Bigg Boss: బిగ్ బాస్ అగ్నిపరీక్షలో టాప్ 15.. హౌస్‌లోకి వెళ్లే ఆ ఐదుగురు ఎవరు?
Bigg Boss:ఆరుగురు కంటెస్టెంట్లు ఇప్పటికే జడ్జ్‌ల ఎంపిక ద్వారా గోల్డెన్ సీట్లోకి వెళ్లగా, మిగిలిన తొమ్మిది మందిని ఎంపిక చేయడానికి వివిధ టాస్కులు పెట్టారు.

Bigg Boss
బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఐదో ఎపిసోడ్‌లో టెన్షన్ క్రియేట్ చేస్తూ టాప్ 15 కంటెస్టెంట్లను ప్రకటించారు. ఆరుగురు కంటెస్టెంట్లు ఇప్పటికే జడ్జ్‌ల ఎంపిక ద్వారా గోల్డెన్ సీట్లోకి వెళ్లగా, మిగిలిన తొమ్మిది మందిని ఎంపిక చేయడానికి వివిధ టాస్కులు పెట్టారు.
ఈ (Bigg Boss)ఎపిసోడ్‌కు ‘ఘాటీ’ సినిమా దర్శకుడు క్రిష్ గెస్ట్‌గా వచ్చి స్టేజీపై మరింత సందడి పెంచారు. ప్రత్యేకంగా, గాయని కేతమ్మ పాట విని ముగ్ధుడైన క్రిష్, ఆమెకు తన సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించే అవకాశం ఇవ్వడం ఈ ఎపిసోడ్‌లో ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
అయితే, ఈరోజు టాస్కుల్లో విజేతలను నేరుగా ఎంపిక చేయకుండా, ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. టాస్కులో గెలుపోటములతో సంబంధం లేకుండా, కంటెస్టెంట్ల మొత్తం ప్రదర్శన ఆధారంగా శ్రీముఖి, నవదీప్, అభిజిత్, బిందు మాధవి ఒక్కో కంటెస్టెంట్‌ను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఒకదాని తర్వాత ఒకటిగా కఠినమైన టాస్కులు కంటెస్టెంట్లను ఉక్కిరిబిక్కిరి చేశాయి.
ముఖంపై నీళ్లు చల్లుకునే టాస్కుకు మనీష్ ముందుకు రాగా, నాగ, ఊర్మిళలకు చేతులకు వైబ్రేటర్స్ పెట్టి డ్రాయింగ్ వేయాలనే విచిత్రమైన టాస్క్ ఇచ్చారు. ఇందులో ఊర్మిళ గెలిచిందని క్రిష్ ప్రకటించగా, నాగ మాత్రం తన వైబ్రేటర్ పనిచేయలేదని నిజాయితీగా చెప్పి జడ్జ్‌లను మెప్పించాడు.
ఆ తర్వాత, షర్ట్ విప్పి వాక్సింగ్ చేయించుకునే భయంకరమైన టాస్కులో శ్రీతేజ్, మనీష్ పోటీపడ్డారు. మొదట షర్ట్ విప్పడానికి మనీష్ నిరాకరించినా, ఆ తర్వాత ఒప్పుకున్నాడు. అయితే అతని ఒంటిపై వెంట్రుకలు లేకపోవడంతో నాగకు అవకాశం లభించింది. ఈ టాస్కులో శ్రీతేజ్, నాగ ఇద్దరూ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చి జడ్జ్‌ల ప్రశంసలు అందుకున్నారు.

చివరగా, షాకిబ్ , నిఖిత తమ ఫోన్‌లను సుత్తితో పగలగొట్టుకునే టాస్కుకు సిద్ధపడ్డారు. ఈ టాస్కుల్లో చూపించిన తెగువ, వారి మొత్తం ప్రదర్శన ఆధారంగా శ్రీముఖి, నవదీప్, అభిజిత్, బిందు మాధవి తమకు నచ్చిన నలుగురు కంటెస్టెంట్లను ఎంపిక చేశారు. శ్రీముఖి మనీష్‌ను, బిందు.. దాల్యాని, అభిజిత్ ..నాగాను, నవదీప్.. షాకిబ్‌ను టాప్ 15లోకి పంపారు.
Steering: విదేశాల్లో ఎడమ వైపు స్టీరింగ్ ఎందుకు? దీనికో చరిత్ర కూడా ఉందట..
ఈ (Bigg Boss)అగ్నిపరీక్షలో నెగ్గిన అనూష, ప్రసన్న కుమార్, దాల్య షరీఫ్, డిమాన్ పవన్, దివ్య ఏలుమూరి, హరిత హరీష్, కల్కి, కళ్యాణ్ పడాల, మనీష్ మర్యాద, నాగ, ప్రియా శెట్టి, శ్రీయా, శ్వేత శెట్టి, శ్రీజ దమ్ము, సయ్యద్ షకీబ్ ఇప్పుడు టాప్ 15లోకి చేరుకున్నారు.
అయితే, వీరిలో కేవలం ఐదుగురు మాత్రమే బిగ్ బాస్(Bigg Boss) ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఆడియన్స్ ఓటింగ్ ఆధారంగానే ఈ ఐదుగురిని ఎంపిక చేయనున్నట్లు ప్రకటించిన బిగ్ బాస్ .. ఓటింగ్ లైన్స్ సెప్టెంబర్ 5 వరకు తెరిచి ఉంటాయని, ఎక్కువ ఓట్లు సాధించినవారికే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పారు. దీంతో వారి బిగ్ బాస్ హౌజ్ ఎంట్రీ ఆడియన్స్ చేతిలో పడింది.