Vaibhav Sooryavanshi : కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ తొలి మ్యాచ్..సత్తా చూపిస్తాడా?
Vaibhav Sooryavanshi : భారత క్రికెట్లో వరుస సంచలనాలు సృష్టిస్తున్న యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి బీహార్ సీనియర్ టీమ్ కెప్టెన్సీ దక్కింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026-27 కోసం BCA జట్టు వివరాలను కూడా ప్రకటించింది.
Vaibhav Sooryavanshi
ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్లో ఇప్పుడు ఒకే ఒక్కడి పేరు మారుమోగిపోతోంది. తన మాస్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న యంగ్ అండ్ డైనమిక్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి(Vaibhav Sooryavanshi) బీహార్ క్రికెట్ బోర్డు మైండ్ బ్లాకింగ్ ఆఫర్ ఇచ్చింది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ 2026-27 సీజన్ కోసం బీహార్ సీనియర్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఈ బుడ్డోడినే సెలక్ట్ చేశారు.
నవంబర్ 4 వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరిపిన ట్రయల్స్, ప్లేయర్ల రీసెంట్ ఫామ్‌ను అన్నిటినీ లెక్కలు వేసుకున్న బీహార్ క్రికెట్ అసోసియేషన్ (BCA) సెలెక్టర్లు, చివరకు నిర్ణయం తీసుకున్నారు. 17 మందితో కూడిన ఈ స్క్వాడ్‌కు వైభవ్‌ను బాస్‌గా నియమించగా, వైస్ కెప్టెన్‌గా సూరజ్ కశ్యప్‌ను అనౌన్స్ చేశారు.
ఈ సారి బీహార్ తరఫున మైదానంలోకి దిగబోయే స్క్వాడ్ లిస్ట్‌ను ఒకసారి చూస్తే.. వైభవ్ సూర్యవంశీ లీడర్‌షిప్‌లో అలోక్ కుమార్, రిత్విక్ రాజ్, అల్తమాష్ అష్రఫ్, పరమ్ కుమార్ సింగ్, రిత్విక్ రాజ్, సూరజ్ కశ్యప్, మయాంక్ కుమార్,ఆశిష్ కుమార్, వాసుదేవ్ ప్రతాప్ సింగ్, రాఘవేంద్ర ప్రతాప్, ప్రశాంత్ సింగ్, నవాజ్ ఖాన్, మహమ్మద్ ఇజార్, అమోద్ యాదవ్, హిమాన్షు సింగ్ తమ బెర్త్ కన్ఫమ్ చేసుకున్నారు. ఇక టీమ్‌లో వికెట్ కీపింగ్ బాధ్యతలను ఆయుష్ లోహరుకా, అన్మోల్ కుమార్ పంచుకోనున్నారు.
నవంబర్ 14వ తేదీన ఇండోర్ వేదికగా బలమైన సౌరాష్ట్రతో జరిగే ఫస్ట్ మ్యాచ్‌తో బీహార్ తన పోరును స్టార్ట్ చేస్తుంది. ఆ వెంటనే నవంబర్ 16వ తేదీన రైల్వేస్ టీమ్‌తో తలపడనుంది. అయితే ఈ ప్రారంభ రెండు మ్యాచ్‌లకు మాత్రమే వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) కెప్టెన్‌గా బరిలోకి దిగుతాడు.
ఎందుకంటే ఆ తర్వాత ఖతార్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక 2026 రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం ఇండియా-ఏ టీమ్‌లో చేరాల్సి ఉంది. ఇండియా-ఏ తరఫున నవంబర్ 20వ తేదీన నేపాల్‌తో జరిగే ఓపెనింగ్ మ్యాచ్‌లో వైభవ్ ఆడనున్నాడు.
సీనియర్ రేంజ్ క్రికెట్లో ఒక పూర్తి లెవెల్ టీమ్‌కు వైభవ్ కెప్టెన్‌గా బాధ్యతలు వహించడం ఇదే తొలిసారి కావడంతో అందరి చూపు ఈ బుడ్డోడిపైనే పడింది. కెప్టెన్సీ రెస్పాన్సిబిలిటీని ఎలా హ్యాండిల్ చేస్తాడు..ఆ సత్తా ఈ ఏజ్‌లోనే మనోడికి ఉందా అన్న చర్చను షురూ చేశారు.
నిజానికి 2026 దులీప్ ట్రోఫీలోనే ఈస్ట్ జోన్ టీమ్‌కు వైభవ్ వైస్ కెప్టెన్‌గా చేసి, ఫైనల్లో రెగ్యులర్ కెప్టెన్ ఇషాన్ కిషన్ గాయపడటంతో కొద్దిసేపు లీడర్‌గా కూడా మెరిసి అందరితో శభాష్ అనిపించుకున్నాడు. ఇక గత సీజన్ చూస్తే సకిబుల్ గని కెప్టెన్సీలో బీహార్ ఘోరంగా విఫలమై, ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఒక్కటంటే ఒకటి మాత్రమే గెలిచి గ్రూప్-బిలో లాస్ట్ ప్లేస్‌లో నిలిచింది. అలాంటి ప్లేస్‌లో ఇప్పుడు ఒక యంగ్ బ్లడ్ కెప్టెన్ కావడంతో.. అతనిపై బోర్డు ఉంచిన నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటాడా అనేది ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.





