Just LifestyleLatest News

Over-Interference : బంధాల్లో ఊపిరాడనివ్వని అతి జోక్యం.. ఓవర్ ఇంటర్‌ఫియరెన్స్‌తో ముంచుకొచ్చే ముప్పు ఇదే..

Over-Interference : ఫ్యామిలీలో లేదా రిలేషన్స్‌లో ఇతరుల అతి జోక్యం మెంటల్‌ హెల్త్‌ను దెబ్బతీస్తుంది. అంతేకాదు దీనివల్ల వచ్చే డిప్రెషన్, యాంగ్జైటీ, పర్సనల్ స్పేస్ బౌండరీలపై సైకాలజీ ఏం చెబుతుందో చూద్దాం.

Over-Interference

ఒక మనిషి లైఫ్‌లోకి, పర్సనల్‌ డెసిషన్స్‌లోకి లేదంటే వారి ఫ్రీడమ్‌లోకి ఇతరులు లిమిట్‌కు మించి ప్రవేశించడాన్ని సైకాలజీలో ఓవర్ ఇంటర్‌ఫియరెన్స్(Over-Interference) లేదా ‘పర్సనల్ బౌండరీ వయోలేషన్’ అంటారు. ఫ్యామిలీ మెంబర్స్ , రిలేటివ్స్, లైఫ్ పార్ట్‌నర్, క్లోజ్ ఫ్రెండ్స్ లేదా ఆఫీసులో బాస్.. ఎవరైనా కావొచ్చు.. నేను నీ మంచి కోసమే చెప్తున్నాననే ముసుగులో ప్రతి చిన్న విషయంలోనూ వేలు పెట్టడం అవతలి వ్యక్తి మెంటల్ హెల్త్‌ను ఘోరంగా దెబ్బతీస్తుంది.

నిరంతరం ఇతరుల డెసిషన్స్‌ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఆ వ్యక్తి తన లైఫ్‌పై స్వయంప్రతిపత్తిని పూర్తిగా కోల్పోతాడు. ఇది కాన్ఫిడెన్స్‌ను లోపలి నుంచి దెబ్బతీసి, ఏ చిన్న డెసిషన్ తీసుకోవాలన్నా ఇతరులపైనే ఆధారపడేలా చేసే ప్రమాదం ఉంది.

ముఖ్యంగా ఈ అతి జోక్యం ఉన్న అట్మాస్పియర్‌లో బతికేవారు సైకాలాజికల్‌గా తీవ్రమైన మెంటల్ ప్రెజర్‌కు గురవుతారు. కొంతమంది తమ సొంతంగా ఆలోచించే పవర్‌ను కోల్పోయి మానసికంగా కుంగిపోతే, మరికొంతమంది విసిగిపోయి ప్రతీ దానికి తిరుగుబాటు చేయడం మొదలుపెడతారు.

బంధాలలో పార్ట్‌నర్ లేదా పెంపకంలో పిల్లలపై ఇలాంటి కంట్రోలింగ్ మైండ్‌సెట్ చూపించినప్పుడు, వారిలో ఏదో తప్పు చేస్తున్నామనే ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ పెరిగిపోతుంది. ఒక రిలేషన్‌లో ఎంత అన్యోన్యత ఉన్నా వారి మధ్య ..పర్సనల్ స్పేస్ అనేది అత్యంత కీలకమైన అంశం.

ఒకరి ఫోన్లు కంటిన్యూగా చెక్ చేయడం, వేసుకునే డ్రెస్ నుంచి తినే తిండి వరకు ప్రతీదీ కంట్రోల్ చేసుకోవడం వల్ల పార్ట్‌నర్‌కి ఎమోషనల్ సఫకేషన్ అంటే ఊపిరాడనంత ఒత్తిడి కలిగి ఆ బంధం నుంచి పారిపోవాలనే ఫీలింగ్ పెరిగిపోతుంది.

ఈ సైకలాజికల్ ట్రాప్ నుంచి బయటపడాలంటే మన లైఫ్‌లోకి ఇతరులు ఎంతవరకు రావాలో స్పష్టమైన బౌండరీలు గీయడం చాలా అవసరం. నా డెసిషన్స్ నేను తీసుకోగలను, మీ సలహా అవసరమైతే నేనే అడుగుతానని మర్యాదగా, గట్టిగా చెప్పడం అలవాటు చేసుకోవాలి.

అందరినీ మెప్పించాలనే ధోరణి ఉన్నవాళ్లే ఇలా ఇతరుల అతి జోక్యానికి ఈజీగా బలైపోతారు, అందుకే నచ్చని విషయాలకు మొహమాటం లేకుండా నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. అతి జోక్యం అనేది అన్యోన్యతకు నిదర్శనం కాదు, అదొక రకమైన మైండ్ కంట్రోలింగ్ సైకాలజీ అని గుర్తుంచుకోవాలి. అందుకే ప్రతీ ఒక్కరి దగ్గర బౌండరీస్ నిర్మించుకున్నప్పుడే  మనకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది.

అలాగే ఓవర్ ఇంటర్‌ఫియర్(Over-Interference) అయ్యేవాళ్లు కూడా తమ అవసరం అక్కడ ఎంత అనేది ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. కొన్నిసార్లు అడగకుండా ఇచ్చిన సలహాలు, తీసుకోమని చెప్పే నిర్ణయాలు అవతలి వారి పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా ఇబ్బంది పెడతాయి. అందుకే అడిగినపుడే సలహాలు చెప్పడం,వారి విషయాలలో జోక్యం చేసుకోవడం చేయాలి. అప్పుడే రెండు సైడుల నుంచి ఎవరికి వారు ప్రశాంతంగా ఉంటారు.

Passive Resistance : చెప్పినవన్నీ చేస్తామంటారు..కానీ నచ్చిందే చేస్తారు.. మీరూ అదే టైపా?

Related Articles

Back to top button