AP : ఏపీలో ఉచిత బస్సు ప్రయాణానికి కౌంట్ డౌన్.. షరతులు తెలుసా మరి!
AP :August 15 నుంచి(From August 15) ప్రారంభం కానున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

AP
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి(Sthree Shakti) పథకానికి కౌంట్ డౌన్ ప్రారంభమయింది. ఇది గత ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలలో ఒకటిగా ఉంది. ఆగస్టు 15 నుంచి(From August 15) ప్రారంభం కానున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఈ పథకం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో పెళ్లిళ్లు, నిరుద్యోగులు, ఉద్యోగాన్వేషణలో ఉండే మహిళల సహా అన్ని మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్స్ ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్‌లలో ఉచితంగా ప్రయాణించొచ్చు.
సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్ స్టార్ లైనర్, ఏసీ బస్సులు, అంతర్రాష్ట్ర రూట్ల బస్సులు, చార్టర్డ్ బస్సులు, ప్యాకేజ్ టూర్ సర్వీసులు, తిరుమల-తిరుపతి మధ్య సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు.

ఉచిత బస్సు ప్రయాణం పొందాలంటే, మహిళలు ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసితులు అయి ఉండాలి. అలాగే కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం ఓటదారు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం తప్పనిసరిగా చూపించాలి.
ప్రయాణికులకు ‘జీరో ఫేర్’ టికెట్లు జారీ చేసి, బస్సు రూట్, ప్రభుత్వం అందించిన పూర్తి సబ్సిడీ వివరాలను తెలిపే విధంగా ప్రభుత్వం నియమించింది. సీసీ కెమెరాలు, బాడీ ఒర్న్ కెమెరాలు బస్సుల్లో ఏర్పాటు చేయాలని, బస్టాండ్లలో ఫ్యాన్లు, కుర్చీలు, నీటి సౌకర్యం, మెరుగుపరచాలని ఆర్టీసీకి ఆదేశాలు జారీ అయ్యాయి.

కాగా తెలంగాణలో ఈ పథకం విజయవంతంగా అమలు కావడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. మహిళల ప్రయాణ భద్రత కోసం బస్సుల్లో సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ ఒర్న్ కెమెరాలు ఏర్పాటు చేశాయి.
తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా వంటి ఇతర రాష్ట్రాలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాలు ఇప్పటికే అమలులో ఉన్నాయి. మహిళల భద్రత, ప్రయాణం సులభతరంగా మార్చడానికి ఈ పథకాలు ఎంతగానో దోహదపడుతున్నాయి.
ఈ విధానాలను అమలు చేయడంతో మహిళల సామాజిక, ఆర్థిక స్వావలంబన పెరిగే అవకాశం ఉంది. ఉచిత బస్సు ప్రయాణం మహిళలను చదువు, ఉపాధి అవకాశాలకు దగ్గరగా తీసుకు వస్తుందని భావిస్తున్నారు. అయితే రద్దీ పెరుగుదల, ట్రాఫిక్, బస్సుల కొరత వంటి సవాళ్లను కూడా ఆర్టీసీ సరైన సమన్వయంతో ఎదుర్కోవాల్సి ఉంటుంది.