Just EntertainmentLatest News

Ramayana : రూ.1,100 కోట్ల క్లబ్‌లోకి రామాయణ.. ఛావా రికార్డులు బ్రేక్ చేస్తూ కలెక్షన్ల సునామీ

Ramayana : రణ్‌బీర్ కపూర్ రామాయణ మూవీ 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,110 కోట్ల గ్రాస్ వసూళ్లను చేసి రికార్డు సృష్టించింది. ఛావా, పఠాన్ సినిమాలను కూడా దాటేసింది.

Ramayana

భారతీయ ఇతిహాస గాథను బేస్ చేసుకుని తెరకెక్కించిన రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల సునామీని క్రియేట్ చేస్తుంది. రణ్‌బీర్ కపూర్ హీరోగా నితేశ్ తివారీ డైరెక్షన్‌లో రూపొందిన ఈ మూవీ ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ పొందుతోంది. థియేటర్లలోకి వచ్చిన నాటి నుంచి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ మూవీ రిలీజైన తొమ్మిది రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.1,110.70 కోట్ల గ్రాస్ వసూలు చేసి అరుదైన రికార్డును తన పేరుతో లిఖించుకుంది.

ముఖ్యంగా దేశీయ మూవీ మార్కెట్‌లో ఈ సినిమా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. తొమ్మిదో రోజు భారత్‌లో రూ.47.85 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టడంతో, దేశీయంగా మొత్తం రాబట్టిన నెట్ వసూళ్లు రూ.612.45 కోట్లకు చేరాయి. దీంతో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన విక్కీ కౌశల్ ఛావా లైఫ్‌టైమ్ కలెక్షన్లను రామాయణ(Ramayana) మూవీ ఈజీగా దాటేసింది. అంతేకాకుండా చావా కంటే ముందు షారుఖ్ ఖాన్ పఠాన్, రణ్‌బీర్ కపూర్ యానిమల్ సినిమాలు సాధించిన లైఫ్‌టైమ్ రికార్డులను కూడా ఈ చిత్రం వెనక్కి నెట్టేసింది.

సాక్‌నిల్క్ రిపోర్ట్ ప్రకారం తొమ్మిదో రోజు ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా సుమారు 23 వేల షోలలో ప్రదర్శిస్తున్నారు. హిందీ వెర్షన్‌లో ఎక్కువగా రూ.36.25 కోట్లు వసూలు కాగా, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో కూడా మంచి వసూళ్లే నమోదయ్యాయి. దీంతో భారత్‌లో మొత్తం గ్రాస్ కలెక్షన్లు రూ.732.20 కోట్లకు చేరాయి.

అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఈ రామాయణ(Ramayana) సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. తొమ్మిదో రోజు విదేశాల్లో రూ.25 కోట్ల గ్రాస్ రాగా, ఓవర్సీస్‌లో మొత్తం వసూళ్లు రూ.378.50 కోట్లకు చేరుకున్నాయి. నవంబర్ 5వ తేదీన రిలీజైన ఈ సినిమా ఫస్ట్ రోజు రూ.64.85 కోట్ల ఓపెనింగ్స్‌ సాధించి, ఫస్ట్ ఎనిమిది రోజుల్లోనే రూ.1,000 కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం.

Urinary Tract Infection : యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మహిళలలోనే ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంది? దీనికి ట్రీట్మెంట్ ఏంటి?

Related Articles

Back to top button