GST Utsav: స్వదేశీ వస్తువులే వాడండి..జీఎస్టీ ఉత్సవ్ వేళ ప్రధాని పిలుపు
GST Utsav: ముఖ్యంగా సామాన్యులకు అందుబాటులో ఉండే నిత్యావసర వస్తువులు, ఎలక్రానిక్ వస్తువుల ధరలు తగ్గనున్నాయి.

GST Utsav
గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(GST Utsav)… జీఎస్టీగా పిలిచే ఈ విధానాన్ని 2017 నుంచి అమలు చేస్తున్నారు. దాదాపు ఎనిమిదేళ్ళుగా జీఎస్టీలు పెరగడమే కాని తగ్గిన సందర్భం లేదు. ముఖ్యంగా సామాన్యులకు అందుబాటులో ఉండే చాలా వస్తువులపై జీఎస్టీ భారం పడుతూనే ఉంది. అయితే జీఎస్టీలో తొలిసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 400 వస్తువులపై పన్ను భారం తగ్గిపోతోంది. ముఖ్యంగా సామాన్యులకు అందుబాటులో ఉండే నిత్యావసర వస్తువులు, ఎలక్రానిక్ వస్తువుల ధరలు తగ్గనున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ(GST Utsav) కొత్త రేట్లు అందుబాటులోకి రానున్నాయి., ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. జీఎస్టీ సంస్కరణలతో కొత్త చరిత్ర ప్రారంభమైందని చెప్పారు. జీఎస్టీ ఉత్సవ్ మొదలవుతోందని, తద్వారా అన్ని రంగాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని ప్రధాని చెప్పుకొచ్చారు. అదే సమయంలో జీఎస్టీలో కొత్త మార్పులు రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడతాయన్నారు. ఉత్పత్తి చేసేవారితో పాటు వినియోగదారులకు కూడా కొత్త సంస్కరణలతో ప్రయోజనం కలుగుతుందని గుర్తు చేశారు. ఈ నిర్ణయం వెనుక ఎంతో కృషి ఉందని, అన్ని వర్గాలతో చర్చించిన తర్వాత అమల్లోకి తెస్తున్నామని తెలిపారు. జీఎస్టీలో వచ్చిన కొత్త సంస్కరణలతో వస్తు రవాణా ఖర్చులు బాగా తగ్గడంతో పాటు పెట్టుబడులు బాగా పెరుగుతాయన్నారు.

దేశంలో ఎక్కువగా ఉండే పేద, మధ్యతరగతి ప్రజల ఉపయోగించే చాలా వస్తువులపై సున్నా జీఎస్టీ(GST Utsav) ఉంటుందన్నారు. ఈ సందర్భంగా మోదీ కీలక పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా దేశం అడుగులు వేస్తోన్న వేళ విదేశీ వస్తువుల వాడకాన్ని క్రమంగా తగ్గించాలని కోరారు. ప్రతీ ఒక్కరూ స్వదేశీ వస్తువులనే వాడదామని ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు. కొన్నేళ్ళ క్రితం వరకూ స్వదేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువుల నాణ్యత ఎంత అత్యుత్తమంగా ఉండేదో ప్రధాని గుర్తు చేసుకున్నారు. మళ్ళీ మనమంతా ఆ వైభవాన్ని తిరిగి పొందేందుకు కృషి చేయాలన్నారు. మన పరిశ్రమలు ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉండాలన్న ప్రధాని ఉత్పత్తులు కూడా అత్యుత్తమ ప్రమాణాలను అధిగమించాలని పిలుపునిచ్చారు.
కాగా రేపటి నుంచి అమలు కానున్న కొత్త జీఎస్టీ రేట్లలో రెండు స్లాబులు మాత్రమే ఉంటాయి. రెండు శ్లాబ్‌లలో 5 శాతం లేదా 18 శాతం మాత్రమే ఉంటుంది. సబ్బు,షాంపూ,పనీర్, నెయ్యి, వంటి సాధారణ నిత్యావసర వస్తువులతో పాటు ఎలక్ట్రానిక్స్ లో ఏసీ, కారు వంటి వాటి రేట్లు తగ్గుతాయి. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ ను సున్నా లేదా 5 శాతం జీఎస్టీ శ్లాబ్‌లో ఉంచడంతో వాటి రేట్లు కూడా భారీగా తగ్గనున్నాయి.
3 Comments