Just Andhra PradeshJust PoliticalLatest News

Mana Mitra : ఏపీలో గుంతల రోడ్లకు చెక్..వాట్సాప్‌లో ఒక్క ఫొటో పంపితే చాలు..

Mana Mitra : ఆంధ్రప్రదేశ్‌లోని రహదారులను గుంతల రహితంగా మార్చడానికి ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికోసం ఫిర్యాదు చేయాలంటే ఏం చేయాలి?

Mana Mitra

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల రూపురేఖలను మార్చడానికి ప్రభుత్వం కొత్త ప్రజాస్వామ్య రహిత విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. నిత్యం ప్రయాణికులకు నరకం చూపిస్తున్న గుంతల రోడ్ల ప్రాబ్లెమ్‌కు శాశ్వత పరిష్కారాన్ని చూపించే దిశగా మనమిత్ర(Mana Mitra) పేరుతో ప్రత్యేక వాట్సాప్ బేస్‌డ్‌ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. రోడ్లపై ప్రయాణిస్తున్నపుడు ఎక్కడైనా గుంతలు కనిపిస్తే, వెంటనే ప్రజలు వాటిని తమ మొబైల్ ఫోన్లలో ఫోటో తీసి ప్రభుత్వానికి పంపడం ద్వారా డైరెక్టుగా ఫిర్యాదు చేయవచ్చు.

ఈ వినూత్న సేవలకు సంబంధించి రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) క్లియర్ గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. రోడ్లపై ఉన్న గుంతలకు సంబంధించిన కంప్లైంట్‌లు చేయడానికి ..9552300009 అనే ప్రత్యేక వాట్సాప్ నెంబర్‌ను కేటాయించింది. ప్రజలు ముందుగా ఈ నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్క్రీన్‌పై వచ్చే సూచనల ప్రకారం ఆధార్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. తర్వాత గుంత స్పష్టంగా కనిపించే ఫొటోతో పాటు, ఆ ప్రాంతానికి సంబంధించిన కరెంట్ లొకేషన్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఇలా వాట్సాప్ ద్వారా పంపిన కంప్లైంట్స్‌ను ఆర్టీజీఎస్ విభాగం వెంటనే పరిశీలిస్తుంది. అందిన ఫోటో, లొకేషన్ వివరాలను బేస్ చేసుకుని ఆ రహదారి పంచాయతీరాజ్, మున్సిపల్, ఆర్‌అండ్‌బీ లేదంటే నేషనల్ హైవేస్ డిపార్ట్‌మెంటులలో దేని పరిధిలోకి వస్తుందో అలా వర్గీకరిస్తారు. వెంటనే ఆ ఇన్ఫర్మేషన్‌ను సంబంధిత శాఖ గ్రౌండ్ లెవల్ అధికారులకు పంపి, వేగంగా రిపేర్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదు చేసినవారు కూడా తాము పంపిన కంప్లైంట్ ఏ స్టేజ్‌ల ఉందో కూడా వాట్సాప్ ద్వారానే ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే అవకాశం ఉంది.

ఏపీ సర్కార్ చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలని అధికారులు కోరుతున్నారు. తమ పరిసర ప్రాంతాల్లో లేదంటే ప్రయాణించే దారిలో రోడ్లు దెబ్బతిని ఉంటే పట్టించుకోకుండా వదిలేయకుండా, వెంటనే మనమిత్ర(Mana Mitra) వాట్సాప్ సర్వీసును ఉపయోగించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Guava : ఆపిల్‌ను మించిన పోషకాలు..షుగర్ కంట్రోల్ నుంచి వెయిట్ లాస్ బెస్ట్ ఫ్రూట్

Related Articles

Back to top button