Steering: విదేశాల్లో ఎడమ వైపు స్టీరింగ్ ఎందుకు? దీనికో చరిత్ర కూడా ఉందట..
Steering: ప్రపంచంలో దాదాపు 165 దేశాల్లో కుడివైపు ప్రయాణం, మిగతా 75 దేశాల్లో ఎడమ వైపు స్టీరింగ్‌తోనే ప్రయాణం సాగిస్తున్నారు

Steering
భారతదేశంలో మనం రోడ్డుపై ఎడమ వైపు ప్రయాణిస్తాం, కాబట్టి కార్ల స్టీరింగ్ కుడి వైపున ఉంటుంది. కానీ అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, యూఏఈ వంటి చాలా దేశాల్లో కుడి వైపు ప్రయాణిస్తారు, అందుకే అక్కడి కార్ల స్టీరింగ్‌లు(Steering) ఎడమ వైపున ఉంటాయి. ఈ భిన్నమైన ట్రాఫిక్ నియమాలకు బలమైన చారిత్రక కారణాలు ఉన్నాయని చరిత్ర చెబుతోంది.
ప్రపంచంలో దాదాపు 165 దేశాల్లో కుడివైపు ప్రయాణం, మిగతా 75 దేశాల్లో ఎడమ వైపు స్టీరింగ్‌తోనే ప్రయాణం సాగిస్తున్నారు. అంటే మన దేశంలో కుడివైపున ఉండే స్టీరింగ్(Steering), విదేశాల్లో ఎడమవైపున ఉండటానికి చారిత్రక కారణం కూడా ఉంది..
ప్రాచీన కాలంలో గుర్రపు బండ్లు లేదా సైనికులు గుర్రాలపై ప్రయాణించేటప్పుడు కత్తిని కుడి చేతిలో పట్టుకునేవారు. కత్తితో దాడి చేయాలనుకున్నప్పుడు లేదా బండిపై కుడి వైపు నుంచి వచ్చే వారిని ఎదుర్కొనేందుకు వీలుగా ప్రయాణించే పద్ధతి ఉండేది. ఇదే విధానం చాలా దేశాలలో కొనసాగింది.

Bigg Boss:బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో ఒక ఆట ఆడుకుంటున్న నవదీప్
అయితే ఫ్రాన్స్‌లో గుర్రపు బండ్లు నడిపేవారు బండిపై కూర్చోవడానికి స్థలం లేకపోవడంతో గుర్రం మీద ఎడమవైపు కూర్చుని బండి(Steering)ని నడిపేవారు. ఈ క్రమంలో కుడి వైపు నుంచి వచ్చే బండ్లను గమనించడం సులభంగా ఉండేది. ఈ కారణంతో ప్రయాణాన్ని కుడి వైపునకు మార్చారు.
ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ తన పాలనలో ఉన్న దేశాల్లో ఈ పద్ధతిని తప్పనిసరి చేశాడు. దీని ద్వారా ఫ్రాన్స్ ప్రభావం ఉన్న దేశాలన్నీ కుడి వైపు స్టీరింగ్‌తో ప్రయాణాన్ని అనుసరించడం మొదలుపెట్టాయి. అయితే బ్రిటన్ మాత్రం ఈ మార్పును అంగీకరించలేదు.
తన పాలనలో ఉన్న భారతదేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఎడమవైపు ప్రయాణించే విధానాన్ని ప్రవేశపెట్టింది. బ్రిటీష్ పాలనలో మన దేశంలో ఈ పద్ధతి అధికారికమై, అదే ఇప్పటికీ కొనసాగుతోంది.
ఇలా చరిత్ర, రాజకీయాలు,ప్రయాణ అవసరాల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ ట్రాఫిక్ విధానాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు కూడా చాలా దేశాలు కుడివైపు ప్రయాణాన్ని అనుసరిస్తున్నా, కొన్ని దేశాలు తమ సంప్రదాయాలను అనుసరిస్తూ ఎడమ వైపు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
One Comment