Just LifestyleLatest News

Guava : ఆపిల్‌ను మించిన పోషకాలు..షుగర్ కంట్రోల్ నుంచి వెయిట్ లాస్ బెస్ట్ ఫ్రూట్

Guava : తక్కువ ధరకే లభించే జామపండులో ఉండే పోషకాలు, విటమిన్స్ ఏంటి? మలబద్ధకం, షుగర్ నియంత్రణకు జామ మేలు చేస్తుందా?

Guava

మనకు మార్కెట్లో ఎక్కువగా, అన్ని ఫ్రూట్స్ కంటే తక్కువ ధరకే లభించే పండ్లలో జామపండు ఒకటి. చవకగా దొరుకుతాయనే కారణమో ఏదో తెలీదు కానీ వాటిని చాలామంది పెద్దగా పట్టించుకోరు. కానీ జామకాయ(Guava) విషయంలో ఆ అభిప్రాయం ముమ్మాటికి తప్పు అని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తక్కువ ధరకే లభించినా కూడా దీనిలో లభించే పోషకాలు మరే ఇతర కాస్ట్‌లీ పండ్లలోనూ దొరకవని అంటున్నారు. అందుకే జామకాయను పేదల ఆపిల్ అని పిలుస్తారు.

జామపండులో అద్భుతమైన పోషకాలతో పాటు ఫైబర్ పీచు పదార్థం(Fiber) సమృద్ధిగా ఉంటుంది. జామ విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. ఇవి బాడీలో రోగనిరోధక శక్తిని పెంచడంలో కీ రోల్ పోషిస్తాయి. ఇది తక్కువ క్యాలరీలు కలిగి ఉండి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. వెయిట్ తగ్గాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. దీనిలో ఎక్కువ పీచు పదార్థం ఉండటం వల్ల కడుపు నిండిన ఫీల్ కలిగి, అతిగా తినడాన్ని అరికడుతుంది. అలాగే మలబద్ధకం సమస్యను తగ్గించడంతో పాటు, బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచడంలో జామ కాయ కీలక పాత్ర పోషిస్తుంది.

పోషకాల పరంగా చూసినా కూడా జామపండు ఇతర పండ్ల కంటే చాలా ముందులో ఉంటుంది. నారింజ పండుతో పోలిస్తే జామకాయలో విటమిన్ సి ఏకంగా ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరల్లో లభించే ఫైబర్ కంటే దీనిలో రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఒకే ఒక్క జామకాయలోనే పది ఆపిల్స్‌కు సమానమైన పోషకాలు ఉంటాయని చెబుతారు. ముఖ్యంగా వింటర్‌లో లభించే ఈ ఫ్రూట్స్‌ను డైలీ ఫుడ్‌లో యాడ్ చేసుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని డైటీషియన్లు సూచిస్తున్నారు.

Box Office : బాక్సాఫీస్ వద్ద బిగ్ క్లాష్.. విశ్వంభర, ఫౌజీ, వారణాసి రిలీజ్ డేట్స్ చేంజ్?

Related Articles

Back to top button