Jailer 2 : ఈనెలలోనే ఓటీటీలోకి జైలర్ 2 ..30 నిమిషాల ఎక్స్ట్రా సీన్స్‌తో రిలీజ్
Jailer 2 : కోలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రజనీకాంత్ జైలర్ 2 సినిమా ఓటీటీ రిలీజ్ అప్డేట్ వచ్చేసింది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్, ఎక్స్ట్రా సీన్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Jailer 2
సూపర్‌స్టార్ రజనీకాంత్, క్రియేటివ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో వచ్చిన జైలర్ 2(Jailer 2) మూవీ బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్లను రాబట్టింది. బ్లాక్‌బస్టర్ హిట్ జైలర్ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా, దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీన థియేటర్లలో రిలీజై కోలీవుడ్ సినీ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్లను సాధించింది.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ, గ్లోబల్ వైడ్‌గా రూ. 750 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికీ తమిళనాడుతో పాటు కొన్ని ప్రాంతాల్లో హ్యూజ్ రెస్పాన్స్‌తో రన్ అవుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్, ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది.
జైలర్ 2(Jailer 2) డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను .. అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి ఓన్ చేసుకుంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇన్ఫో ప్రకారం, ఈ ఓటీటీ డీల్ దాదాపు రూ. 160 కోట్లకు కుదిరినట్లు తెలుస్తోంది. నవంబర్ 12వ తేదీ నుంచి తమిళంతో పాటు తెలుగు , ఇతర భాషల్లో ఏకకాలంలో ఈ మూవీ డిజిటల్ స్క్రీన్‌పైకి రాబోతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. థియేటర్లలో తలైవా మాస్ జాతరను మిస్ అయిన ఆడియన్స్ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ఈ విజువల్ ట్రీట్ చూసేయొచ్చు.
ఇక ఈ మూవీకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే.. ఓటీటీ వెర్షన్లో దాదాపు 30 నిమిషాల ఎక్స్ట్రా ఫుటేజ్‌తో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్ టైమ్ వల్ల కట్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ సన్నివేశాలను డిజిటల్ వెర్షన్లో యాడ్ చేస్తున్నారని టాక్.
మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, హృతిక్ రోషన్ వంటి బడా హీరోల పవర్ఫుల్ సన్నివేశాలు ఓటీటీ ఆడియన్స్‌కు కొత్త కిక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. ఈ మూవీలో విజయ్ సేతుపతి, జాకీ ష్రాఫ్, మిథున్ చక్రవర్తి,రమ్యకృష్ణ, విద్యాబాలన్, వంటి పెద్ద పెద్ద తారలు ప్లస్ అవగా..దానికి అనిరుధ్ అందించిన సాంగ్స్ అండ్ బీజీఎం ఈ మూవీని మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. మొత్తానికి థియేటర్లలో రికార్డులు తిరగరాసిన జైలర్ 2, ఇప్పుడు ఓటీటీలో కూడా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
RC17 : చరణ్ ,సుకుమార్ మాస్ కాంబో రిపీట్..క్రేజీ లుక్‌తో చెర్రీ





