Bigg Boss Voting : బిగ్‌బాస్‌లో షాకింగ్ ఓటింగ్..టాప్‌లో టెంపర్ వంశీ, డేంజర్ జోన్లో ఆ ఇద్దరు..
Bigg Boss Voting : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఆడియన్స్ అంచనాలకు మించి సాగుతోంది. ఈ వీక్ నామినేషన్లలో ఉన్న 8 మందిలో ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? డేంజర్ జోన్లో ఎవరున్నారు? ఇక్కడ చూడండి.
Bigg Boss Voting
ఇప్పటి వరకూ గొడవలు, అరుపులతో దద్దరిల్లే బిగ్‌బాస్ హౌస్ నాగ్ క్లాస్ ఎఫెక్ట్ వలనో బిగ్ బాస్ వార్నింగ్ వలనో ఈ వీక్ మాత్రం ఊహించని విధంగా చాలా సైలెంట్‌గా, ప్రశాంతంగా సాగిపోతుంది. ఎప్పుడూ లేనిది కంటెస్టెంట్లు అందరూ ఎవరి గేమ్వాళ్లు వాళ్లు మాత్రమే ఆడుతూనే అనవసరమైన గొడవలకు దూరంగా ఉంటున్నారు.
నామినేషన్లలో కూడా అనుకున్నంతగా పెద్దపెద్ద మాటల తూటాలు పేలలేదు. అంతా బాగానే ఉంది కదా అనుకునేలోపే తన అసలు మ్యాజిక్ స్టార్ట్ చేసిన బిగ్ బాస్. .ఈ వీక్ కూడా గత వారంలాగే డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని హింట్ ఇచ్చేశాడు. ఇప్పుడు ఈ వార్తే హౌస్‌లోని కంటెస్టెంట్లకు చెమటలు పట్టిస్తోంది. ఎనిమిది మంది డేంజర్ జోన్లో ఉంటే, వీరిలో ఇద్దరు బయటకు వెళ్లిపోవాలి అంటున్నారు అందులో ఎవరున్నారన్న టెన్షన్ వారిలో కనిపిస్తోంది.
ఈ వీక్ నామినేషన్ బరిలో రోహిత్, వంశీ, రామ్ ప్రసాద్, ఝాన్సీ, శివ్, రామకృష్ణ, యాంకర్ వర్షిణి, సుధీర్ ఉన్నారు. 8 మంది నామినేట్ కావడంతో ఈ వీకెండ్ ఎపిసోడ్(Bigg Boss Voting) ఎవరి మెడపై కత్తిలా మారుతుందనే క్యూరియాసిటీ ఆడియన్స్‌లోనూ విపరీతంగా పెరిగింది. అయితే ఈ వీక్ ఎవ్వరూ ఊహించని విధంగా ఓటింగ్(Bigg Boss Voting) ట్రెండ్స్ పూర్తిగా తలకిందులయ్యాయి. అందరినీ ఆశ్చర్యపరుస్తూ టెంపర్ వంశీ నెంబర్ వన్ ప్లేస్‌లో దూసుకుపోతుండగా..ఇక రెండో స్థానంలో రోహిత్ , మూడో ప్లేస్‌లో సుధీర్ గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో ఝాన్సీ, రామ్ ప్రసాద్ ఉన్నారు.
అసలు అసలైన ట్విస్ట్ లాస్ట్ స్థానాల్లోనే ఉంది. ఆరో ప్లేస్‌లో శివ, ఏడో స్థానంలో రామకృష్ణ ఉండగా.. అందరూ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే భిన్నంగా యాంకర్ వర్షిణి ఏకంగా ఎనిమిదో స్థానంలో నిలిచింది. దీంతో వర్షిణి, రామకృష్ణడేంజర్ జోన్లో డేంజర్ బెల్స్ మోగిస్తుండగా వీరిద్దరిలో ఒకరు గ్యారంటీగా బయటకు వెళ్లాల్సి వస్తుందన్న టాక్ నడుస్తోంది. ఒకవేళ లాస్ట్ వీక్ లాగే ఈసారి కూడా డబుల్ ఎలిమినేషన్ కనుక ఉంటే, ఈ ఇద్దరూ బిగ్ బాస్ హౌస్‌కి గుడ్‌బై చెప్పేయడం పక్కా అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.

మరోవైపు బిగ్‌బాస్ షో స్టార్టయి 50 రోజులు విజయవంతంగా పూర్తయిపోయాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ కంప్లీట్ అవడానికి ఇంకా 8 వారాలు మాత్రమే ఉంది అలాగే ఫినాలేకి కేవలం ఐదుగురు మాత్రమే వెళ్లాలి . అందుకే ఈ ఎనిమిది వారాల్లో మరో 10 మంది ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిందే. ఈ లెక్కలను మరోసారి చూస్తే మాత్రం ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ రూమర్స్ నిజమేనని క్లారిటీ వస్తోంది. మరి కింగ్ నాగార్జున ఈ వీకెండ్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, డేంజర్ జోన్లో ఉన్న ఆ ఇద్దరిలో ఎవరి జాతకం తారుమారవుతుందనేది చూడాలి.
Tablets : టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా? డాక్టర్లు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..





