Bigg BossJust EntertainmentLatest News

Weekend Episode : బిగ్ బాస్ హౌస్‌లో నాగ్ వీకెండ్ విధ్వంసం.. వర్షిణికి అక్షింతలు, గుసగుసల బండారం అవుట్..

Weekend Episode : బిగ్ బాస్ సీజన్ తెలుగు 10లో ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లకు గట్టిగా క్లాస్ పీకారు. వర్షిణి ఫౌల్ ప్లే, రోహిత్,ముకేష్ బూతు మాటల వీడియోలను బయటపెట్టి మరీ సీరియస్ అయ్యారు నాగ్.

Weekend Episode

బిగ్ బాస్ హౌస్ అంటేనే హౌస్ మేట్స్ చుట్టూ వందలాది కెమెరాల నిఘా ఉంటుందన్న విషయం అందరికీ తెలుసు. అందుకే అక్కడ ఎవరు ఎక్కడ ఏ చిన్న తప్పు మాట్లాడినా, తప్పు చేసినా ఇట్టే దొరికిపోతారు. కానీ ఈ సీజన్ కంటెస్టెంట్లు మాత్రం వీరికంటే చిన్నపిల్లలే బెటర్ అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు. వారం వారం హోస్ట్ నాగార్జున వారికి ఎంత గడ్డిపెట్టినా అవన్నీ దులిపేసుకుని పాత పద్ధతినే ఫాలో అవుతున్నారు ప్రవర్తిస్తున్నారు తప్ప తమ గేమ్‌ను, బిహేవియర్‌ను మార్చుకోవడం లేదు.

అయితే ఈ వీకెండ్ ఎపిసోడ్‌(Weekend Episode)లో మాత్రం టోటల్ సహనం కోల్పోయి అలాంటి హౌస్‌మేట్స్‌కు దెబ్బకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఈ వారం మొత్తం ఆడిన గేమ్‌పై రేటింగ్ ఇస్తూ, నీతులు చెప్పే వర్షిణికి కూడా గట్టిగానే అక్షింతలు వేశారు. నువ్వు గ్రీన్‌లోకి వచ్చావు అయితే నీ గేమ్ గురించి నువ్వు చెప్తావా లేదంటే నన్ను చెప్పమంటావా అని నాగ్ అడుగుతారు. దీంతో వర్షిణి అమాయకంగా, సిగ్గుపడుతూ చూసింది. దాంతో వర్షిణి రోహిత్‌తో కలిసి ఆడిన ఫౌల్ గేమ్ వీడియోను ప్లే చేసి ఆమె ముసుగును తొలగించారు.

అల్టిమేట్ గోట్ టాస్క్‌లో వర్షిణి ఆట తీరును బయటపెడుతూ నాగార్జున ఫుల్‌గా క్లాస్ పీకారు. అమన్ వర్షిణి ఫొటోను ముందుకు జరుపుతుంటే.. నాది కాదు అమన్, ముకేష్ ఫొటో ముందుకు జరపమని వర్షిణి పడ్డ తాపత్రయం వీడియోను చూపిస్తూ.. నీ గేమ్ నువ్వు ఆడటానికి వచ్చావా లేక వేరేవాళ్ల కోసమా? అంటూ డైరెక్ట్‌గా సీరియస్ అయ్యారు. ముందేమో తెలీదన్నావు, ఇప్పుడు వాళ్లు చేశారు కాబట్టి నేను చేశానంటున్నావంటూ వర్షిణి డబుల్ గేమ్‌ను ఎండగట్టారు.

ఇక అసలు రచ్చ నైట్ టైమ్‌లో వీళ్లు ఆడిన బూతు పాలిటిక్స్‌తో రచ్చ మొదలైంది. రోహిత్, ముకేష్, సుధీర్, వర్షిణి అర్ధరాత్రి కూర్చుని త్రిగుణ్‌ను ‘త్రిగుణ్ దూత (TD)’ అని, శివను నీచమైన పదంతో మీడియేటర్/బ్రోకర్ అని పలుకుతూ మాట్లాడిన మాటలను నాగార్జున వీడియోలో చూపించారు.

Weekend Episode
Weekend Episode

P అంటే ఏంటి B అంటే ఏంటో తెలుసా అంటూ వరుస ప్రశ్నలతో ఝాన్సీ, సుధీర్, వర్షిణి నోళ్లు మూయించారు నాగ్. అలాంటి అసభ్యకర పదాలను చెప్పడానికి ఇప్పుడు మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు, చూసే ఆడియన్స్ ఏమనుకుంటారని నిలదీశారు. అంతటితో ఆగకుండా వర్షిణికి గతంలో ఇచ్చిన 3 స్టార్లను వెనక్కి తీసుకుని, డైరెక్టుగా(Weekend Episode) జీరో స్టార్స్‌తో మళ్లీ రెడ్ జోన్‌లోకి నెట్టేసిన నాగార్జున.. తన పవర్‌ను కంటెస్టెంట్స్‌కు చూపించారు.

Murasu Cyclone : ఏపీకి మురసు తుపాను ముప్పు..బంగాళాఖాతంలో దూసుకొస్తున్న వాయుగుండం

Related Articles

Back to top button