Addiction: స్క్రీన్ వ్యసనం.. మీ మెదడుపై నిశ్శబ్ద దాడి ..దీనికి పరిష్కారం లేదా?
Addiction: రోజుకు పది నుంచి పన్నెండు గంటలకు పైగా స్క్రీన్‌లను చూసేవారు, తమ మెదడుపై నిశ్శబ్దంగా జరుగుతున్న దాడిని గమనించడం లేదు.

Addiction
మీ చేతిలో ఉన్న ఫోన్(addiction), మీ ముందున్న ల్యాప్‌టాప్‌కు అతుక్కుపోయి గంటల తరబడి గడిపితే, అవి మీ మెదడును మెల్లగా నాశనం చేస్తాయని మీకు తెలుసా? రోజుకు పది నుంచి పన్నెండు గంటలకు పైగా స్క్రీన్‌లను చూసేవారు, తమ మెదడుపై నిశ్శబ్దంగా జరుగుతున్న దాడిని గమనించడం లేదు. ఈ “డిజిటల్ ఓవర్‌లోడ్” వల్ల మీ జ్ఞాపకశక్తి, ఏకాగ్రత దెబ్బతింటున్నాయి.నిజం చెప్పాలంటే, మీరు ఫోన్ చూడటం మానేయలేకపోవడానికి కారణం అది మీ మెదడులోని డోపమైన్ వ్యవస్థను హైజాక్ చేయడమే.
స్క్రీన్ల వెనుక దాగి ఉన్న శాస్త్రీయ నిజాలు..ఎక్కువ స్క్రీన్ టైమ్ మన మెదడులోని డోపమైన్ వ్యవస్థను అతిగా ప్రేరేపిస్తుంది. డోపమైన్ అంటే మనకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే హార్మోన్. సోషల్ మీడియా నోటిఫికేషన్లు, కొత్త లైకులు, షేర్లు వచ్చినప్పుడు మన మెదడుకు ఇది ఒక చిన్న “రివార్డ్” లాంటిది. ఇది మన మెదడును త్వరగా అలవాటుపడేలా చేసి, మన ఫోకస్‌ను తగ్గిస్తుంది. ఫలితంగా, మనం ఒక పనిపై ఎక్కువసేపు ఏకాగ్రత చూపలేకపోతున్నాం.

అంతేకాకుండా, సోషల్ మీడియా నుంచి వచ్చే నిరంతర నోటిఫికేషన్లు మన మెదడులోని ‘ఫైట్-ఆర్-ఫ్లైట్’ స్పందనను తరచుగా యాక్టివేట్ చేస్తాయి. దీని వల్ల అనవసరమైన ఆందోళన, ఒత్తిడి, మూడ్ స్వింగ్స్ పెరిగి మన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. రాత్రిపూట ఫోన్‌లు వాడటం వల్ల వచ్చే బ్లూ లైట్ నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటుంది. దీని వల్ల నిద్రలేమి, కలత నిద్ర వంటి సమస్యలు వస్తున్నాయి.
ఈ సమస్యలన్నిటికీ ఒక సరళమైన పరిష్కారం ఉంది, అదే డిజిటల్ డిటాక్స్. ఇది మన మెదడుకు ఒక రీసెట్ బటన్‌లా పనిచేస్తుంది. దీనివల్ల మన మెదడులోని రసాయన సమతుల్యత తిరిగి వస్తుంది. మానసిక ఆరోగ్య నిపుణులు కొన్ని సాధారణ అలవాట్లను సూచిస్తున్నారు:
రోజుకు ఒకట్రెండు గంటలు.. రోజులో కనీసం ఒకటి లేదా రెండు గంటలు మీ ఫోన్(addiction)ను పూర్తిగా పక్కన పెట్టండి. ఆ సమయంలో పుస్తకాలు చదవండి, సంగీతం వినండి లేదా నడవడానికి వెళ్లండి.
వారానికి ఒకసారి విరామం.. వారానికి ఒక్క రోజు అయినా సోషల్ మీడియా నుంచి పూర్తిగా దూరంగా ఉండండి. మీ స్నేహితులను నేరుగా కలవండి లేదా మీకు నచ్చిన హాబీని ప్రాక్టీస్ చేయండి.
నిద్రకు ముందు స్క్రీన్ ఫ్రీ.. రాత్రి పడుకునే ఒక గంట ముందు నుంచి ఫోన్(addiction), టీవీ, ల్యాప్‌టాప్‌లకు పూర్తిగా దూరంగా ఉండండి. దీనివల్ల మీ మెదడు ప్రశాంతంగా నిద్రకు సిద్ధమవుతుంది.
శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నట్టుగా, కేవలం ఏడు రోజుల పాటు డిజిటల్ డిటాక్స్ చేయడం వల్ల మెదడు పనితీరు ఇరవై శాతం వరకు మెరుగుపడుతుంది. దీంతో ఏకాగ్రత, ఉత్పాదకత, నిద్ర నాణ్యత బాగా పెరుగుతాయి. సాంకేతికతను పూర్తిగా వదిలేయడం కాదు, దానిని మన జీవితంలో ఒక భాగం చేసుకుంటూనే, మెదడుకు సరైన విశ్రాంతిని ఇవ్వడం చాలా ముఖ్యం అని గుర్తు పెట్టుకోండి.
One Comment