AP Panchayat Elections Phase 2 : నేడే రెండో విడత పంచాయతీ ఎన్నికలు.. 83 లక్షల మంది ఓటర్లు.. 37 వేల పోలింగ్ కేంద్రాలు..
AP Panchayat Elections Phase 2 : ఏపీలో నవంబర్ 29 ఆదివారం రోజు రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. 83 లక్షల మంది ఓటర్లు, 10,295 మంది సర్పంచ్ అభ్యర్థులు, 37,019 పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకోండి.
AP Panchayat Elections Phase 2
ఏపీలో రూరల్ పాలిటిక్స్ మరోసారి ఆసక్తికరంగా మారాయి. పంచాయతీ ఎన్నికల తొలి విడత ప్రాసెస్ పూర్తవడంతో ఇప్పుడు రెండో విడత పోలింగ్(AP Panchayat Elections Phase 2)పై అందరి దృష్టి పడింది. గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల కోసం కేండిడేట్స్ పోటాపోటీగా బరిలో నిలవగా.. ఓటింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నవంబర్ 29వ తేదీన జరగబోతున్న రెండో విడత ఎన్నికల్లో(AP Panchayat Elections Phase 2) ఏపీ వ్యాప్తంగా 83 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. భారీ సంఖ్యలో కేండిడేట్స్ పోటీలో ఉండటంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది.
విశాఖపట్నం జిల్లాలో తప్ప మిగిలిన 27 జిల్లాల్లో కూడా రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 52 డివిజన్లు, 246 మండలాల పరిధిలో పోలింగ్ నిర్వహించడానికి ఎన్నికల యంత్రాంగం రెడీ అయింది. ఈ విడతలో 4,975 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్ ప్రక్రియ చేపట్టారు. వీటిలో 1,095 పంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవమవగా.. మిగిలిన పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
రెండో విడతలో 4,975 సర్పంచ్ స్థానాలకు, 49వేల318 వార్డు సభ్యుల స్థానాలకు ఎలక్షన్ ప్రక్రియ చేపట్టారు. ఇప్పటికే సర్పంచ్ స్థానాల్లో 1,170 ఏకగ్రీవం కాగా మిగిలిన 3,803 స్థానాలకు పోలింగ్ జరగబోతుంది. మరో రెండు పంచాయతీల్లో మాత్రం సర్పంచ్ పదవులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడం హాట్ టాపిక్ అయింది.
పోలవరం జిల్లా ఏటపాక మండలంలోని వెంకటరెడ్డిపాలెం అలాగే వైఎస్ఆర్ కడప జిల్లా కొండాపురం మండలంలోని కె. సుకుమంచిపల్లి గ్రామాల్లో సర్పంచ్ పదవులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
వార్డు సభ్యుల స్థానాల్లో 19,655 ఏకగ్రీవమవగా.. మిగిలిన 29,603 స్థానాలకు ఓటింగ్ నిర్వహించబోతున్నారు. అయితే 60 వార్డు స్థానాలకు ఎవరూ నామినేషన్లు వేయలేదు. సర్పంచ్ పదవుల కోసం 10,295 మంది కేండిడేట్స్, వార్డు సభ్యుల స్థానాల కోసం 63,395 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
రెండవ విడతలో మొత్తం 83,52,338 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 41,05,292 మంది పురుషులు, 42,46,608 మంది మహిళలు కాగా, 438 మంది ఇతరులు ఉన్నారు. జిల్లా వారీగా చూస్తే శ్రీకాకుళంలో ఎక్కువగా 5,65,848 మంది ఓటర్లు ఉన్నారు. ఆ జిల్లాలోని 342 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి.
పోలింగ్ ప్రాసెస్‌ను పర్యవేక్షించడానికి మొత్తం 37,019 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలక్షన్ కమిషన్ హెడ్ క్వార్టర్స్ నుంచి 9,300 కెమెరాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తారు. వీటితో పాటు 8,470 వీడియో గ్రఫీ ఏర్పాట్లు అలాగే 5,186 వెబ్‌కాస్టింగ్ సదుపాయాలతో పాటు 3,469 ఇతర పర్యవేక్షణ ఏర్పాట్లు చేశారు.
మొత్తంగా రెండో విడత ఎన్నికలు(AP Panchayat Elections Phase 2) ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ భద్రత, పటిష్టమైన నిఘా మధ్య కాసేపట్లో జరగనున్న ఈ పోలింగ్‌లో గ్రామీణ ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.





