OG Trailer: ఓజీ ట్రైలర్ వచ్చేసింది పవన్ ఫ్యాన్స్ కు యాక్షన్ మీల్స్
OG Trailer: పవన్ స్టైలిష్ లుక్ ఫ్యాన్స్ కు కిక్ ఇస్తుండగా... థమన్ బీజీఎం మూవీని మరో రేంజ్ కు తీసుకెళ్ళిందని చెబుతున్నారు.

OG Trailer
టాలీవుడ్ లో గత కొంతకాలంగా ఏ మూవీకి రాని హైప్ వచ్చిన ఏకైక సినిమా ఓజీ(“OG”).. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడకి వెళ్ళినా.. అది పొలిటికల్ సభ అయినా.. సినిమా ఈవెంట్ అయినా ఓజీ..ఓజీ అంటూ ఫ్యాన్స్ అరుస్తూనే ఉన్న వీడియోలు చాలా కాలంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఓజీ ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ అడుగుతూనే ఉండగా.. వాయిదాలు పడుతూ చివరికి సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. వర్షం కారణంగా ఈవెంట్ పూర్తి స్థాయిలో జరగకపోవడం, అక్కడ ట్రైలర్ (OG Trailer)కూడా అనుకున్న రీతిలో రిలీజ్ చేయలేకపోవడం ఫ్యాన్స్ కు నిరాశ కలిగించాయి. చివరికి స్టేజ్ పైనే పవన్ పట్టుపట్టి మరీ ట్రైలర్ రిలీజ్ చేయించినప్పటకీ యూట్యూబ్ లో అప్ లోడ్ చేయలేదు.

అయితే ఫ్యాన్స్ కోసం మిగిలిన వర్క్ అంతా కంప్లీట్ చేసి ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్(OG Trailer) చూసిన తర్వాత ఈ మూవీపై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. సాహో మూవీతో యాక్షన్ టేకింగ్ డైరెక్టర్ ప్రశంసలు అందుకున్న సుజిత్ మరోసారి అదే యాక్షన్ ఫార్ములాతో ఓజీని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. కత్తి, తుపాకీ పట్టుకుని పవన్ తనదైన శైలిలో అలరించినట్టు ట్రైలర్(OG Trailer) లో కనిపిస్తోంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ లో పవన్ విశ్వరూపం చూపించాడంటూ ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కనిపించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా… శ్రేయారెడ్డి, శుభలేఖ సుధాకర్, ప్రకాశ్ రాజ్ వంటి స్టార్స్ కీలకపాత్రలో కనిపించారు. పవన్ స్టైలిష్ లుక్ ఫ్యాన్స్ కు కిక్ ఇస్తుండగా… థమన్ బీజీఎం మూవీని మరో రేంజ్ కు తీసుకెళ్ళిందని చెబుతున్నారు.
ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పవన్ మునుపెన్నడూ లేని జోష్ తో కనిపించారు. ఓజీ మూవీ గెటప్ తోనే స్లైలిష్ గా ఈవెంట్ లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కత్తి పట్టుకుని ఫ్యాన్ లో జోష్ పెంచారు. దీంతో భారీ వర్షం ముంచెత్తినా ఫ్యాన్స్ పవన్ కోసం ఎక్కడికీ కదల్లేదు. అటు పవన్ తో పాటు సినిమా యూనిట్ అంతా తడుస్తూనే పవన్ తో కలిసి అభిమానులను అలరించారు. హరిహర వీరమల్లు సినిమా నిరాశపరచడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఓజీ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ కావడం, వీకెండ్ వరకూ హౌస్ ఫుల్ అయినట్టు సినిమా వర్గాలు చెబుతున్నాయి.
2 Comments