Confession Room : బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్‌లో వర్షిణి కన్నీరు.. అమన్,ముఖేష్‌కు నాగార్జున క్లాస్..
Confession Room : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 వీకెండ్ ఎపిసోడ్‌లో కన్ఫెషన్ రూమ్‌లో వర్షిణి ఏం చేసింది? త్రిగుణ్‌తో గొడవ, కెప్టెన్ అమన్, ముఖేష్, స్నేక్ టాస్క్ ఫౌల్‌పై నాగార్జున ఏమన్నారు?
Confession Room
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంటున్న కొద్దీ హౌస్‌లో క్యూరియాసిటీ, ఎమోషన్స్ లెవెల్ తారాస్థాయికి చేరుకుంది. వారం గడిచే కొద్దీ కంటెస్టెంట్ల మధ్య మాటల తూటాలు, గ్రూపుల మధ్య లెక్కలు మరింతగా హీటెక్కుతున్నాయి. దీనిలో భాగంగా వీకెండ్ జడ్జిమెంట్ కోసం వచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్‌లోని కంటెస్టెంట్స్ తీరును ఓ రేంజ్‌లో ఎండగట్టారు.
బిగ్ బాస్ హౌస్ వాతావరణం గురించి నాగార్జున అడగ్గా, వర్షిణి కన్ఫెషన్ రూమ్(Confession Room)లో బాగా ఎమోషనల్ అయింది. ఇంట్లో తొమ్మిది మంది ఒకవైపు చేరి గ్యాంగ్‌గా మారారని.. ముఖేష్‌ను, తనను ఒంటరిని చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, త్రిగుణ్ తన క్యారెక్టర్‌ను టార్గెట్ చేసి మాట్లాడాడని నాగార్జున వద్ద కన్నీళ్లు పెట్టుకుంది.
అయితే, వెంటనే నాగ్ వీడియో ఫుటేజ్‌ను ప్లే చేసి.. త్రిగుణ్ ఆ వెంటనే వర్షిణికి పూర్తి వివరణ ఇచ్చాడని చెబుతూనే.. వర్షిణి మైండ్‌లో ఏం రన్ అవుతుందో కూడా బయటపెట్టారు. ఆ వెంటనే త్రిగుణ్‌ను కూడా కన్ఫెషన్ రూమ్(Confession Room)లోకి పిలిపించి, ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలపై క్లారిటీ ఇచ్చారు.
ఇక కెప్టెన్ అయిన తర్వాత అమన్ బిహేవియర్‌పై నాగార్జున బాగా క్లాస్ పీకారు. ఎక్కువ ప్రెజర్‌లో ఉన్నప్పుడే మనిషి ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతుందని .. పాలు పొంగిన సందర్భంలో ముఖేష్‌ను ఉద్దేశించి అమన్ చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియోను వేసి మరీ నిలదీశారు.
ముఖేష్ సమయానికి పనులు చేయడని, అతని ఈగో వల్లే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని అమన్ చెప్పాడు. దీంతో కెప్టెన్సీ అనేది పవర్ కాదని, అది ఒక రెస్పాన్సిబిలిటీ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు నాగ్. ముఖేష్‌కు బయట మంచి స్టార్‌డమ్ ఉందని గుర్తు చేస్తూనే అలాంటి వాడిని ఆలోచించి హ్యాండిల్ చేయాలే తప్ప ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నష్టం అమనే అంటూ క్లాస్ పీకారు.
అంతే కాదు ఇటు ముఖేష్ బిహేవియర్‌పైన కూడా నాగార్జున గట్టిగానే ఫైర్ అయ్యారు. గేమ్ తీరు, బిహేవియర్ వల్ల బయట ఉన్న స్టార్‌డమ్, ఆడియన్స్ ఆదరణ పోగొట్టుకునే ప్రమాదం ఉందని ముఖేష్‌ను వార్నింగ్ ఇచ్చారు. త్రిగుణ్ బాగా ఆడుతున్నా.. ఆ రౌండ్‌ను క్యాన్సిల్ చేయడం వెనుక రీజన్స్‌ను ప్రశ్నించారు.
మరోవైపు స్విమ్మింగ్ పూల్‌లో బట్టలు పడేయడంపై వర్షిణి, ముఖేష్ మధ్య జరిగిన గొడవలో ఎవరిది తప్పనే దానిపైన కూడా డిస్కస్ చేశారు. తర్వాత స్నేక్ టాస్క్, బాస్కెట్ ఫౌల్ విషయంలో తలెత్తిన గొడవ వీడియో చూపించి నాగార్జున క్లారిటీ ఇచ్చారు. బాక్స్ కింద పడిన తర్వాతే దానిని తీసుకోవాలని అమన్‌కు చెప్పిన నాగ్.. ఒకవేళ నువ్వు సంచాలక్ అయితే ఏం డెసిషన్ తీసుకుంటావని వర్షిణిని అడగ్గా.. బాస్కెట్‌ను లాగడం కచ్చితంగా ఫౌల్ ఇస్తానని చెప్పింది.





