Bigg BossJust EntertainmentLatest News

Bigg Boss Top 5 : బిగ్ బాస్ సీజన్ 10 టాప్ 5 లెక్కలివే.. టైటిల్ వార్ ఆ ఇద్దరి మధ్యనేనా?

Bigg Boss Top 5 : బిగ్ బాస్ సీజన్ 10 డెబ్బై ఐదు రోజుల జర్నీ తర్వాత టాప్ 5 అంచనాలు వేడెక్కుతున్నాయి. త్రిగుణ్, ముకేష్, దేబ్జానీ, అమన్‌తో పాటు ఐదో ప్లేస్‌ కోసం ఎవరు పోటీ పడుతున్నారో చూడండి.

Bigg Boss Top 5

బిగ్ బాస్ సీజన్ డెబ్బై ఆరు రోజుల గేమ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని ఎండింగ్ స్టేజ్‌ వైపు అడుగులు వేస్తోంది. మరో ఇరవై నాలుగు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉండగా, ఈ సీజన్‌లో ఫైనల్ పోరు త్రిగుణ్, ముకేష్‌ల మధ్యే సాగుతుందనే చర్చ మాత్రం గట్టిగానే వినిపిస్తోంది. వారిని ఈ వీక్ డిక్టేటర్లుగా నిలబెట్టడం ద్వారా నిర్వాహకులు కూడా ఒక క్లియర్ సిగ్నల్ ఇచ్చారనే అభిప్రాయం ఆడియన్స్‌లో ఉంది.

ఇక టాప్ 5 ప్లేస్ విషయానికి వస్తే, ఇప్పటివరకు కనిపిస్తున్న గేమ్ తీరు, ఓటింగ్ ప్రకారం దేబ్జానీకి బలమైన సపోర్టు కనిపిస్తోంది. ఆటతీరు, ప్రవర్తనతో పాటు బుల్లితెర ఆడియన్స్ ఆదరణ ఆమెకు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. ఫిజికల్ టాస్క్‌లలో దూకుడు చూపిస్తున్న అమన్ కూడా టాప్ 5 రేసులో గట్టిగానే నిలబడేటట్టు కనిపిస్తున్నాడు. ఈ లెక్కల ప్రకారం చూస్తే.. త్రిగుణ్, ముకేష్, దేబ్జానీ, అమన్‌లు ముందంజలో ఉన్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మిగిలిన ఐదో బెర్త్ కోసం కొంతమంది కంటెస్టెంట్ల మధ్య పోటీ నెలకొంది. సుధీర్, వర్షిణి, శివ్, ఆర్కేలో ఎవరు ముందుకు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు నరేష్, రాం ప్రసాద్, వంశీ పేర్లు కూడా చర్చలో ఉండగా.. వంశీ విషయంలో ఓట్ల చీలిక వంటి అంశాలు ప్రభావం చూపొచ్చని భావిస్తున్నారు. అయితే నరేష్‌కు కింగ్ నాగార్జున నుంచి వస్తున్న ప్రోత్సాహం వల్ల అతని టాప్ 5 ప్లేస్‌లో అతనికి అవకాశం కూడా ఉండొచ్చన్న టాక్‌ను తీసుకువచ్చింది.

అయితే ఈ అంచనాలన్నింటిని కూడా ఒక్కసారే తారుమారు చేసే సత్తా ఉన్న టికెట్ టు ఫినాలే టాస్క్ ఇంకా ముందుంది. మరి ఆ ఛాన్స్‌ను ఎవరు దక్కించుకుంటారో, ఎవరు డైరెక్టుగా ఫైనల్‌కు చేరుకుంటారో చూడాలి. ప్రస్తుతం హౌస్‌లో సాగుతున్న హోరాహోరీ పోటీ రాబోయే వారాల్లో మరింత ఉత్కంఠ రేపడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Tamil Nadu Data Leak : తమిళనాడు పెట్టుబడుల వివాదం ఏంటి? ఏపీకి డేటా లీక్ అయిందా?

Related Articles

Back to top button