Bigg Boss: బిగ్ బాస్‌లో మిస్ అయిన ఒక్క ఛాన్స్ .. మూడు రెడ్ కార్డులతో మన్మథరావు
Bigg Boss: ఈరోజు ఆడిషన్స్‌లో పాల్గొన్న వారిలో ఎవరు సెలక్ట్ అయ్యారు, ఎవరు హోల్డ్‌లో ఉన్నారు, ఎవరు రిజెక్ట్ అయ్యారంటే..

Bigg Boss
బిగ్ బాస్ సీజన్ 9కి ముందే బిగ్ బాస్ అగ్నిపరీక్ష పేరుతో బిగ్ బాస్ (Bigg Boss)సందడి మొదలయింది. బిగ్ బాస్‌కి వెళ్లడానికి కలలు కనే సామాన్యుల్లో 20 మందిని సెలెక్ట్ చేసి.. వాళ్లకి ‘అగ్ని పరీక్ష’ పేరుతో ఇప్పుడు ఆడిషన్స్ అదరగొడుతున్నాయి. ఈ షోకి యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా.. సూపర్ జడ్జీగా వ్యవహరిస్తుంది. కాగా దీనికి నవదీప్, బిందుమాధవి, అభిజిత్‌లు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. హాట్ స్టార్‌లో ఈ అగ్నిపరీక్షకి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాగా భారీ రెస్పాన్స్ వచ్చింది.
మినిమం డిగ్రీ అంటూ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించిన మల్టీస్టార్ మన్మథరావు, బిగ్‌బాస్(Bigg Boss) హౌస్‌లోకి వెళ్లాలనే కలను నిజం చేసుకోవడానికి ఆడిషన్స్‌లో బాగా కష్టపడ్డాడు. అయినా కూడా అతను ఎంపిక కాలేదు.
బిగ్‌బాస్(Bigg Boss) సెలక్షన్ ప్రాసెస్ అయిన ‘అగ్నిపరీక్ష’ లో మన్మథరావు సహా మొత్తం 8 మంది పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్‌కు జడ్జీలుగా అభిజిత్, బిందు మాధవి, నవదీప్ వ్యవహరించారు. వారిలో ఇద్దరు ఎంపిక కాగా, మిగిలిన వారిలో మన్మథరావు సహా ఐదుగురు రిజెక్ట్ అయ్యారు.

ఆడిషన్స్‌లో ఏమి జరిగిందంటే..వేదికపైకి వచ్చిన మన్మథరావు, ‘బిగ్‌బాస్‌కి వెళ్తున్నా, తెలుగు ఇండస్ట్రీలో నెం.1 హీరో అవుతా’ అని ఎంతో కాన్ఫిడెంట్‌తో చెప్పాడు. హోస్ట్ శ్రీముఖికి సాష్టాంగ నమస్కారం చేసి, ‘ఒక్క అవకాశం ఇవ్వండి’ అని ప్రాధేయపడ్డాడు. కానీ, అతని ఈ ప్రవర్తన జడ్జీలకు నచ్చలేదు. నవదీప్ మొదటి నుంచే ‘రెడ్ బోర్డు’ చూపించాడు.
అభిజిత్ తన వ్యక్తిగత వివరాలను అడగ్గా, మన్మథరావు కన్నీరు పెట్టుకున్నాడు. తన అసలు పేరు కాతోజు రామాచారి అని, నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడకు చెందిన నిరుపేద కుటుంబం నుంచి వచ్చానని చెప్పాడు. తల్లిదండ్రులు ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో చనిపోయారని, జీరో నుంచి హీరో కావాలని ఇండస్ట్రీకి వచ్చానని, కానీ అవకాశాలు రాలేదని వివరించాడు. తన ‘మినిమం డిగ్రీ’ డైలాగ్‌తోనే ఫేమస్ అయ్యానని బోరున ఏడ్చాడు.
మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బిందు మాధవి ‘ధర్నా’ గురించి ప్రశ్నించగా, ‘ఎక్కడికి పోవాలో తెలియక, బిగ్‌బాస్ ముందు కూర్చున్నా.. నాగార్జున గారి దాకా నా వీడియో వెళ్తుందని అనుకున్నా’ అని బదులిచ్చాడు. జడ్జీలు అతని టాలెంట్‌ను చూపించమని కోరగా, అతను కొన్ని డైలాగులు చెప్పి యాక్టింగ్ చూపించాడు. అయితే, అది జడ్జీలను ఆకట్టుకోలేకపోయింది. దీంతో అభిజిత్, బిందు మాధవి కూడా రెడ్ బోర్డులు చూపించడంతో అతని ఆడిషన్ ముగిసింది. మన్మథరావు మళ్లీ పొర్లు దండాలు పెట్టగా, శ్రీముఖి అతన్ని బయటికి పంపించింది.
ఈరోజు ఆడిషన్స్‌లో పాల్గొన్న వారిలో ఎవరు సెలక్ట్ అయ్యారు, ఎవరు హోల్డ్‌లో ఉన్నారు, ఎవరు రిజెక్ట్ అయ్యారంటే..
- దివ్య (విజయవాడ) – సెలక్టెడ్ (మూడు గ్రీన్)
- హరీష్ (విజయవాడ) – హోల్డ్‌లో పెట్టారు (నవదీప్ మాత్రమే గ్రీన్)
- కేతమ్మ (నల్గొండ) – హోల్డ్‌లో పెట్టారు (అభిజిత్ మాత్రమే గ్రీన్)
- ప్రియ (కర్నూలు) – హోల్డ్‌లో పెట్టారు (రెండు గ్రీన్, ఒక రెడ్)
- మల్టీస్టార్ మన్మథరావు (మిర్యాలగూడ) – రిజెక్ట్ (మూడు రెడ్)
- అబు బాకర్ (రైల్వే కోడూరు) – హోల్డ్‌లో పెట్టారు (బిందు మాత్రమే రెడ్)
- మాధురి (విశాఖపట్నం) – రిజెక్ట్ (మూడు రెడ్)
- ప్రసన్న (హైదరాబాద్) – సెలక్టెడ్ (మూడు గ్రీన్)
రేపటి ఎపిసోడ్‌లో ఇంకెంతమంది అగ్నిపరీక్షకు వస్తారో, ఎవరు సెలెక్ట్ అవుతారో చూడాలి.