Lava Smart 4 Pro : పవర్ ఫుల్ బ్యాటరీ, ఐఫోన్ లుక్..రూ.10,999 కే అదిరిపోయే ఫీచర్లు..
Lava Smart 4 Pro : 7,000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 ఓఎస్, 90Hz డిస్ప్లేతో లావా స్మార్ట్ 4 ప్రో ఇండియాలో రిలీజ్ అయింది. కేవలం రూ.10,999 ధరలో లభించే ఈ ఫోన్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Lava Smart 4 Pro
భారతీయ స్మార్ట్‌ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లావా బడ్జెట్ ధరలో లేటెస్ట్ ఫీచర్లతో సరికొత్త ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లోకి రిలీజ్ చేసింది. లావా స్మార్ట్ 4 ప్రో పేరుతో రిలీజ్ అయిన ఈ హ్యాండ్సెట్ మెయిన్ దాని 7,000mAh కెపాసిటీ గల భారీ బ్యాటరీతో మొబైల్ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. కేవలం రూ.10,999 ధర నిర్ణయించిన ఈ ఫోన్‌ను దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆఫ్‌లైన్ రిటైల్ నెట్వర్క్ ద్వారా సేల్ చేస్తున్నారు.
లావా స్మార్ట్ 4 ప్రో(Lava Smart 4 Pro) డిజైన్ విషయానికి వస్తే, ఫ్లాట్-ఎడ్జ్ బాడీతో ప్రీమియం లుక్‌తో క్యూట్‌గా కనిపిస్తోంది. చిన్నచిన్న ప్రమాదాలు, కింద పడటాల నుంచి ప్రొటెక్షన్ కల్పించడానికి MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్‌తో దీనిని రూపొందించారు. దీనిలో 6.75 అంగుళాల HD+ వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లేను అమర్చారు. 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేయడం వల్ల స్క్రోలింగ్, గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది.
ఫోన్ పనితీరు కోసం UNISOC T610 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను యూజ్ చేశారు. దీనిలో 4GB ఫిజికల్ ర్యామ్‌తో పాటు 4GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉండటంతో మొత్తం 8GB వరకు ర్యామ్ కెపాసిటీని పొందొచ్చు. 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు పెంచుకునే వెసులుబాటును కల్పించారు. ఫోటోగ్రఫీకి సంబంధించి వెనుకవైపు 13MP మైక్రో/ప్రధాన కెమెరా, సెల్ఫీల కోసం 5MP ఫ్రంట్ కెమెరా అందించారు.
7,000mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్‌కు ఉన్న మరో అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా నిలుస్తోంది. దీనికి 18W ఫాస్ట్ ఛార్జింగ్, USB టైప్-సి పోర్ట్ సపోర్ట్ ఉంటుంది. కొత్త ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే ఈ ఫోన్లో ఎటువంటి బ్లోట్‌వేర్ యాప్స్ లేదా యాడ్స్ ఉండవని కంపెనీ హామీ ఇస్తోంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్‌తో పాటు టూ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ను ఇస్తారు. బ్లూ, కోణార్క్ గోల్డ్ కలర్స్‌లో లభించే ఈ ఫోన్‌పై వన్ ఇయర్ వారంటీతో పాటు ఇంటి వద్దకే వచ్చి ఫ్రీగా సర్వీస్ చేసే ఫ్రీ సర్వీస్ అట్ హోమ్ ఫెసిలిటీని కూడా లావా అందిస్తోంది.





