Just TechnologyJust InternationalLatest News

Doomsday : 66 ఏళ్ల క్రితం నాటి ప్రళయం అంచనా.. నిన్నటితో ముగిసిన డూమ్స్‌డే డేట్ ఎందుకు తప్పింది?

Doomsday : 66 ఏళ్ల క్రితం శాస్త్రవేత్తల డూమ్స్‌డే అంచనా వేసిన 2026 నవంబర్ 13వ తారీఖు దాటిపోయింది. ఆ లెక్కలు ఎందుకు తప్పాయి, నిన్న ప్రపంచానికి ఏమీ కాకపోవడానికి కారణాలేంటి?

Doomsday

ప్రపంచం మొత్తం అంతం అయిపోతుందని 66 ఏళ్ల క్రితం ప్రచురితమైన ఒక ఇంటర్నేషనల్ పరిశోధనలో పేర్కొన్న 2026 నవంబర్ 13వ తారీఖు నిన్నటితో ప్రశాంతంగా ముగిసిపోయింది. ఆ నిర్దిష్ట డేట్ వచ్చి వెళ్లిపోయినా భూమికి కానీ, మనుషులకు కానీ ఎలాంటి చిన్న ప్రమాదమూ జరగలేదు. దీంతో ఆరు దశాబ్దాల క్రితం ఫేమస్ సైన్స్ జర్నల్‌లో సంచలనం సృష్టించిన ఆ పరిశోధన కథనం.. అందులోని గణిత లెక్కలు మరోసారి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

నిజానికి అంచనాలకు మూలం 1960 నవంబర్ 4వ తేదీన వెలువడిన ఒక అధ్యయనం. ఫిజిక్స్ సైంటిస్ట్ హీంజ్ వాన్ ఫోర్స్‌టర్, ప్యాట్రిసియా ఎం. మోరా, లారెన్స్ డబ్ల్యూ. అమియో కలిసి రూపొందించిన ఈ రీసెర్చ్ పేపర్‌కి డూమ్స్‌డే(Doomsday): ఫ్రైడే, నవంబర్ 13వ తేదీ, ఏ.డి. 2026 అనే ఆసక్తికరమైన శీర్షికను పెట్టారు. శీర్షికలో ‘డూమ్స్‌డే'(Doomsday) (ప్రళయం) అనే పదం ఉండటంతో శుక్రవారం ప్రపంచ వినాశనం జరుగుతుందని చాలామంది ఆందోళన చెందారు. కానీ పరిశోధకుల అసలు ఉద్దేశం భూమి పేలిపోతుందని చెప్పడం కాదని తర్వాత అర్ధం అయింది.

క్రీస్తుపూర్వం 400 – 1958 వరకు అందుబాటులో ఉన్న వరల్డ్ జనాభా గణాంకాలను విశ్లేషించినప్పుడు సైంటిస్టులకు ఒక ఆసక్తికరమైన ధోరణి కనిపించింది. జనాభా పెరిగే కొద్దీ, అది రెట్టింపు కావడానికి పట్టే టైమ్‌ మెల్లగా తగ్గుతూ వస్తోందని గుర్తించారు. ఈ స్పీడ్‌ను అప్పటి గణిత మోడల్‌ ద్వారా ఫ్యూచర్‌కు అన్వయించినప్పుడు..2026 నవంబర్ 13వ తేదీ నాటికి ప్రపంచ జనాభా లెక్కించలేనంతగా అనంతానికి (Infinity) చేరుతుందని లెక్కకట్టారు. అంటే మనుషుల జనాభా అపరిమితంగా పెరిగిపోవడం వల్ల ఫుడ్ , వాటర్, నివాసం వంటి నేచురల్ రీసోర్స్‌పై విపరీతమైన ఒత్తిడి ఏర్పడి మనుషుల మనుగడకే సవాల్‌గా మారుతుందని హెచ్చరించడమే వారి మెయిన్ టార్గెట్.

అయితే నిన్నటితో ఆ డేంజరస్‌ డేట్ దాటిపోయినా ప్రపంచానికి ఏమీ కాకపోవడానికి రీజన్‌.. సైంటిస్టులు ఊహించని విధంగా మెల్లగా మనుషుల లైఫ్‌స్టైల్‌లో వచ్చిన విప్లవాత్మక మార్పులే. 1990ల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎడ్యుకేషన్, ఉపాధి అవకాశాలు పెరగడం, అర్బనైజేషన్ , ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతులపై విస్తృత అవగాహన రావడం వల్ల జననాల రేటు మెల్లగా తగ్గడం ప్రారంభమైంది. ఒకప్పుడు ఎక్కువ మంది పిల్లలను కనే కల్చర్ నుంచి ఒకటి లేదా ఇద్దరు పిల్లలకే పరిమితమయ్యే ధోరణి పెరిగింది.

ఆ పాత మోడల్ ప్రకారం 2025 నాటికే వరల్డ్ జనాభా దాదాపు 1,310 కోట్లకు చేరాల్సి ఉండగా, ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రస్తుతం వరల్డ్‌ జనాభా కేవలం 820 కోట్లుగా మాత్రమే ఉంది. అయితే ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన శాస్త్రవేత్త హీంజ్ వాన్ ఫోర్స్‌టర్ జన్మదినం 1911 నవంబర్ 13వ తేదీ మరో ఆసక్తికరమైన అంశం. ఆయన తన సొంత బర్త్‌డే డేట్‌ను ఈ గణిత నమూనాకు ల్యాండ్‌మార్క్‌గా ముడిపెట్టడం విశేషం. టోటల్ ఆ డూమ్స్‌డే తేదీ నవంబర్ 13వ తేదీతో సేఫ్‌గా దాటిపోవడంతో.. అది కేవలం భూమి వనరుల సంరక్షణ కోసం ఆ టైమ్‌లో వార్నింగ్ ఇచ్చిన ఒక పాత గణిత నమూనా మాత్రమేనని క్లారిటీ వచ్చింది.

Ramayana : రూ.1,100 కోట్ల క్లబ్‌లోకి రామాయణ.. ఛావా రికార్డులు బ్రేక్ చేస్తూ కలెక్షన్ల సునామీ

Related Articles

Back to top button