Just InternationalJust PoliticalLatest News

Donald Trump : ఇక మీ దేశం ఉండదు…ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్

Donald Trump : అమెరికా, ఇరాన్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇజ్రాయిల్ తో కలిసి ఇరాన్ పై కాలు దువ్విన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తర్వాత వెనక్కి తగ్గాడు

Donald Trump

అమెరికా, ఇరాన్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇజ్రాయిల్ తో కలిసి ఇరాన్ పై కాలు దువ్విన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తర్వాత వెనక్కి తగ్గాడు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా సైనిక బలం, ఆయుధాల సంఖ్య తగ్గిపోతుండడంతో పాటు ఇరాన్ ధీటుగా జవాబిస్తుండడంతో కాల్పుల విరమణ ప్రతిపాదను చేస్తూ వస్తున్నారు.

ఇప్పటికే పలుమార్లు ఇరాన్ ఈ ప్రతిపాదనలను ఒప్పుకోలేదు. అయితే రెండు రోజుల క్రితం ట్రంప్(Donald Trump) తీవ్రస్థాయిలో హెచ్చరించారు. 48 గంటలే టైముంది ఆలోచించుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. కానీ ఇరాన్ మాత్రం అస్సలు వెనక్కి తగ్గేదే లేదంటూ అమెరికా, ఇజ్రాయిల్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ఒకవైపు దాడులు కొనసాగిస్తూ మరోవైపు యుద్ధం తాత్కాలిక నిలుపుదలకు నిరాకరించింది. తిరిగి ఇరాన్ 10 కొత్త ప్రతిపాదనలను ట్రంప్ కు పంపించింది.

ఇరాన్ తో పాటు లెబనాన్, గాజాల్లోనూ యుద్ధం ఆగాలని, అదే సమయంలో తాము డిమాండ్ చేస్తున్న గ్యారెంటీలకు ఒప్పుకోవాలని డిమాండ్ చేసింది. దీనిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ట్రంప్ ఇరాన్ తన చర్యలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందంటూ హెచ్చరించారు.

Donald Trump
Donald Trump

ఇరాన్ పెట్టిన10 కండిషన్లలో హర్మూజ్ జలసంధిపై పూర్తిస్థాయి ఆధిపత్యంగా ప్రధానంగా ఉంది. అక్కడి నుంచి వెళ్లే నౌకలపై టోల్స్ వసూలు చేసే అధికారం, హార్మూజ్ రవాణాను నియంత్రించే అధికారం తమ సొంతం చేయాలని డిమాండ్ చేసింది. అయితే సీజ్ ఫైర్ కు ఒప్పుకోకుంటే ఇరాన్ చమురు క్షేత్రాలపై బాంబులు వేస్తామని ట్రంప్ బెదిరించారు. ఇలా బెదిరించిన గంటల వ్యవధిలోనే ఇరాన్ సీజ్ ఫైర్ కు తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది.

ఇరాన్ పెట్టిన కండిషన్లలో న్యూక్లియర్ హక్కుల అంశం కూడా కీలకంగా చెప్పొచ్చు. సీజ్ ఫైర్ ను ఇరాన్ తిరస్కరించడంపై ట్రంప్ తీవ్రంగా పరిగణించారు. దీనికి చాలా ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని అన్నారు. వెంటనే ఇరాన్ పై దాడి చేయకపోయినా.. సీరియస్ యాక్షన్ త్వరలోనే చూస్తారన్నారు. ఇరాన్ కోలుకోడానికి కొన్నేళ్లు పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు తాము చేసే అణు కార్యక్రమాలు అణ్వాయుధాల కోసం కాదని ఇరాన్ చెబుతోంది. అణు విద్యుత్ తయారు చేసేందుకేనని ఇరాన్ వాదిస్తోంది.

Cockroaches : బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టాలా? ముందు బొద్దింకల గురించి ఈ విషయాలను తెలుసుకోండి..

Related Articles

Back to top button