Just SpiritualLatest News

Diwali:దీపావళి రోజున ఈ పనులు చేయండి చాలు..లక్ష్మీ కటాక్షంతో పాటు వ్యాపారంలోనూ లాభం

Diwali:దీపావళి రోజు లేదా సాధారణ రోజులలో కూడా, ఉప్పును ఉపయోగించి కొన్ని పనులు చేయడం వల్ల ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది.

Diwali

దీపావళి(Diwali) పండుగ రోజు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ పండుగ రోజున దీపాలను లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. అటువంటి పవిత్రమైన రోజు లేదా సాధారణ రోజులలో కూడా, ఉప్పును ఉపయోగించి కొన్ని పనులు చేయడం వల్ల ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో ఉన్న ప్రతికూల శక్తి (Negative Energy) తొలగిపోయి, సానుకూల శక్తి (Positive Energy) వస్తుందని, దీని ద్వారా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని పండితులు, పెద్దలు సూచిస్తున్నారు.

ఉప్పుతో చేయాల్సిన ప్రధాన పనులు.. దీపావళి(Diwali) రోజు ఒక గాజు సీసా తీసుకుని దాన్ని రాళ్ల ఉప్పుతో నింపాలి. ఈ సీసాను ఇంట్లో లేదా బాత్రూంలో (అక్కడ ప్రతికూల శక్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి) ఒక మూలగా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం బయటకు పోయి, పాజిటివ్ ఎనర్జీ వాతావరణం ఏర్పడుతుంది. ఈ సానుకూల శక్తి లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా కొలువై ఉండటానికి దోహదపడుతుందని చెబుతారు.

వ్యాపార లాభాలతో పాటు ధనవర్షం కోసం ఎర్రటి వస్త్రంలో గుప్పెడు రాళ్ల ఉప్పును మూట కట్టాలి. ఈ ఉప్పు మూటను వ్యాపార స్థలాల్లో లేదా ఇంటిలోని బీరువాలో (డబ్బు నిల్వ ఉంచే చోట) పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి, మంచి లాభాలు వస్తాయని, ఆర్థికంగా డబ్బుల వర్షం కురుస్తుందని నమ్ముతారు.

Diwali
Diwali

ఇదే ఉప్పు మూటను ఇంటి ముఖద్వారానికి (ప్రధాన ద్వారం) కడితే, ఇంటి లోపలికి ఎలాంటి ప్రతికూల శక్తులు రాకుండా అంతా మంచి జరుగుతుందని విశ్వసిస్తారు.

వాస్తు దోష నివారణ , దిష్టి తీయడం..వాస్తు దోషం ఉన్నట్టు అనిపిస్తే, స్నానాల గదిలో లేదా ఇంట్లో ఏదైనా మూల ఒక గాజు బౌల్‌లో ఉప్పుని పెట్టడం వల్ల ఆ దోషాలు తగ్గుతాయంటారు. అలాగే దిష్టి తీయడంలో రాళ్ల ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా లేదా దిష్టి తగిలిందని అనిపించినా, గుప్పెడు రాళ్ల ఉప్పును తీసుకుని సదరు వ్యక్తి చుట్టూ మూడు సార్లు తిప్పి పడేయడం పూర్వం నుంచి ఉన్న ఆచారం.

సుఖ నిద్ర , ఆరోగ్యం కోసం..సుఖ నిద్ర పట్టడానికి, పడుకునే ముందు చిటికెడు ఉప్పును నీళ్లలో వేసి కాళ్లు, చేతులు కడుక్కుంటే ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు.పిల్లలకు రోగాలు ఎక్కువగా రాకుండా ఉండాలంటే, వారానికి ఒకసారి చిటికెడు ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయించాలని పెద్దలు చెబుతారు.

అయితే దిష్టి తీసిన ఉప్పును సాధారణంగా రోడ్డుపై లేదా ఎవరైనా నడిచే చోట వేయకూడదు. ఉప్పును నీటిలో వేయడం (కుళాయి కింద కడగడం లేదా పారుతున్న నీటిలో వేయడం) వల్ల ఆ దిష్టి శక్తి నీళ్లలో కలిసిపోయి, కొట్టుకుపోతుందని భావిస్తారు. దిష్టి తీసిన ఉప్పును నిప్పుపై వేస్తే, అది చిటపటమంటూ పేలి, ఆ ప్రతికూల శక్తి అంతా కాలిపోతుందని నమ్ముతారు.

నోట్..ఈ కథనంలో పొందుపరిచిన విషయాలు కేవలం సాంప్రదాయ విశ్వాసాలు ,పద్ధతులకు సంబంధించినవి. వీటిని శాస్త్రీయంగా నిర్ధారించబడలేదు. వీటిపై నిర్ణయాలు తీసుకునే ముందు, మీ వ్యక్తిగత నమ్మకాలు, ప్రాంతీయ సంప్రదాయాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి.

Bigg Boss: బిగ్ బాస్ 9 లో వైల్డ్ కార్డ్ రచ్చ.. డ్రామాకు తెర లేపిన దివ్వెల మాధురి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button