటర్‌గా వ్యవహరిస్తుండగా, 30 వెడ్స్ 21 ఫేమ్ పృథ్వీ వనం డైరెక్షన్ చేస్తున్నారు.

Srikanth Daughter Medha
Srikanth Daughter Medha

ఇప్పటికే ఈ పిక్చర్‌కి సంబంధించిన టెక్నికల్ టీమ్, బ్యాక్ గ్రౌండ్ చూస్తుంటే పక్కగా ఇది యూత్‌ను టార్గెట్ చేసే ప్లాన్‌తోనే ఈ లవ్ స్టోరీని దించుతున్నట్లు తెలుస్తోంది. సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కూడా మేధ తనకంటూ సెపరేట్ ఇమేజ్‌ను తెచ్చుకోవడానికి ఈ డిఫరెంట్ లవ్ స్టోరీతో ఎంట్రీ ఇస్తుంది. మూవీపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోగా.. ఈ కొత్త జోడీ టాలీవుడ్‌లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

Raw Banana : అరటి పండుని పక్కనబెట్టండి.. అరటికాయ మ్యాజిక్‌ను తెలుసుకోండి..

Related Articles

Back to top button