Just LifestyleLatest News

Stubbornness : ఎన్నిసార్లు చెప్పినా కొందరు ఎందుకు మారరు? వారి మైండ్‌లో జరిగే సైకాలజీ ఏంటి?

Stubbornness : ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది తమ ప్రవర్తనను మార్చుకోరు. వయసు పెరిగినా తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనేలా ఉంటారు. ఇలాంటి మైండ్ సెట్ వెనుక ఉన్న సైకాలజీ ఏంటో ఇక్కడ చదవండి.

Stubbornness

మన లైఫ్‌లో చిత్రవిచిత్రమైన మైండ్ సెట్ ఉన్నవాళ్లు ఉంటారు. ఇలాంటివారిలో కొంతమందికి ఎన్నిసార్లు నచ్చజెప్పినా, ఎలా ప్రూవ్ చేసినా కూడా అస్సలు మారరు. చిన్నపిల్లల్లో ఈ మొండితనం(Stubbornness) ఉందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ, 50-60 ఏళ్లు వచ్చి, అనుభవాలు పెరిగి, రిటైర్మెంట్ ఏజ్‌కు దగ్గర పడుతున్నా కూడా తాను నమ్మిందే నిజం.. తన పద్ధతే కరెక్ట్ అని వాదించేవాళ్లు మన చుట్టూ చాలామందే ఉంటారు. మరికొంతమంది అయితే రియలైజ్ అయినట్లు ఇకపై ఇలా ఉండను మారతాను అని చెప్పి కూడా మరుసటి రోజు నుంచే మళ్లీ అదే పాత ధోరణినే ఫాలో అయిపోతుంటారు. నిజానికి ఇలాంటి వారి బ్రెయిన్‌లో ఏం జరుగుతోంది? సైకాలజీ దీని గురించి ఏం చెబుతుందో అన్న క్యూరియాసిటీ ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది.

సైకాలజీలో ఇలాంటి ప్రవర్తనకు మెయిన్ రీజన్ “కన్ఫర్మేషన్ బయాస్” (Confirmation Bias). అంటే, మనుషులు తమకు నచ్చిన లేదా తమ మనసులో బలంగా నాటిన నమ్మకాలకు అనుకూలంగా ఉండే విషయాలను మాత్రమే నిజమని నమ్ముతారు. దానికి వ్యతిరేకంగా ఎంత బలమైన ఆధారాలు చూపించినా, వారి బ్రెయిన్ ఆ సమాచారాన్ని స్వీకరించడానికి ఇష్టపడదు. ఎందుకంటే ఏళ్ల తరబడి ఒకే రకమైన ఆలోచనా విధానంతో బతికేసిన ఇలాంటి వారికి, తమ నమ్మకం తప్పని ఒప్పుకోవడం అంటే తమ ఉనికినే ప్రశ్నించుకున్నట్లుగా ఫీలవుతుంటారు. అందుకే స్వయం రక్షణ కోసం (Self-defense mechanism) వారు తమ ప్రవర్తనను మార్చుకోవడానికి ఇష్టపడరు.

ఇక రెండో ముఖ్యమైన అంశం కాగ్నిటివ్ డిసొనెన్స్ (Cognitive Dissonance). ఒక వ్యక్తికి తమ తప్పు ఏంటో లోపల అర్థమవుతున్నా, దానిని బయటవారి ముందు ఒప్పుకుంటే తమ గౌరవం లేదంటే ఇగో దెబ్బతింటుందనే భయం ఉంటుంది. అందుకే తాను మారతానని పైకి చెప్పి మిమ్మల్ని ఆ క్షణంలో శాంతింపజేస్తారు తప్ప, లోపల మాత్రం ఆ చేంజ్‌ను యాక్సప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండరు. ప్రత్యేకించి వయసు పెరిగే కొద్దీ బ్రెయిన్‌లో ఆలోచనా విధానాలు (Neural pathways) చాలా గట్టిపడిపోతాయి. దీనివల్ల కొత్త విషయాలను నేర్చుకోవడం లేదా పాత అలవాట్లను వదులుకోవడం వారి మెంటల్ స్ట్రెంత్‌కి మించిన భారంగా మారుతుంది.

చివరగా, చాలామందిలో వారికి తెలీకుండానే ఈగో (Ego) కంట్రోల్ (Control) అనే ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. తమ ఆలోచనలే ఇతరులు కూడా పాటించాలనే కోరిక ఉన్నవారు, ఇతరులు చెప్పే మంచి మాటలను కూడా ఒక ఆధిపత్య పోరుగానే చూస్తారు. కాబట్టి మనుషులను వారి మానాన వారిని వదిలేసినంత ఉత్తమం లేదన్న విషయాన్ని మనం గుర్తించాలి.

Gen Z Love Rules : నువ్వు లేకపోతే నేను లేను సీన్స్ బంద్..జెన్ జెడ్ సరికొత్త లవ్ రూల్స్ ఇవే..

Related Articles

Back to top button