Just NationalLatest News

Post office:ప్రపంచంలోనే ఎత్తయిన పోస్టాఫీస్.. మన భారతదేశంలోనే !

Post office:ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే టూరిస్టులు ఇక్కడి నుంచి తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఉత్తరాలు పంపించి ఆనందిస్తారు.

Post office

టెక్నాలజీ యుగంలో ఫోన్‌లు, ఈమెయిల్‌లు, మెసేజ్‌ల మధ్య మనం ఉత్తరాలను దాదాపుగా మర్చిపోయాం. కానీ, మన దేశంలో ఇంకా ఉత్తరాలకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఒక ప్రత్యేకమైన పోస్టాఫీస్ గురించి మీకు తెలుసా? ఆ పోస్టాఫీస్ ఎక్కడ ఉంది, దాని విశేషాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పోస్టాఫీస్ మన భారతదేశంలోనే, హిమాచల్ ప్రదేశ్‌లోని హిక్కిం గ్రామంలో ఉంది. 1983లో ప్రారంభించిన ఈ పోస్టాఫీస్ సముద్ర మట్టానికి 4,400 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రదేశానికి చేరుకోవాలంటే ఎముకలు కొరికే చలిలో, ప్రమాదకరమైన దారుల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

ఈ పోస్టాఫీస్(Post office) చుట్టుపక్కల ఐదు గ్రామాల ప్రజలకు ఒక ముఖ్యమైన కేంద్రం. ఈ ప్రాంతంలో మొబైల్ సిగ్నల్స్, ఇంటర్నెట్ సౌకర్యాలు చాలా తక్కువగా ఉండటం వల్ల, గ్రామస్థులు ఉత్తరాలు పంపించుకోవడానికి , బ్యాంకు లావాదేవీల కోసం ఈ పోస్టాఫీస్‌పైనే ఆధారపడతారు.

Post office
Post office

ఈ పోస్టాఫీస్(Post office) పర్యాటకులకు కూడా ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే టూరిస్టులు ఇక్కడి నుంచి తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఉత్తరాలు పంపించి ఆనందిస్తారు.

ఈ పోస్టాఫీస్‌లో ఇద్దరు పోస్టుమెన్‌లు పని చేస్తారు. ప్రతిరోజూ సాయంత్రం వారు ఉత్తరాలను దగ్గరలో ఉన్న కాజా పట్టణానికి తీసుకెళ్తారు. మంచు ఎక్కువగా పడినప్పుడు ఈ పోస్టాఫీస్‌ను మూసివేస్తారు. హిక్కిం పోస్టాఫీస్ చరిత్ర, ప్రకృతి , మనుషుల మధ్య ఒక అద్భుతమైన బంధాన్ని తెలియజేస్తుంది.

Kavitha: కూతురిపై సస్పెన్సన్ వేటు వేసిన గులాబీ బాస్..

Related Articles

Back to top button