Just LifestyleLatest News

Hormonal Effect : హార్మోన్ల ఎఫెక్ట్ స్త్రీలకు మాత్రమేనా? ..ఏజ్‌తో పాటే ఎమోషనల్ హార్మోన్లు అందరిలోనూ మారతాయని తెలుసా?

Hormonal Effect : హార్మోన్ల అసమతుల్యత కేవలం మహిళలకే పరిమితం అనుకుంటే పొరపాటే. మనుషులందరిలోనూ ఎమోషన్స్, మూడ్ స్వింగ్స్‌పై హార్మోన్లు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఒకసారి చూద్దాం..

Hormonal Effect

హార్మోన్లు అనగానే అమ్మాయిల గురించే అంతా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ, ఆడ, మగ అని కాకుండా.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ వయసు పెరుగుతున్న కొద్దీ కూడా హార్మోన్లు చాలా మాయ చేస్తాయి. మనం నవ్వడం, ఏడవడం, కోపంతో ఊగిపోవడం లేదా విపరీతంగా ప్రేమించడం వెనుక మన మనసు ప్రభావం ఎంత ఉందో.. మన బాడీలో నడిచే ఈ హార్మోన్ల ప్రయాణం కూడా అంతే ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సుమారు పదేళ్ల వయసు వరకు పిల్లలందరిలోన హార్మోన్లు చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఆక్సిటోసిన్, గ్రోత్ హార్మోన్లు మాత్రమే వర్క్ చేస్తుండటం వల్ల వాళ్ల ఎమోషన్స్‌లో ఎలాంటి కల్మషం కూడా ఉండదు. అమ్మ నాన్న ప్రేమ, లాలన వల్ల ఆక్సిటోసిన్ బాగా రిలీజై పిల్లలు ఎంతో సేఫ్ ఫీలింగ్‌లో ఉంటారు.

అయితే 11- 19 ఏళ్ల టీనేజ్ స్టేజ్‌లోకి అడుగుపెట్టగానే బాడీలో హార్మోన్లు పెద్ద తుపాన్‌నే సృష్టిస్తాయి. అబ్బాయిల్లో టెస్టోస్టెరాన్ ఎఫెక్ట్‌(Hormonal Effect)తో దూకుడు, కోపం ఎక్కువైతే, అమ్మాయిల్లో మాత్రం ఈస్ట్రోజెన్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ కావడం వల్ల క్షణక్షణానికి మూడ్ మారిపోతుంటుంది. ఆనందాన్ని పంచే డోపమైన్ ఈ ఏజ్‌లోనే ఎక్కువగా రిలీజవుతుంది కాబట్టి ఈజీగా అట్రాక్షన్‌కు గురవుతారు. దీనికి తోడు ఎడ్యుకేషన్, కెరీర్ టెన్షన్స్ వల్ల కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ పెరిగి విపరీతమైన ప్రెజర్‌ను తెచ్చిపెడుతుంది.

ఇక 20 – 35 ఏజ్‌లో హార్మోన్లు ఒక పీక్ స్టేజ్‌కి చేరుకుని బాగా స్థిరపడతాయి. సెరోటోనిన్ వల్ల మనిషిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ప్రశాంతత పెరుగుతాయి. డోపమైన్, ఆక్సిటోసిన్ కలయిక వల్ల పెళ్లి, కెరీర్, లాంగ్ రన్ రిలేషన్‌లపై పర్‌ఫెక్ట్ నిర్ణయాలు తీసుకునే పవర్ వస్తుంది. అయితే లైఫ్ లో వచ్చే భారీ ప్రెజర్ వల్ల కార్టిసాల్ హద్దు మీరితే మాత్రం డిప్రెషన్‌లోకి వెళ్లే డేంజర్ ఉంటుంది.

36 – 50 ఏళ్ల మధ్య వయసులోకి వచ్చేసరికి బాడీలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. మగవారిలో ఇయర్‌కు ఇయర్‌ టెస్టోస్టెరాన్ కొద్దికొద్దిగా తగ్గడం వల్ల వారిలో అలసట, చిరాకు, పనులపై ఇంట్రస్ట్ తగ్గడం వంటివి జరుగుతాయి. ఆడవారిలో ఈస్ట్రోజెన్ లెవెల్స్ పడిపోవడం వల్ల నిద్రలేమి, చిన్నచిన్న విషయాలకే ఏడుపు రావడం, విపరీతమైన మూడ్ స్వింగ్స్ వస్తాయి. ఈ సమయంలో ఇదొక నేచురల్ ప్రాసెస్ అని గుర్తించి ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి.

50 ఏళ్లు దాటిన తర్వాత ఈ మార్పులన్నీ కూడా సెటిలైపోయి మళ్లీ ప్రశాంతత వైపు అడుగులు పడతాయి. కోపం తగ్గిపోయి మనసు మెల్లగా శాంతించడం మొదలు పెడుతుంది . కాకపోతే ఈ స్టేజ్‌లో కొన్ని హార్మోన్లు తగ్గడం వల్ల ఒంటరితనం, నిద్ర పట్టని సమస్యలు రావొచ్చు. అప్పుడు పిల్లలతో, మనవళ్లతో హ్యాపీగా గడపడం వల్ల ఆక్సిటోసిన్ మళ్లీ బూస్ట్ అయి చక్కటి ఉత్సాహాన్ని ఇస్తుంది. కొందరిలో మాత్రం పిల్లల నుంచి దక్కాల్సిన ఆదరణ లేకపోవడం వల్ల విపరీతమైన డిప్రెషన్‌ పట్టి పీడిస్తుంది.

అయితే మనిషిలో ఏజ్ ప్రకారం వచ్చే ఈ హార్మోన్ల ఎఫెక్ట్‌(Hormonal Effect)ను కంట్రోల్‌లో ఉంచుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. రోజూ రెగ్యులర్‌గా ఏడెనిమిది గంటల నిద్ర, ఓ అరగంట నడక లేదా యోగా అలవాటు చేసుకోవాలి. ఇవి బాడీలో హ్యాపీ హార్మోన్లను నేచురల్‌గా పెంచుతాయి.

ముఖ్యంగా జంక్ ఫుడ్‌కి దూరంగా ఉంటూ మంచి పోషకాహారాన్ని తీసుకోవాలి. మెయిన్‌గా మనసులోని బాధలను ఎవరితోనైనా పంచుకుంటే సగం టెన్షన్ ఇట్టే మాయమైపోతుంది. హార్మోన్లు మన శత్రువులు కావని.. మన జీవితాన్ని నడిపించే డ్రైవర్లు మాత్రమేనని అర్థం చేసుకోవాలి. హార్మోన్ల స్వభావాన్ని అర్థం చేసుకుంటే చాలు మనల్ని మనం చాలా బ్యాలెన్స్‌డ్‌గా హ్యాండిల్ చేసుకోవచ్చు.

Over Thinking : అతిగా ఆలోచిస్తున్నారా? అవతలి వారి మైండ్‌సెట్‌ను కూడా మీరే చదివేస్తున్నారా?

Related Articles

Back to top button