Just LifestyleLatest News

Rumours : రూమర్స్ ఎవరు స్ప్రెడ్ చేస్తారు? దీనిపై సైకాలజిస్టులు ఏం చెబుతున్నారు?

Rumours : సొసైటీలో, పనిచేసే చోట రూమర్స్ ఎందుకు పుట్టుకొస్తాయి? వాటి వెనుక ఉన్న సైకాలజీ ఏంటి?

Rumours

మన గురించి ఎవరైనా రూమర్స్ క్రియేట్ చేసి మాట్లాడుతున్నారనే విషయం తెలిసినప్పుడు మనసు చాలా అశాంతిగా మారిపోతుంది. మనం అనని మాటలను అన్నట్లుగా, చేయని తప్పులను మనకు ఆపాదించడం చూసి మనమే షాక్ తినాల్సి వస్తుంది. ఆఫీసులోనైనా, రిలేటివ్స్, ఫ్రెండ్స్ సర్కిల్‌లోనైనా ఇలాంటి రూమర్లు మెంటల్ పీస్‌ను దెబ్బతీస్తాయి.

ప్రతి రూమర్ వెనుక పెద్ద కుట్రలేమీ జరగవు కానీ..కొంతమంది కావాలనే మన పేరు డ్యామేజ్ చేయాలని చూస్తే, మరికొంతమంది మాత్రం అసలు నిజానిజాలు తెలుసుకోకుండానే విన్నది విన్నట్లు ఇతరులకు స్ప్రెడ్ చేయడంతో జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది. మెయిన్‌గా మనతో పాటు ఉండే వారు ఆఫీస్‌లో ముందుకెళ్తున్నా లేదా మంచి పేరు తెచ్చుకున్నా తట్టుకోలేక అసూయతో ఇలాంటి ప్రచారాలు చేస్తుంటారు.

అలాగే రిలేటివ్స్, ఫ్రెండ్స్ , మరికొందరు తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని తమ కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ఇన్ఫర్మేషన్‌ను ఆయుధంగా వాడతారు.తమ చుట్టూ ఉన్నవారిని మానుప్యులేట్ చేసి మరీ ఉన్నవి, లేనివి కల్పించి చెబుతారు. ఇంకొంతమంది అయితే నలుగురిలో తామేదో గొప్ప సీక్రెట్ చెప్పినట్లు బిల్డప్ ఇవ్వడానికి లేనిపోని కథలను అల్లేసి చెబుతుంటారు. అలాగే కొంతమంది ఒకరిని డైరెక్టుగాఫేస్ చేసే ధైర్యం లేనివారు ఇలాంటి ఈజీ రూట్‌ను ఎంచుకుంటారు.

అయితే మన గురించి ఏదో తప్పుడు న్యూస్ వినిపించగానే వెంటనే కోపంతో ఊగిపోవడం అలాగే అందరికీ వివరణలు ఇచ్చుకోవడం అస్సలు చేయకూడదు. ఆవేశంలో రియాక్ట్ అయితే ఆ రూమర్స్(Rumours) పెద్దవవుతాయి. అందుకే ముందుగా ఆ విషయం ఎంతవరకు నిజమో బేరీజు వేసుకోవాలి. ఎవరో వచ్చి మీ గురించి ఏదో అన్నారంటే గుడ్డిగా నమ్మేయకుండా, ఆ విషయానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించాలి.

మీ గురించి తప్పుడు ప్రచారం చేస్తోంది ఎవరో మీకు తెలిస్తే, నలుగురి మధ్య పెద్ద రచ్చ చేయడం కంటే వారిని పర్సనల్‌గా కలిసి ప్రశాంతంగా మాట్లాడాలి. నా గురించి ఇలాంటి వార్త వినిపిస్తోందని.. ఇందులో ఎలాంటి నిజం లేదని చెప్పాలి. అలా అని ప్రతి ఒక్కరికీ ఫోన్ చేసి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం అసలే లేదు. నిజంగా మీ లైఫ్‌లో ఎవరు ఇంపార్టెంట్ అనుకుంటారో వారికి మాత్రమే సింపుల్‌గా నిజం చెప్పి వదిలేయాలి.

అన్నింటికంటే మెయిన్‌గా పరిస్థితి చేయి దాటిపోయినా కూడా.. మీ వర్క్‌పై, మీ గ్రోత్‌పై పూర్తి ఫోకస్ పెట్టాలి. ఇతరులు ఏమనుకుంటున్నారనేదానిపై ఆలోచిస్తూ రోజంతా గడుపుతూ కూర్చుంటే మీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. అంతే కాదు ప్రతి రూమర్‌ను పట్టించుకోవడం కంటే మీ లైఫ్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్లడమే ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. మీ పనిలో, మీలో నిజాయితీ ఉన్నప్పుడు లేట్ అయినా కూడా అన్నింటికీ కాలమే ఆన్సర్ చెబుతుంది.

Office Politics : ఆఫీస్ పాలిటిక్స్.. ఆఫీసులో ఉండే ఆ 4 రకాల మనుషులు మీ దగ్గరా ఉన్నారా?

Related Articles

Back to top button