Cow : ఆ ఆవు ధర అక్షరాలా రూ. 40 కోట్లు..ఎక్కడ? ఏంటి దీని స్పెషల్?
Cow :ఈ ఆవు గతంలో "మిస్ సౌత్ అమెరికా" టైటిల్‌ను గెలుచుకుంది. టెక్సాస్‌లో జరిగిన "చాంపియన్ ఆఫ్ ది వరల్డ్" పోటీలో కూడా విజేతగా నిలిచింది.

Cow
బంగారం కూడా ఈ వార్త వింటే కళ్లు తేలేస్తుందేమో. అవును ఎందుకంటే సాధారణంగా ఒక వాహనం ధర కోట్లలో ఉంటుంది. కానీ ఒక పశువు ధర రూ. 40 కోట్లు అంటే నమ్ముతారా? ఇది నిజం! ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక ఆవు గురించే మాట్లాడుకుంటోంది. దాని పేరే ‘వయాటినా-19’. భారతీయ మూలాలున్న ‘నెలోర్’ జాతికి చెందిన 53నెలల వయసున్న ఈ ఆవు, అక్షరాలా రూ. 40 కోట్లకు (సుమారు $4.8 మిలియన్లు) అమ్ముడై, తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లోకి ఎక్కింది.
బ్రెజిల్లో జరిగిన వేలంలో ఈ అద్భుతమైన ఆవును కొనుగోలు చేశారు. సాధారణంగా నెలోర్ జాతి ఆవు( cow )ల కంటే రెట్టింపు బరువుతో, దాదాపు 1,101 కిలోల బరువు, అద్భుతమైన శారీరక నిర్మాణంతో ఇది ప్రత్యేకంగా నిలిచింది. అంతేకాదు, ఈ ఆవు గతంలో “మిస్ సౌత్ అమెరికా” టైటిల్‌ను గెలుచుకుంది. టెక్సాస్‌లో జరిగిన “చాంపియన్ ఆఫ్ ది వరల్డ్” పోటీలో కూడా విజేతగా నిలిచింది. ఒక పశువుకు ఇంతటి అంతర్జాతీయ గుర్తింపు రావడం నిజంగా అరుదయిన విషయమే.

Addiction: స్క్రీన్ వ్యసనం.. మీ మెదడుపై నిశ్శబ్ద దాడి ..దీనికి పరిష్కారం లేదా?
ధర వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. వయాటినా-19’ని కేవలం దాని అందం కోసం కొనలేదు. ఈ ఆవుకు ఉన్న అసాధారణమైన జన్యు లక్షణాలు, శాస్త్రీయ బ్రీడింగ్‌లో ఇది అందించే మెరుగైన ఎముకల నిర్మాణం, కండరాల బలం.. ఇవన్నీ దాని ధరను పెంచాయి. ముఖ్యంగా, ఇది కేవలం గడ్డి తిని కూడా అద్భుతమైన శరీర నిర్మాణాన్ని కలిగి ఉండటం దీని ప్రత్యేకత. అందుకే, దీని ఎంబ్రియోలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది.
అంతేకాదు మాంసం ఉత్పత్తిలో బ్రెజిల్ అగ్రస్థానంలో ఉంది. అక్కడ ఉన్న పశువుల్లో దాదాపు 80% వరకు జెంబు (భారతీయ మూలాలున్న) జాతికి చెందినవే. వయాటినా-19 లాంటి పశువుల ద్వారా ఈ జాతిలో మరింత మెరుగైన జన్యు లక్షణాలను సృష్టించవచ్చని బ్రీడర్లు భావిస్తున్నారు. అందుకే ఇది ఒక సాధారణ అమ్మకం కాదు, భవిష్యత్ వ్యవసాయ రంగంలో ఇది ఒక పెద్ద పెట్టుబడి. ఒక సాధారణ పశువు ప్రపంచానికి ఆదర్శంగా నిలవడం అనేది నిజంగా ఒక అద్భుతం అంటున్నారు.